Interesting Facts: రోజుకు మూడు కప్పుల టీ తాగితే.. వృద్ధాప్యం తగ్గుతుందట!
ఉదయాన్నే ఓ కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ప్రపంచ వ్యాప్తంగా టీకి ఫ్యాన్స్ ఎక్కువే. టీ అంటే చాలా మంది ఇష్టంగా తాగుతారు. టీలో ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పడం కష్టమే. ఇంటి పనుల్లో అలసి పోయినా.. ఆఫీసు పనుల్లో తలమునకలైనా.. అలిసిపోయి.. నీరసించినా వెంటనే గుర్తుకు వచ్చేది టీనే. ఒక్క చుక్క టీ పడితే.. శరీరం మళ్లీ యాక్టీవ్ అవుతుంది. అప్పటివరకూ ఉన్న తలనొప్పి, ఒత్తిడి మొత్తం మాయం అవుతుంది. అయితే టీతో కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ..

ఉదయాన్నే ఓ కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ప్రపంచ వ్యాప్తంగా టీకి ఫ్యాన్స్ ఎక్కువే. టీ అంటే చాలా మంది ఇష్టంగా తాగుతారు. టీలో ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పడం కష్టమే. ఇంటి పనుల్లో అలసి పోయినా.. ఆఫీసు పనుల్లో తలమునకలైనా.. అలిసిపోయి.. నీరసించినా వెంటనే గుర్తుకు వచ్చేది టీనే. ఒక్క చుక్క టీ పడితే.. శరీరం మళ్లీ యాక్టీవ్ అవుతుంది. అప్పటివరకూ ఉన్న తలనొప్పి, ఒత్తిడి మొత్తం మాయం అవుతుంది. అయితే టీతో కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. టీలో క్యాన్సర్, హృదయ సంబంధిత సమస్యలు తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి. మరి ఇంకా టీతో ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
దిలాన్సెట్ రీజినల్ హెల్త్ – వెస్ట్రన్ పసిఫిక్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. రోజుకు మూడు సార్లు టీని తాగడం వల్ల మీ జీవితాన్ని పొడిగించుకోవచ్చుని తేలింది. చైనాలోని చెంగ్డులోని సీచువాన్ విశ్వ విద్యాలయ పరిశోధకులు.. టీ తాగే 37 నుంచి 73 సంవత్సరాల వయసు గల 6,000 వేల మందిపై పరిశోధనలు చేశారు. ఇందులో టీ తాగే వారిలో వృద్ధాప్య లక్షణాలు తక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.
జీవిత కాలాన్ని పెంచుతుంది:
ప్రతీ రోజూ మితంగా టీ తాగితే ఎక్కువ రోజులు బతుకుతారని చైనీయులు ఎక్కువగా నమ్ముతారు. చైనీయులు టీని ఇష్టంగా తాగుతూ ఉంటారు.
వృద్దాప్య లక్షణాలను తగ్గిస్తుంది:
టీ తాగడం వలన అందాన్ని కూడా పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ మూడు సార్లు టీ తాగడం వల్ల శరీరంపై ముడతలు తగ్గి.. యంగ్‌గా ఉండేలా చేస్తుందని చెప్పారు. కాబట్టి రెగ్యులర్‌గా టీ తాగితే మంచిదే.
యాంటీ ఆక్సిడెంట్లు అధికం:
పండ్ల రసం కంటే కప్పు టీలోనే యాంటీ ఆక్సిడెంట్లు అనేవి అధికంగా ఉంటాయని నిపుణులు వెల్లడించారు. కాబట్టి టీని తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. టీ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన దూరం అవుతాయి. రీ ఫ్రెష్‌గా ఉండొచ్చు. అంతే కాకుండా అల్లం, దాల్చిన చెక్క, యాలకులు వంటి మసాలాలు ఉన్న టీ తాగితే జలుబు, దగ్గు కూడా రాకుండా ఉంటాయి. జీర్ణ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. నీరసం వంటివి తగ్గుతాయి. టీ తాగడం వల్ల ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి.
టీ మంచిదే కదా అని మరీ ఎక్కువగా తాగవద్దని నిపుణులు సూచిస్తున్నారు. మితంగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని హెచ్చరిస్తున్నారు. అదే విధంగా ఒకసారి పెట్టిన టీని వెంటనే తాగాలి. దాన్ని పదే పదే వేడి చేసి తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.








