- Telugu News Lifestyle Food know these superfoods for skin add your dier for glowing skin check here details
మెరిసే చర్మం కావాలా?.. ఈ ఫుడ్‌ను ఎక్కవగా తీసుకోవాలట.. అవేంటంటే..
ప్రస్తుతం చాలా వరకు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ఇందుకోసం అనేక రకాల సహజమైన ఆహార పదార్థలను తీసుకుంటున్నారు. అయితే చర్మాన్ని మెరుగ్గా.. ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని రకాల పదార్థాలను తీసుకోవాలి. ఇవి మీ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడతాయి. అవెంటో తెలుసుకుందామా.
Updated on: Oct 06, 2021 | 9:17 PM

చియా గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం మెరుస్తూ ఉండేలా సహయపడతాయి. ఇందులో ఖనిజాలు, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతాయి.

స్ట్రాబెరీలు, లేదా బ్లూబెర్రీస్ వంటి బెర్రీలు కూడా చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఇవి శరీరంలోని విషాన్ని తొలగిస్తాయి. వీటిని బ్రెక్ ఫాస్ట్ గా కూడా తీసుకోవచ్చు. ఇవి యాంటీ ఇన్ఫ్లమెటరీ లక్షణాలు, విటమిన్స్ సమృద్ధిగా కలిగి ఉంటాయి. అంతేకాకుండా.. ర్యాషెస్, ముడతల సమస్యను తగ్గిస్తాయి.

బాదంలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఎండనుంచి దెబ్బతినకుండా కాపాడతాయి. అలాగే ఇవి రక్తహీనతను తగ్గిస్తాయి. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. వాటిలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్స్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా.. మచ్చలను తగ్గిస్తాయి.

చేపలు.. ఆరోగ్యానికి చాలా మంచివి. అలాగే చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో ఉండే ఒమేగా 3, పోషకాలు చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహయపడతాయి. సాల్మన్, సార్టినెస్ వంటి సముద్ర చేపలు చాలా ఆరోగ్యకరమైనవి.

ఆకు కూరలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే చర్మాన్ని మెరిసెలా చేస్తాయి. పాలకూర, బ్రోకలీ సెలెరీ, కొత్తిమీర వంటి కూరలు చర్మానికి మేలు చేస్తాయి.





























