Soft Skin Tips: బ్యూటీ పార్లర్‌కి వెళ్లకుండా ఇంట్లోనే మృదువైన చర్మం పొందాలంటే..
అమ్మాయిలు అందంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటారు. ప్రతి ఒక్కరూ మెరిసే, మృదువైన చర్మం కావాలని కలలు కంటారు. మెరిసే అందం కోసం చాలా మంది వారానికోసారి పార్లర్‌కి వెళ్లి ఫేషియల్, స్పా చేయించుకుంటారు. మరికొందరు సోషల్ మీడియాలో పలు వీడియోలు చూసి సౌందర్య చిట్కాలు పాటిస్తుంటారు. కానీ ఒక్క రూపాయి ఖర్చుపెట్టకుండా, బ్యూటీ పార్లర్‌కి వెళ్లకుండానే నెల రోజుల్లో..
అమ్మాయిలు అందంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటారు. ప్రతి ఒక్కరూ మెరిసే, మృదువైన చర్మం కావాలని కలలు కంటారు. మెరిసే అందం కోసం చాలా మంది వారానికోసారి పార్లర్‌కి వెళ్లి ఫేషియల్, స్పా చేయించుకుంటారు. మరికొందరు సోషల్ మీడియాలో పలు వీడియోలు చూసి సౌందర్య చిట్కాలు పాటిస్తుంటారు. కానీ ఒక్క రూపాయి ఖర్చుపెట్టకుండా, బ్యూటీ పార్లర్‌కి వెళ్లకుండానే నెల రోజుల్లో మృదువైన, మెరిసే చర్మాన్ని పొందాలనుకుంటే ఈ చిట్కాలు తప్పకపాటించాలి. అవేంటో తెలుసుకోండి..
నిమ్మ – తేనె ఫేస్ మాస్క్
సమాన మొత్తంలో తేనె, నిమ్మరసం ఒక గిన్నెలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై 15-20 నిమిషాల పాటు అప్లై చేయాలి. తేనె చర్మాన్ని తేమగా, మృదువుగా చేస్తుంది. నిమ్మ రసం కూడా చర్మం స్థితిస్థాపకతను పెంచి, చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది.
అవకాడో మాస్క్
పండిన అవకాడోను తీసుకుని మెత్తగా పేస్టులా చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులు, కాళ్లకు అప్లై చేసుకోవాలి. ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచుకుని.. ఆ తర్వాత కడిగేయాలి. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇతర పోషకాలు చర్మం సహజంగా మెరిసేలా చేస్తాయి. అంతేకాకుండా ఇది చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచి, మృదువుగా మారుస్తుంది.
షుగర్ స్క్రబ్
పంచదార, ఆలివ్ ఆయిల్ సమపాళ్లలో తీసుకుని బాగా కలుపుకోవాలి. ఆలివ్ నూనెకు బదులుగా కొబ్బరి నూనెను కూడా ఉపయోగించవచ్చు. తర్వాత చర్మంపై ఈ ఎక్స్‌ఫోలియేటింగ్ స్క్రబ్‌తో మృదువుగా మసాజ్ చేసుకోవాలి. ఇది చర్మం ఉపరితలంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది. మీరు ఈ స్క్రబ్‌ని వారానికి 2 రోజులు ఉపయోగించవచ్చు.
పెరుగు – దోసకాయ మాస్క్
పుల్లని పెరుగులో దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మానికి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుం. చర్మాన్ని హైడ్రేట్‌గా కూడా ఉంచుతుంది. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్‌ని మీ ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల పాటు ఆరనిచ్చి కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మంలో మళ్లీ తాజాదనం వస్తుంది. అలాగే ఇందులో ఉండే మాయిశ్చరైజింగ్ ఏజెంట్ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
పాలు కలిపిన నీళ్లతో స్నానం
స్నానం చేసే నీళ్లలో కొన్ని కప్పుల పాలు కలుపుకోవాలి. పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, మృదువుగా ఉంచడానికి సహాయపడుతుంది. పాలతో స్నానం చేయలేకపోతే.. కనీసం ముఖం వరకైనా రోజూ పాలతో శుభ్రం చేసుకోవచ్చు.
అలోవెరా జెల్ మాస్క్
అలోవెరా జెల్ లేదా కలబంద గుజ్జు తీసుకుని చర్మంపై మసాజ్ చేసుకోవాలి. అలోవెరా జెల్‌ని రోజుకు రెండుసార్లు ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలోవెరాలోని హైడ్రేటింగ్, స్మూత్టింగ్ లక్షణాలు మీ చర్మాన్ని పొడిబారకుండా చేసి, ఎల్లప్పుడూ తేమగా ఉండేలా కాపాడతాయి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.