Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021 CSK vs PBKS Live Streaming: దుబాయ్ వేదికగా రసవత్తర పోరు.. కత్తులు దూస్తున్న కింగ్స్..

IPL 2021 లో ప్లేఆఫ్ మ్యాచులపై క్లారిటీ వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్లేఆఫ్‌కు అర్హత సాధించాయి.

IPL 2021 CSK vs PBKS Live Streaming: దుబాయ్ వేదికగా రసవత్తర పోరు.. కత్తులు దూస్తున్న కింగ్స్..
Chennai Super Kings Vs Punj
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 07, 2021 | 9:29 AM

IPL 2021 లో ప్లేఆఫ్ మ్యాచులపై క్లారిటీ వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్లేఆఫ్‌కు అర్హత సాధించాయి. KKR, ముంబై ఇండియన్స్ కాకుండా పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య నాల్గవ స్థానం కోసం యుద్ధం కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ జట్టు గురువారం తమ ప్లేఆఫ్ అవకాశాలను కొనసాగించాలనే ఉద్దేశ్యంతో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. పంజాబ్ కింగ్స్‌ను ఓడించడం ద్వారా టాప్ 2 లో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుక ప్రయత్నిస్తోంది.

గత సంవత్సరం పేలవమైన ప్రదర్శనను కనబర్చిన చెన్నై సూపర్ కింగ్స్.. ఈ ఏడాది మాత్రం అద్భుతంగా పుంజుకుంది. వీరిని ఓడించడం అంత సులభం కాదనే స్థాయిలో దూసుకుపోతోంది. మొయిన్ అలీ బౌలింగ్, బ్యాటింగ్‌లో బాగా రాణించాడు. కానీ సురేష్ రైనా , ధోనీ పేలవమైన ఫామింగ్‌తో చెన్నైకి ఆందోళన కలిగించే విషయం. రవీంద్ర జడేజా ఆల్ రౌండర్‌గా తన ఆట తీరును ప్రదర్శిస్తున్నాడు. 

పంజాబ్ కింగ్స్ ..

పంజాబ్ గురించి మాట్లాడుకుంటే.. ఈ జట్టు స్థిరంగా రాణించలేకపోయింది. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని జట్టు 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. రాహుల్ ఇప్పటివరకు 528 పరుగులు చేయగా..  అతని కర్ణాటక సహచరుడు మయాంక్ అగర్వాల్ 429 పరుగులు అందించాడు. కానీ అతని ఇతర బ్యాట్స్‌మన్‌లు పెద్దగా ఆడలేకపోయారు. ఇది పంజాబ్‌కు పెద్ద ఇబ్బందిగా మారింది. మహ్మద్ షమీ (18 వికెట్లు), అర్షదీప్ సింగ్ (16 వికెట్లు) బౌలింగ్‌లో అతని తారలు కాగా రవి బిష్ణోయ్ స్పిన్ విభాగంలో బాగా రాణించాడు.

చెన్నై సూపర్ కింగ్స్ vs పంజాబ్ కింగ్స్ మధ్య ఐపిఎల్ 2021 లో 53 వ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?

చెన్నై సూపర్ కింగ్స్ vs పంజాబ్ కింగ్స్ మధ్య ఐపిఎల్ 2021 లో 53 వ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది.

చెన్నై సూపర్ కింగ్స్ vs పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?

చెన్నై సూపర్ కింగ్స్ vs పంజాబ్ కింగ్స్ మధ్య అక్టోబర్ 7 (గురువారం) మ్యాచ్ జరుగుతుంది.

చెన్నై సూపర్ కింగ్స్ vs పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ఏ సమయంలో జరుగుతుంది?

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మధ్యాహ్నం 3:30 నుండి మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ టాస్ మధ్యాహ్నం మూడు గంటలకు జరిగింది.

చెన్నై సూపర్ కింగ్స్ vs పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ఎక్కడ చూడాలి?

స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మీరు చెన్నై సూపర్ కింగ్స్ vs పంజాబ్ కింగ్స్ మధ్య IPL 2021 చూడవచ్చు.

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్  ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడాలి?

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్  ప్రత్యక్ష ప్రసారాన్ని మీరు డిస్నీ హాట్‌స్టార్‌లో చూడవచ్చు

ఇవి కూడా చదవండి: అమ్మాయిలతో ఏశాలేస్తే ఇంతేమరి.. పోకిరీల తాట తీసిన స్థానిక ప్రజలు.. ఎక్కడంటే..

Chanakya Niti: ఇలాంటి వ్యక్తులతో అస్సలు స్నేహం చేయవద్దు.. చేస్తే ఇక అంతే..