JK Encounter: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు.. ముగ్గురు ముష్కరుల హతం
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.
Jammu Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. అవంతిపొరాలోని త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో స్థానిక పోలీసులు, ప్రత్యేక భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రతా దళాల అలజడిని పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో రెండు గ్రూపుల మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు తీవ్రవాదులు ప్రాణాలను కోల్పోయారని స్థానిక పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా గాలింపు బృందాలపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారని, దీంతో ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. వారు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారని వెల్లడించారు. టెర్రరిస్టుల కోసం ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని పేర్కొన్నారు.
Read Also… Sushanth : ‘బండి తియ్’ అంటున్న అక్కినేని హీరో.. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ నుంచి ప్రమోషనల్ సాంగ్