Success Story: ఇంట‌ర్నెట్ అంటే తెలియని 50 ఏళ్ల మహిళ.. ఓ యూట్యూబ్ ఛానెల్ ఓనర్‌.. నెల‌కు 70 వేలు సంపాదన

Success Story: పరిస్థితులు ప్రతి ఒక్కరికీ అన్నీ నేర్పిస్తాయి. అవసరం అయితే పక్షి ఈదుతుంది.. చేప ఎగురుతుంది.. అదే విధంగా నాకు ఎందుకు ఇవన్నీ నేను ఏమైనా చదువుకున్నా, ఉద్యోగాలు చెయ్యాలా ఊర్లు ఏలా అనుకునేవారు..

Success Story: ఇంట‌ర్నెట్ అంటే తెలియని 50 ఏళ్ల మహిళ.. ఓ యూట్యూబ్ ఛానెల్ ఓనర్‌.. నెల‌కు 70 వేలు సంపాదన
Yo Youtube Chef Shashikalac
Follow us
Surya Kala

|

Updated on: Mar 20, 2022 | 4:12 PM

Success Story: పరిస్థితులు ప్రతి ఒక్కరికీ అన్నీ నేర్పిస్తాయి. అవసరం అయితే పక్షి ఈదుతుంది.. చేప ఎగురుతుంది.. అదే విధంగా నాకు ఎందుకు ఇవన్నీ నేను ఏమైనా చదువుకున్నా, ఉద్యోగాలు చెయ్యాలా ఊర్లు ఏలా అనుకునేవారు సైతం.. కొన్ని సార్లు పరిస్థితులకు అనుగుణంగా తమని తాము మలచుకుని.. జీవితంలో ఏదోకటి సాధిస్తారు. ఇంట‌ర్నెట్ (Internet) అంటే తెలియ‌ని ఓ మహిళ ఇప్పుడు ఒక యూట్యూబ్ చానెల్‌(Youtube Channel) కు ఓన‌ర్. అంతే కాదు.. త‌న యూట్యూబ్ చానెల్‌కు మిలియ‌న్ల స‌బ్‌స్క్రైబ‌ర్స్ ఉన్నారు. ప్ర‌స్తుతం అక్క‌డ త‌ను ఒక సెల‌బ్రిటీ. యూట్యూబ్ ద్వారా త‌ను నెల‌కు 70 వేల రూపాయలు సంపాదిస్తోంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ర‌ఖ్వా అనే గ్రామం చాలా వెనుక‌బ‌డిన ప్రాంతం. అక్క‌డ కనీస మౌలిక వ‌స‌తులు లేక, వ్య‌వ‌సాయం గిట్టుబాటు కాక‌.. ఇప్ప‌టికీ అక్క‌డి ప్ర‌జ‌లు వెనుక‌బ‌డే ఉన్నారు. కానీ.. మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా.. అధునాత‌న‌మైన సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకొని కొంద‌రు త‌మ జీవితాల‌ను మార్చేసుకుంటున్నారు.

రఖ్వా గ్రామానికి చెందిన 50 ఏళ్ల శ‌శిక‌ల చౌరాసియా తన పిల్లల ప్రోత్సాహంతో ఒక యూట్యూబ్‌ ఛానెల్‌కి ఓనర్‌ అయిపోయింది. శశికలకు పాకశాస్త్రంలో మంచి నైపుణ్యం ఉంది. తను వంటలు బాగా చేస్తుంది. ఇది గమనించిన పిల్లలు చంద‌న్, సూర‌జ్, పంక‌జ్.. వాళ్లమ్మ పేరుమీద ఒక యూట్యూబ్ చానెల్ పెట్టించాల‌నుకున్నారు. అదే విషయం శశికళకు చెప్పినప్పుడు అసలు తనకు ఇంటర్నెట్‌ అంటేనే తెలియదని ఒకింత భయపడింది. కానీ.. త‌న కొడుకుల ప్రోత్సాహంతో ముంద‌డుగు వేసింది. అంతే.. తాలి అనే యూట్యూబ్ చానెల్‌ను చందన్ క్రియేట్ చేశాడు శశికళ కుమారుడు చందన్‌. అలా.. న‌వంబ‌ర్ 1, 2017న మొద‌టి వీడియోను అప్‌లోడ్ చేశారు. బూందీ ఖీర్‌ను త‌న త‌ల్లి త‌యారు చేయ‌గా.. త‌న కొడుకు చంద‌న్ షూట్ చేసి.. అప్‌లోడ్ చేశాడు. కానీ.. ఆ వీడియోకు పెద్ద‌గా వ్యూస్ రాలేదు.

అయినా నిరాశ పడలేదు.. త‌న తల్లితో రోజూ రకరకాల వంటలు చేయిస్తూ త‌ల్లిని చెఫ్‌గా మార్చేశారు. రోజూ ఆ వీడియోలు అప్‌లోడ్ చేస్తూ వెళ్లిపోయారు. 2018లో మామిడికాయ ప‌చ్చ‌డి చేసే విధానానికి సంబంధించిన వీడియోకు వ్యూస్ బాగా వ‌చ్చాయి. అప్పటి నుంచి ఇక శ‌శిక‌ల వెన‌క్కి తిరిగి చూడాల్సిన అవ‌స‌రం రాలేదు. ఇప్పుడు త‌న యూట్యూబ్ చానెల్‌కు 1.7 మిలియ‌న్ స‌బ్‌స్క్రైబ‌ర్స్ ఉన్నారు. నెల‌కు యూట్యూబ్ ఛానెల్‌ ద్వారా 70 వేల ఆదాయం సంపాదిస్తోంది.

Also Read: RRR Pre Release Event: ఆర్ఆర్ఆర్ ఫంక్షన్‌లో జనసేన జెండాల సందడి.. నెట్టింట వీడియో వైరల్