AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garlic For Sleep: పడుకునే ముందు దిండు కింద వెల్లుల్లి పెట్టుకుంటే కలిగే అద్భుత ప్రయోజనాలివే

నేటి ఆధునిక జీవనశైలిలో నిద్రలేమి ఒక పెద్ద సమస్యగా మారింది. చాలామంది రాత్రుళ్లు ప్రశాంతంగా నిద్రపట్టక ఇబ్బందులు పడుతుంటారు. ఇది శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే, కొన్ని సులువైన ఇంటి చిట్కాలతో ఈ సమస్యను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాంటి అద్భుతమైన చిట్కాలలో ఒకటి, వెల్లుల్లిని దిండు కింద ఉంచుకోవడం. ఈ సాధారణ అలవాటు నిద్రలేమి సమస్యను ఎలా తగ్గించి, ప్రశాంతమైన నిద్రను అందిస్తుందో, దీనివల్ల కలిగే ఇతర ఆశ్చర్యకరమైన ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Garlic For Sleep: పడుకునే ముందు దిండు కింద వెల్లుల్లి పెట్టుకుంటే కలిగే అద్భుత ప్రయోజనాలివే
Sleeping Problems Home Remedies
Bhavani
|

Updated on: Jun 23, 2025 | 10:11 PM

Share

భారతీయ వంటకాల్లో వెల్లుల్లికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం రుచి, సువాసన కోసమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మనకు తెలియని ఎన్నో లాభాలు వెల్లుల్లిలో దాగి ఉన్నాయి. ఇటీవలి అధ్యయనాల ప్రకారం, వెల్లుల్లి మానవులకు మంచి నిద్రను అందించడంలో గణనీయంగా సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు దిండు కింద ఒక వెల్లుల్లి రెబ్బను ఉంచుకుంటే, మీరు అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పోషకాల గని వెల్లుల్లి

వెల్లుల్లి పోషకాలకు నిలయం. ఇందులో విటమిన్-బి6, థయామిన్, పాంథోతేనిక్ యాసిడ్, విటమిన్-సి వంటి విటమిన్లు, అలాగే మాంగనీస్, ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. నిద్రకు ముందు దిండు కింద వెల్లుల్లిని ఉంచడం వల్ల దోమల బెడద తగ్గుతుంది. దీని సువాసన గది అంతా వ్యాపించి జలుబు, దగ్గు నుండి రక్షణ కల్పిస్తుంది. నిద్రలేమితో బాధపడేవారికి కూడా ఇది సహాయపడుతుంది.

నిద్రను మెరుగుపరిచే వెల్లుల్లి

నిజానికి, వెల్లుల్లిలో ఉండే విటమిన్ బి1, బి6లు నాడీ వ్యవస్థకు మెలటోనిన్‌ను చేరవేయడంలో సహాయపడతాయి. ఇది ప్రశాంతమైన నిద్రను ప్రోత్సహిస్తుంది. ఇందులో ఉండే యాంటీ-టాక్సిన్ గుణాలు ముక్కు దిబ్బడను తగ్గించి, ఇన్‌ఫెక్షన్లు శ్వాసకోశ సమస్యల నుండి రక్షిస్తాయి. దిండు కింద ఒక వెల్లుల్లి రెబ్బను ఉంచడం వల్ల నిద్ర మెరుగుపడుతుంది. నిద్ర సంబంధిత రుగ్మతలు దూరమవుతాయని ప్రాచీన కాలం నుంచి నమ్మకం ఉంది. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ వల్ల వచ్చే ఘాటైన వాసన నిద్రను ప్రేరేపించి, ప్రశాంతమైన ప్రభావాన్ని చూపుతుందని శాస్త్రీయంగానూ చెబుతున్నారు.

దిండు కింద వెల్లుల్లి రెబ్బను ఉంచడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. అయితే, మీకు వెల్లుల్లి ఘాటు వాసన నచ్చకపోతే, వెల్లుల్లితో తయారుచేసిన పానీయం కూడా మీ నిద్ర సమస్యలను సరిచేయగలదు. ఇందులో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

వెల్లుల్లి వాసనను నేరుగా తీసుకోలేకపోతే, దాని రసాన్ని నీటిలో కలిపి తాగవచ్చు. ఇలా చేయడం వల్ల వెల్లుల్లి వాసన బాధించదు, ప్రయోజనాలు లభిస్తాయి. దీన్ని నిద్రకు ముందు తాగడం మంచిది. దీనికోసం ముందుగా ఒక చిన్న గిన్నెలో ఒక వెల్లుల్లి రెబ్బను వేడి చేయండి. తరువాత, ఒక గ్లాసు పాలు వేయండి. వేడి చేసి, రుచికి సరిపడా చక్కెర తేనె కలపండి. ఈ పాలను వేడిగా కాని, చల్లగా కాని తాగవచ్చు. ఇది మీకు ప్రశాంతమైన నిద్రను అందిస్తుంది. తప్పకుండా ఒకసారి ప్రయత్నించండి.