Health Tips: వర్షాకాలంలో ఈ కషాయాలతో ఇన్ఫెక్షన్లకు చెక్.. అవెంటో తెలుసుకోండి..

సాధారణంగా.. మన వంటశాలల్లో ఉండే మసాల దినుసులతో ఎన్నో ప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక్కో మసాల దినుసు..

Health Tips: వర్షాకాలంలో ఈ కషాయాలతో ఇన్ఫెక్షన్లకు చెక్.. అవెంటో తెలుసుకోండి..
Kadha
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 06, 2021 | 7:28 PM

సాధారణంగా.. మన వంటశాలల్లో ఉండే మసాల దినుసులతో ఎన్నో ప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక్కో మసాల దినుసు.. ఆరోగ్యంపై అనేక ప్రభావాలను చూపిస్తాయి. ఇక లవంగాలు, యాలకులు, చెక్క వంటి వాటితో చేసిన కషాయాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతాయి. వర్షాకాలంలో వచ్చే జలుబు, ఫ్లూ, ఇతర అంటు వ్యాధులను నయం చేయడానికి కషాయాలు ఎక్కువగా ఉపయోగపడతాయి. అనేక మూలికలు, సుగంధ ద్రవ్యాలను కలిపి కషాయాలను తయారు చేస్తుంటారు. మూలికలు, సుగంధ ద్రవ్యాలను నీటిలో మరిగించి కషాయాలను తయారు చేస్తుంటారు. కషాయాలను తయారు చేయడానికి మూలికలు అత్యంత ముఖ్యం.

వర్షాకాలంలో వచ్చే డెంగ్యూ, స్వైన్ ఫ్లూ వంటి ప్రాణాంతక వ్యాధులను నియంత్రించడానికి కషాయాలు ఎక్కువగా పనిచేస్తాయి. ఆయుర్వే్ద నిపుణుడు రామ్. ఎన్. కుమార్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులను నియంత్రించడానికి కషాయాలు సహాయపడతాయని తెలిపారు. యాలకులు, లవంగాలు, జీరా, అల్లం, తులసి, తేనె, బెల్లం వంటి పదార్థాలు ఉపయోగించి చేసే కషాయలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

1. రోగ నిరోధక శక్తిని పెంచడానికి తులసి, అమృతపాలి తులసి ఎక్కువగా ఉపయోగపడుతుంది. జ్వరం, జలుబును నియంత్రించేందుకు ఈ కషాయం ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే జ్వరం వచ్చినప్పుడు తులసి ఆకులు.. మార్బుల్ ఆకులతో చేసిన కషాయాలు తీసుకోవాలి. 2. పాన్‏లో తులసి ఆకులు, కప్పు నీరు, టేబుల్ స్పూన్ చెక్కర, టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు, అల్లం, నెయ్యి, లవంగాలు వేసి మరిగించాలి. మీడియం మీద 15-20 నిమిషాలు మరిగించి దించి వడకట్టాలి. ఈ కషాయాన్ని రోజుకు రెండుసార్లు గోరువెచ్చగా తీసుకోవాలి. 3. పసుపు కషాయం. ఇందుకోసం పసుపు, పాలు, పుదీనా ఆకులను తీసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో పాలను మరిగించి అందులో కాస్త పసుపు వేయాలి. ఆ తర్వాత పుదీనా ఆకులు కలిపి పక్కన పెట్టాలి. ఈ కషాయాన్ని రోజూ తీసుకోవడం వలన రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రిస్తుంది. 4. అల్లం, తేనె, నిమ్మరసం కలిపి చేసి కషాయం ఆరోగ్యానికి మంచిది. ముందుగా.. అల్లం, తేనె, నిమ్మరసం కలిపి మరిగించాలి. ఈ కషాయం రెండు వారాలు నిల్వచేస్తారు. రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఈ కషాయాలను ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఈ కషాయాలు వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి సహయపడతాయి.

Also Read: Varun Doctor Pre Release Event: డాక్టర్‍గా శివకార్తికేయన్.. వరుణ్ డాక్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్…

Shruti Haasan: సీక్రెట్ టాటూ రివీల్ చేసిన శృతి హాసన్.. ఎవరి పేరు వేసుకుందో తెలుసా?

MAA Elections 2021: మా ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. ఓటుకు పదివేలు.. సంచలన కామెంట్స్ చేసిన నాగబాబు..