IPL 2021 RCB vs SRH: ఆర్సీబీపై ఘన విజయం సాధించిన సన్‌రైజర్స్‌.. ఉమ్మడిగా రాణించిన బౌలర్లు..

IPL 2021 RCB vs SRH: ఐపీఎల్‌లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్ బెంగుళూరు, సన్ రైజర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ ఘన విజయం సాధించింది.

IPL 2021 RCB vs SRH: ఆర్సీబీపై ఘన విజయం సాధించిన సన్‌రైజర్స్‌.. ఉమ్మడిగా రాణించిన బౌలర్లు..
Rcb Vs Srh
Follow us
uppula Raju

|

Updated on: Oct 06, 2021 | 11:33 PM

IPL 2021 RCB vs SRH: ఐపీఎల్‌లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్ బెంగుళూరు, సన్ రైజర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ ఘన విజయం సాధించింది. చివరి మ్యాచ్‌ని గెలుపుతో ముగించింది. టాస్‌ గెలిచిన కోహ్లీ మొదటగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో సన్‌ రైజర్స్‌ మొదటగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఓపెనర్లుగా జాసన్‌ రాయ్, అభిషేక్ వర్మ క్రీజులోకి అడుగుపెట్టారు. 13 పరుగులకే అభిషేక్ ఔటైనా రాయ్‌ మాత్రం తనదైన శైలిలో అలరించాడు. 38 బంతుల్లో 44 పరుగులు చేశాడు. తర్వాత కెప్టెన్‌ విలియమ్‌సన్ 29 బంతుల్లో 31 పరుగులు మినహాయించి పెద్దగా ఎవరూ రాణించలేదు. దీంతో సన్‌ రైజర్స్‌ 20 ఓవర్లలో 141 పరుగులు చేసింది. బెంగుళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు, క్రిస్టియన్ 2 వికెట్లు, జార్జ్ ఒక వికెట్‌ సాధించారు.

142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్‌ కోహ్లీ నిరుత్సాహపరిచిన దేవదత్‌ పాడికల్ పర్వాలేదనిపించాడు. 52 బంతుల్లో 41 పరుగులు చేశాడు. తర్వాత వరుసగా రెండు వికెట్లు పడిపోయినా క్రీజులోకి వచ్చిన మాక్స్‌వెల్ తనదైన శైలిలో సన్‌ రైజ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 40 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. అయితే సన్‌ రైజర్స్ బౌలర్లు మూకుమ్మడిగా ఒత్తిడి పెంచడంతో చివరి ఓవర్లో 13 పరుగులు చేస్తే విజయం వరిస్తుంది. ఈ క్రమంలో క్రీజులో ఏబీ డివిలియర్స్ , జార్జ్‌ ఉన్నారు. కానీ 8 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయారు. చివరి బంతికి సిక్స్‌ కొడితే విజయం దక్కేది కానీ ఆ మ్యాజిక్ జరగలేదు. ఇక సన్‌రైజర్స్ బౌలర్లు తల వికెట్ సాధించారు.

Cyclone In Oman: ఒమన్‌లో షహీన్‌ తుఫాను బీభత్సం.. టీ20 వరల్డ్‎కప్ నిర్వహణపై ప్రభావం..!

Stock Market: ముహూరత్ ట్రేడింగ్ అంటే తెలుసా.. అది ఎప్పుడు నిర్వహిస్తారంటే..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!