- Telugu News Lifestyle Suffering from back pain? Follow these simple tips, Check here is details in Telugu
Tips for Back Pain: నడుము నొప్పితో బాధపడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలతో మాయం చేయండి!
ప్రస్తుతం అనేక అనారోగ్య సమస్యలతో జనం సతమతమవుతున్నారు. వాటిల్లో నడుము నొప్పి కూడా ఒకటి. నడుముపై ఎక్కువగా ప్రెజర్ పెట్టడం కారణంగా ఈ నడుము నొప్పి అనేది వస్తుంది. ఒకే చోట కూర్చుని పని చేసినా, నిల్చుని పని చేసినా నడుముపై ఒత్తిడి పడుతుంది. దీంతో నడుము నొప్పి సమస్య వేధిస్తుంది. గంటల తరబడి ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చోవడం, కూర్చుని టీవీలు చూడటం వల్ల నడుము నొప్పి, వెన్ను నొప్పి సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు..
Updated on: Apr 21, 2024 | 10:08 AM

ప్రస్తుతం అనేక అనారోగ్య సమస్యలతో జనం సతమతమవుతున్నారు. వాటిల్లో నడుము నొప్పి కూడా ఒకటి. నడుముపై ఎక్కువగా ప్రెజర్ పెట్టడం కారణంగా ఈ నడుము నొప్పి అనేది వస్తుంది. ఒకే చోట కూర్చుని పని చేసినా, నిల్చుని పని చేసినా నడుముపై ఒత్తిడి పడుతుంది. దీంతో నడుము నొప్పి సమస్య వేధిస్తుంది.

గంటల తరబడి ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చోవడం, కూర్చుని టీవీలు చూడటం వల్ల నడుము నొప్పి, వెన్ను నొప్పి సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గంటల తరబడి ఒకే ప్రదేశంలో ఉండటం వల్ల నడుము నొప్పిని వస్తుంది.

ఇలా నడుము నొప్పి వచ్చింది అనిపించినప్పుడు.. ఓ అరగంట పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఇంట్లో కూర్చుని పని చేసుకునేవారు రెస్ట్ తీసుకున్న పర్వాలేదు. ఆఫీసులో వర్క్ చేసే వారు కాస్త బ్రేక్ తీసుకుని అటూ ఇటూ నడుస్తూ ఉండాలి.

మీరు వర్క్ చేసే టేబుల్, అలాగే కూర్చుని పని చేసే కుర్చీ.. సరిగ్గా సరిపోయేవిలా ఉండాలి. నడుము మీద స్ట్రెస్ పడకుండా ఉండాలంటే.. సపోర్ట్‌గా పిల్లో వేసుకుని కూర్చోండి. అలాగే మధ్య మధ్యలో లేచి అటూ ఇటూ నడుస్తూ ఉండాలి.

అదే విధంగా పని చేస్తున్నప్పుడు టేబుల్‌ను మీ తలకు సరైన పొజిషన్‌లో ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయకపోతే మీ తల నారాలు అనేవి బాగా లాగేస్తాయి. దీని వల్ల నడుముపై కూడా ప్రెజర్ పడుతుంది. అలాగే ప్రతి రోజూ నడుముకు సంబంధించిన యోగాసనాలు వేస్తూ ఉండాలి.




