Workout Tips: హెవీ వర్క్ అవుట్స్‌తో ఆరోగ్యానికి ప్రమాదమా? నిపుణుల సూచనలు మీ కోసం..
ఇటీవల కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, ఏపీ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తదితరులు జిమ్ చేస్తూ గుండె పోటుతో మృతి చెందారు. ట్రెడ్ మిల్, జిమ్ సైకిల్ వంటి వాటితో వర్క్ అవుట్స్ మామూలుగా చేసి, ముఖ్యంగా బరువులు ఎత్తడంపై ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయని ఈ బరువులు ఎత్తడంపైనే దృష్టి పెడుతున్నారు.
ప్రస్తుతం అందరికీ ఆరోగ్య రక్షణపై అవగాహన పెరిగింది. చాలా మంది ఉదయాన్నే లేచి వ్యాయామం దృష్టి పెడుతున్నారు. ఆహార అలవాట్లను కూడా మార్చుకుంటున్నారు. కొంచెం మందైతనే బరువు నిర్వహణకు జిమ్‌కు వెళ్లి మరీ భారీ వర్క్ అవుట్స్ చేస్తున్నారు. అయితే ఇటీవల కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, ఏపీ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తదితరులు జిమ్ చేస్తూ గుండె పోటుతో మృతి చెందారు. ట్రెడ్ మిల్, జిమ్ సైకిల్ వంటి వాటితో వర్క్ అవుట్స్ మామూలుగా చేసి, ముఖ్యంగా బరువులు ఎత్తడంపై ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయని ఈ బరువులు ఎత్తడంపైనే దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా కండరాల బలం పెరగడం, ఎముక సాంద్రత పెరగడం, ద్రవ్య రాశి అదుపులో ఉండడం, కొవ్వు తగ్గడం, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగడం వంటి కారణాల వల్ల వర్క్ అవుట్స్ పై దృష్టి పెడుతున్నారు. ఈ వర్క అవుట్స్ రోజు వారీ కార్యకలాపాలను నిర్వహించడంలో చాలా సాయం చేస్తుంది.
భారీ వర్క్ అవుట్స్ చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో? అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయని గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అధిక బరువులు ఎత్తడం వల్ల కీళ్లు, కండరాలు త్వరగా దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెర్నియేటెడ్ డిస్క్ వంటి వెన్నెముక సంబంధిత సమస్యలను రావచ్చని పేర్కొంటున్నారు. బరువు ఎత్తడం ఒక్కోసారి గుండె ధమనుల పగుళ్లకు కారణం కావచ్చని చెబుతున్నారు. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఇలాంటి వర్క్ అవుట్స్ చేసే ముందు కచ్చితంగా వైద్యులను సంప్రదించి వారి సూచనలకు అనుగుణంగా వర్క్ అవుట్స్ చేయాలని జిమ్ ట్రైనర్స్ చెబుతున్నారు. ఇలాంటి వారికి వైద్యులు సాధారణమైన మితమైన వర్క్ అవుట్స్ చేయాలని సూచిస్తారు. ముఖ్యంగా వృద్ధులకైతే కేవలం వారంలో రెండు సార్లు మాత్రమే ఇలాంటి వ్యాయామాలు చేయాలని వైద్యులు చెబుతున్నారు. బరువు నిర్వహణ ఎంత ముఖ్యమో? శరీర సమతుల్యతను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.
వర్క్ అవుట్స్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- మోస్తరు నుంచి నెమ్మదిగా నియంత్రిచగలిగే వేగంతో రిథమిక్ పద్ధతిలో బరువులు ఎత్తాలి.
- పూర్తిస్థాయి కదలిక ద్వారా బరువులు ఎత్తాలి.
- శ్వాస, ఒత్తిడితో ఉండకుండా, బరువు లిఫ్ట్ చేసే సమయంలో ఊపిరి పీల్చుకోవాలి. దాంతో పాటు సడలింపు దశలో ఊపిరి పీల్చుకోవడం ఉత్తమం
- ఎగువ శరీరం, దిగువ శరీర విషయంలో బరువు ఎత్తే సమయంలో ప్రత్యామ్నాయ విధానం పాటించాలి.
- బరువు శిక్షణను ప్రారంభించేవారు ప్రతి సెట్‌కు 8 నుంచి 12 పునరావృత్తులు ప్రారంభించాలి. బలహీనమైన వ్యక్తులు తక్కువ బరువు 10-15 సార్లు చేయాలి.
- వారానికి రెండు రోజులు మాత్రమే భారీ వర్క్ అవుట్స్ చేయాలి.
- చెస్ట్ ప్రెస్, షోల్డర్ ప్రెస్, ట్రైసెప్స్ ఎక్స్‌టెన్షన్, బైసెప్స్ కర్ల, ఫుల్-డౌన్, లోయర్ బ్యాక్ ఎక్స్‌టెన్షన్, అబ్డామినల్ క్రంచ్, లెగ్ ప్రెస్, లెగ్ కర్ల్, క్యాఫ్ రైజ్ వంటి ఎక్సర్ సైజ్‌లు తరచూ చేయడం ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..