Varun Doctor Pre Release Event: డాక్టర్‍గా శివకార్తికేయన్.. వరుణ్ డాక్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్…

తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్‏కు తెలుగులోనూ క్రేజ్ ఉంది. శివకార్తికేయన్ నటించిన తమిళ్ సినిమాలు తెలుగులోకి డబ్ అయి సూపర్ హిట్

Varun Doctor Pre Release Event: డాక్టర్‍గా శివకార్తికేయన్..  వరుణ్ డాక్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్...
Varun Doctor
Follow us

|

Updated on: Oct 06, 2021 | 6:54 PM

తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్‏కు తెలుగులోనూ క్రేజ్ ఉంది. శివకార్తికేయన్ నటించిన తమిళ్ సినిమాలు తెలుగులోకి డబ్ అయి సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన శివకార్తికేయన్.. తాజాగా నటిస్తున్న లేటేస్ట్ సినిమా వరుణ్ డాక్టర్. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. కోటపాడి రాజేష్ ఈ చిత్రాన్ని గంగ ఎంటర్ టైన్మెంట్స్, ఎస్.కె ప్రొడక్షన్స్‏తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‏గా నటిస్తుంది.

ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తిచేసుకున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 9న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేయనున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా నుంచి తెలుగు పాటల్ని సైతం త్వరలో విడుదల చేయనున్నారు. అలాగే వరుణ్ డాక్టర్ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుంగా.. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకను టీవీ9 తెలుగులో ప్రత్యేక్ష ప్రసారంలో వీక్షించవచ్చు.

వీడియో…

Also Read: Shruti Haasan: సీక్రెట్ టాటూ రివీల్ చేసిన శృతి హాసన్.. ఎవరి పేరు వేసుకుందో తెలుసా?

MAA Elections 2021: మా ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. ఓటుకు పదివేలు.. సంచలన కామెంట్స్ చేసిన నాగబాబు..

Kushboo Photos: యంగ్‌లుక్ తో షేక్ చేస్తున్న కుష్బూ స్టన్నింగ్ ఫోటోలు.. రోజు రోజుకు తగ్గుతున్న వయస్సు..