Inspiring Story: 8 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు యాక్సిండెంట్..బెడ్ పైనుంచి కదలలేని స్థితిలో గృహిణిగా, ఉద్యోగిగా విధులు
Inspiring Story: అన్ని అవకాశాలు ఉండి, అన్ని అవయవాలు ఉండి ఆకాశానికి నిచ్చెలను వేస్తూ.. అందడంలేదని నిరాశతో కృంగిపోయే కొందరికి స్ఫూర్తినిచ్చే వ్యక్తులు సమాజంలో ఎందరో ఉన్నారు. వారి గురించి తెలుసుకుని..
Inspiring Story: అన్ని అవకాశాలు ఉండి, అన్ని అవయవాలు ఉండి ఆకాశానికి నిచ్చెలను వేస్తూ.. అందడంలేదని నిరాశతో కృంగిపోయే కొందరికి స్ఫూర్తినిచ్చే వ్యక్తులు సమాజంలో ఎందరో ఉన్నారు. వారి గురించి తెలుసుకుని.. వారిని స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ముందుకు సాగితే.. ఖచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకుంటారు. విధి వెక్కిరిస్తే.. తనకు తాను ధైర్యాన్ని నింపుకుని.. కాలానికి పరిస్థితులకు ఎదురీదుతూ.. కష్టపడుతున్న ఆ మహిళ కు సంకల్పమే ఆమె వెన్నెముక.. ధైర్యమే ఆమె పెట్టుబడి. ఎందరికో ఆమె స్పూర్తి. జీవితంలో నిరాశ, నిస్పృహలకు గురైనప్పుడు ఆమెను గుర్తు చేసుకుంటే ఎంతో ధైర్యం కలుగుతుంది. అవును జీవితంలో ప్రతి ఒక్కరు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. అవి సాధారణ ఒడిదుడుకులైతే పర్వాలేదు. కానీ బతికున్నా చచ్చినట్లేనని తెలిస్తే ఏం చేస్తాం… ఈ జీవితం ఎందుకు చచ్చిపోదాం అనుకుంటాం. కానీ సూపర్ వుమెన్ చాయాదేవి అలా అనుకోలేదు. తనకు కలిగిన కష్టాన్ని ఇష్టంగా ఎదుర్కొన్నారు. తన ప్రతిభకు పదును పెట్టుకున్నారు. తనని తానూ నిరూపించుకుని ఈరోజు మరికొందరికి స్ఫూర్తిగా నిలిచారు. ఛాయాదేవి(Chayadevi). 22 ఏళ్లుగా ఈమె పారాప్రీజిక్స్(Paraparesis) అనే వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఆమె అప్పటి నుంచి అంటే గత 22 ఏళ్లుగా బెడ్‌కే పరిమితమయ్యారు. అయినా తాను కుంగి పోలేదు. బెడ్ పైనుంచి కదలలేని స్థితిలో కూడా గృహిణిగా, ఒక ఉద్యోగిగా తన విధులను నిర్వహిస్తున్నారు.
దుర దృష్ట వశాత్తు ఒక రోజు ఓ లారీ ఇంట్లోకి దూసుకురావడంతో ఆ ప్రమాదంలో ఛాయాదేవి తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో ఆమె 8 నెలల గర్భవతి కూడా. ప్రమాదంలో రెండూ కాళ్లూ పోయాయి. ఊహించని ప్రమాదంతో ఆమె కలల ప్రపంచం అస్తవ్యస్తమైపోయింది. అయినా ఆమె వెనకడగువేయలేదు. కాళ్లు లేకపోతేనేం.. చేతులున్నాయి.. కష్టపడే మనస్తత్వం ఉంది.. నా ప్రయాణం ఇంతటితో ఆగిపోకూడదు అనుకున్నారు. శరీరం గాయాలతో బాధిస్తున్నా లెక్క చేయకుండా తాను ఏదైనా అచీవ్ చెయ్యాలనే దృఢ సంకల్పమే ఆమెను ముందుకు నడిపించింది. చేతులనే కాళ్లుగా చేసుకొని మిషన్ కుట్టారు.. బట్టలకు ఎంబ్రాయిడరీ చేసారు… పదిమందికి కుట్టుపని చేర్పించి తనకు తాను ఆదాయ వనరు కల్పించుకున్నారు. సమయానికి ఎంతో విలువ ఇచ్చే ఛాయాదేవి.. సాయంత్రం వేళ పిల్లలకు ట్యూషన్ చెప్పారు… రాత్రంతా బాడీ పెయిన్స్‌తో నిద్ర పట్టక పోతే ఆ బాధను మర్చిపోడానికి ఉదయాన్నే బట్టలు కుట్టడానికి అవసరమైన కటింగ్స్ చేసి పెట్టుకునేవారు. ఆర్ధిక ఇబ్బందుల్లో కూడా ఎవరినీ చేయిచాచకూడదనే ఆమె ఆత్మగౌరవం… ఆమెను మరింత ముందుకు నడిచేలా చేసింది. ఇంటినుండే.. అదీ బెడ్ మీదనుంచే ఇటు రియల్ ఎస్టేట్, అటు ఇన్సూరెన్స్ లాంటి రకరకాల బిజినెస్‌లు చేస్తూ.. విధి తనను వెక్కిరించినా మొక్కవోని ఆత్మస్థయిర్యంతో… దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు ఛాయాదేవి. అన్ని అవకాశాలు ఉండి, అన్ని అవయవాలు ఉండి ఆకాశానికి నిచ్చెలను వేస్తూ.. అందడంలేదని నిరాశతో కృంగిపోయే కొందరికీ ఈ ఛాయాదేవి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుందాం.
Also Read: