Tamil Nadu CM Stalin: జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ చెమటలు చిందిస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్ వీడియో వైరల్
Tamil Nadu CM Stalin: ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. అవును అందం, ఆస్థి ఎంత ఉన్నా ఆరోగ్యంగా లేకపోతే అవి ఎందుకు పనికిరావు. అందుకనే సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ ఆరోగ్యంగా..
Tamil Nadu CM Stalin: ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. అవును అందం, ఆస్థి ఎంత ఉన్నా ఆరోగ్యంగా లేకపోతే అవి ఎందుకు పనికిరావు. అందుకనే సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ ఆరోగ్యంగా ఉండాలని ఫిట్ నెస్ గా ఉండాలని కోరుకుంటారు. ఈ విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా మంచి అవగాహన ఉంది. 68 ఏళ్ల వయసులో కూడా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కండలు కరిగిస్తూ.. చెమటలు చిందిస్తున్నారు.
సీఎం స్టాలిన్ చాలా ఫిట్ గా, స్లిమ్ గా ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు.. ఇప్పుడు సీఎం గా అధికారంలో ఉన్నా స్టాలిన్ ఒక్క రోజు కూడా వర్కౌట్స్ చేయకుండా ఉండరని తెలుస్తోంది. చెన్నై లోని జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. ప్రొఫెషనల్ ట్రైనర్ సమక్షంలోనే స్టాలిన్ జిమ్ చేస్తుంటారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
స్టాలిన్ ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన అనంతరం తనదైన శైలిలో పాలన చేస్తూ ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. కరోనా సమయంలో స్టాలిన్ ప్రజలకు అండగా నిలిచిన తీరు ఆకట్టుకుంది. ప్రభుత్వ కమిటీల్లో ప్రతిపక్ష నేతలకు స్థానం కల్పించిన సీఎం కు మంచి పేరు తెచ్చాయి. కక్ష పూరిత రాజకీయాలకి బ్రేక్ వేస్తూ.. పేదల ఆకలి తీర్చే ప్రభుత్వ క్యాంటిన్లను అదే పేరుతో కొనసాగిస్తున్న స్టాలిన్ నేచర్ కు ప్రతిపక్షాల నేతలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: Mega Family: మెగాస్టార్ చిరంజీవి ఇంట శ్రావణ శోభ.. మెగా ఫ్యామిలీ నాలుగు తరాల ఫోటో వైరల్