Sneeze: తుమ్మును ఆపితే ప్రమాదమా..! ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయవద్దు..

Sneeze: ఇంట్లో నుంచి బయటకెళ్తున్నప్పుడు ఎవరైనా తుమ్మితే చాలు ఇక రెండు నిమిషాలు ఇంట్లో కూర్చుని వెళ్లాల్సిందే. శుభకార్యాలు,

Sneeze: తుమ్మును ఆపితే ప్రమాదమా..! ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయవద్దు..
Sneeze
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 07, 2021 | 6:28 AM

Sneeze: ఇంట్లో నుంచి బయటకెళ్తున్నప్పుడు ఎవరైనా తుమ్మితే చాలు ఇక రెండు నిమిషాలు ఇంట్లో కూర్చుని వెళ్లాల్సిందే. శుభకార్యాలు, పూజా కార్యక్రమాల ముందు ఎవరైనా తుమ్మినా వినపడకుండా బ్యాండ్​ లేదా డప్పు సౌండ్​పెంచుతారు. ఇక చిన్న పిల్లలనైతే ముందే హెచ్చరిస్తారు.. సాధారణంగా ఏదైనా బయటి పదార్థం ముక్కులోకి ప్రవేశించినప్పుడు ఆ పదార్థం ముక్కులో ఇరుక్కొని ముక్కునుంచి మస్తిష్కానికి(బ్రెయిన్​కు) ఓ సందేశం అందుతుంది. శరీరానికి పనికిరాని పదార్థాన్ని(చెడు పదార్థం) వెంటనే బయటకు పంపేయండి అంటూ మస్తిష్కం శరీరంలోని కండరాలను ఆదేశిస్తుంది. అప్పుడు తుమ్ము వస్తుంది.

కొన్నిసార్లు బహిరంగంగా తుమ్మడం ఇబ్బందిగా ఉంటుంది. కొన్నిసార్లు మీ తుమ్ములు మీ చుట్టూ ఉన్న వ్యక్తులను కలవరపెడుతుంది. అటువంటి పరిస్థితిలో తుమ్ముతున్నప్పుడు క్షమించండి అని చెబుతాము. బహిరంగంగా తుమ్ముతున్నప్పుడు ముక్కు, నోటిని చేతితో లేదా రుమాలుతో కవర్ చేస్తారు. కొంతమంది తమ మోచేతులను అడ్డుగా పెట్టుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది తుమ్మును కూడా ఆపుతారు. అయితే ఇది సరైనది కాదు.

తుమ్మును ఆపడాన్ని వైద్యులు నిరాకరిస్తారు. వారి ప్రకారం తుమ్ములు ఆపడం చాలా ప్రమాదకరం. తుమ్మును ఆపడం వల్ల మీ శరీరంలోని ఇతర భాగాలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. అధిక వేగంతో వచ్చే తుమ్ములు ఆగిపోతే ఆ ఒత్తిడి మన ముక్కు, గొంతు లేదా నోటిలోని ఇతర కణాలపై పడుతుంది. దీని కారణంగా కణాలు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు ఇది మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది.

తుమ్ము సమయంలో గాలి చాలా వేగంగా మన ముక్కు రంధ్రాల నుంచి బయటకు వస్తుంది. అటువంటి పరిస్థితిలో తుమ్మును ఆపడం అంటే ఈ బలమైన గాలిని ఇతర అవయవాలకు మళ్లించడం. వేగంగా వచ్చే తుమ్మును మీరు చెవి వైపునకు మళ్లిస్తే చెవి బ్లాస్ట్ అవుతుంది. అంత పవర్‌ ఉంటుంది. తుమ్ము వల్ల మన శరీరం నుంచి వేస్ట్ పదార్థాలు, బ్యాక్టీరియా మొదలైనవి బయటకు వస్తాయి. మనం తుమ్మును ఆపివేస్తే బాక్టీరియా కూడా అందులోనే ఉండిపోతుంది. అది మన ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. తుమ్మును ఆపడం వల్ల కళ్ల రక్తనాళాలపై కూడా ప్రభావం పడుతుంది. ఇది మెదడులోని నరాలపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. అందువల్ల తుమ్మును ఆపడం కంటే తుమ్ముతున్నప్పుడు ముక్కు, నోటిపై రుమాలు పెట్టుకోవడం మంచిది.

IPL 2021 RCB vs SRH: ఆర్సీబీపై ఘన విజయం సాధించిన సన్‌రైజర్స్‌.. ఉమ్మడిగా రాణించిన బౌలర్లు..