Stretch Marks: స్ట్రెచ్ మార్కులతో ఇబ్బందులు పడుతున్నారా? తేనె తో ఇలా చెక్ చెప్పండి..!

Stretch Marks: మహిళలు గర్భం దాల్చిన తరువాత చాలా మంది స్ట్రెచ్ మార్క్‌లతో ఇబ్బంది పడుతుంటారు. కొన్నిసార్లు బరువు పెరగడం, బరువు తగ్గడం వల్ల

Stretch Marks: స్ట్రెచ్ మార్కులతో ఇబ్బందులు పడుతున్నారా? తేనె తో ఇలా చెక్ చెప్పండి..!
Strech Marks
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 20, 2022 | 9:24 PM

Stretch Marks: మహిళలు గర్భం దాల్చిన తరువాత చాలా మంది స్ట్రెచ్ మార్క్‌లతో ఇబ్బంది పడుతుంటారు. కొన్నిసార్లు బరువు పెరగడం, బరువు తగ్గడం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంది స్ట్రెచ్ మార్క్స్ అనేవి సాధారణ సమస్యగా పేర్కొంటున్నారు వైద్యులు. వాటిని తొలగించడం మాత్రం చాలా కష్టం అని అంటుంటారు. అయితే, హోమ్ రెమిడీస్ ద్వారా ఈ స్ట్రెచ్ మార్క్‌లను తొలగించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ స్ట్రెచ్ మార్క్‌లు తొలగించడంలో తేనె అద్భుతంగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. స్ట్రెచ్ మార్క్స్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే, స్ట్రెచ్ మార్క్స్‌ని తొలగించడానికి తేనెను ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చునో ఇప్పుడు తెలుసుకుందాం..

తేనె, రోజ్ వాటర్.. ఒక చెంచా తేనె తీసుకుని.. దీనికి ఒక టీస్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. ఈ రెండింటినీ కలిపి.. ప్రభావిత ప్రదేశాలలో అప్లై చేయాలి. కాసేపు మసాజ్ చేసి అలాగే ఉంచాలి. ఆ తర్వాత తడి టవల్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

తేనె, నిమ్మరసం.. సగం తాజా నిమ్మకాయ రసానికి కొన్ని చుక్కల తేనె కలపండి. దీన్ని మిక్స్ చేసి.. ఆ మిశ్రమాన్ని ప్రభావిత చర్మంపై అప్లై చేయాలి. కాసేపు మసాజ్ చేసి అలాగే ఉంచితే చర్మం పోషకాలను గ్రహిస్తుంది. ఆ తర్వాత తడి టవల్‌తో తుడవండి. ప్రతిరోజూ ఇలా చేయడం ద్వారా స్ట్రెచ్ మార్క్స్ తొలగిపోతాయి.

ఆముదం, తేనె.. ఒక చెంచా ఆముదంలో కొద్దిగా తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని చర్మంపై అప్లై చేసి.. మసాజ్ చేయాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తడి టవల్‌తో క్లీన్ చేయాలి. దీన్ని వారానికి 3 నుండి 4 సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

తేనె, ఆల్మండ్ ఆయిల్, అలోవెరా.. రెండు చెంచాల అలోవెరా జెల్‌లో ఒక చెంచా తేనె, ఒక చెంచా బాదం నూనె కలపండి. దీన్ని చర్మంపై అప్లై చేయండి. కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేసి కాసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత మంచి నీటితో క్లీన్ చేసుకోవాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది.

తేనె, అవోకాడో, ఆలివ్ నూనె.. పండిన అవోకాడోను తీసుకుని దానిని సగానికి కట్ చేయాలి. దానిని మెత్తగా చేయాలి. ఆ తరువాత అవకాడో పేస్ట్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, కొద్దిగా తేనె కలపండి. మూడింటినీ బాగా మిక్స్ చేయాలి. చర్మంపై అప్లై చేసి మసాజ్ చేయాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి.. ఆ తరువాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి 3 నుండి 4 సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

Also read:

TSRTC: తెలంగాణ ఆర్టీసీపై మరో పిడుగు.. కార్మికులు, ప్రయాణికులపై పడనున్న ప్రభావం..!

Yadadri Temple: యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయ ఉద్ఘాటనకు అంతా సిద్ధం.. సోమవారం నుంచి వారం రోజుల పాటు..

Health Care Tips: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వేసవిలో ఈ పండ్లను తినండి..

రాజధాని అమరావతిలో గజం భూమి విలువ ఎంతో తెల్సా.?
రాజధాని అమరావతిలో గజం భూమి విలువ ఎంతో తెల్సా.?
అనిరుధ్ మళ్లీ అదరగొట్టాడు.. అజిత్ సినిమా నుంచి లిరిక‌ల్ సాంగ్
అనిరుధ్ మళ్లీ అదరగొట్టాడు.. అజిత్ సినిమా నుంచి లిరిక‌ల్ సాంగ్
ఇలా చేశారంటే మీ తెల్ల జుట్టు నల్లగా మారడం పక్కా..
ఇలా చేశారంటే మీ తెల్ల జుట్టు నల్లగా మారడం పక్కా..
ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. థర్డ్‌ పార్టీ యాప్స్‌తో చెల్లింపులకు గ్రీన్
ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. థర్డ్‌ పార్టీ యాప్స్‌తో చెల్లింపులకు గ్రీన్
దందాల్లో ఇది నెక్స్ట్ లెవెల్.. మౌత్ ఫ్రెష్, ఐ డ్రాప్స్ సప్లై చేసీ
దందాల్లో ఇది నెక్స్ట్ లెవెల్.. మౌత్ ఫ్రెష్, ఐ డ్రాప్స్ సప్లై చేసీ
వైసీపీకి మరో షాక్.. మాజీ ఐఏఎస్ ఇంతియాజ్‌ రాజీనామా
వైసీపీకి మరో షాక్.. మాజీ ఐఏఎస్ ఇంతియాజ్‌ రాజీనామా
ఏపీలో కొత్త సీఎస్‌పై ఉత్కంఠ.. రేసులో ఉన్నవాళ్లు వీరే..
ఏపీలో కొత్త సీఎస్‌పై ఉత్కంఠ.. రేసులో ఉన్నవాళ్లు వీరే..
జైస్వాల్ రన్ అవుట్: మంజ్రేకర్-ఇర్ఫాన్ లైవ్ లో మాటల యుద్ధం!
జైస్వాల్ రన్ అవుట్: మంజ్రేకర్-ఇర్ఫాన్ లైవ్ లో మాటల యుద్ధం!
తలకు ఆయిల్‌తో మసాజ్ ఇలా చేశారంటే ఒత్తిడి మాయం..
తలకు ఆయిల్‌తో మసాజ్ ఇలా చేశారంటే ఒత్తిడి మాయం..
కాలేజీకి వెళుతోన్న బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్.. త్వరలో లాయర్‌..
కాలేజీకి వెళుతోన్న బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్.. త్వరలో లాయర్‌..
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..