Dengue Mosquito: డెంగ్యూ దోమలు ఎలా గుర్తించాలో తెలుసా? ఈ సమయాల్లో మాత్రమే అవి..
డెంగ్యూ జ్వరం అత్యంత ప్రాణాంతకం. డెంగ్యూ జ్వరం దోమల ద్వారా వ్యాపించే వ్యాధి. ఏడెస్ ఈజిప్టి అనే ప్రత్యేక జాతి దోమ ఈ వ్యాధికి ప్రధాన వాహకం. ఈ దోమలు ఉష్ణ మండల ప్రాంతాల్లో అంటే వేడి ప్రాంతాల్లో ఏడాది పొడవునా జీవించి ఉంటాయి. ఈడిస్ ఈజిప్టి దోమ కాటు వల్ల డెంగ్యూ వ్యాధి సంక్రమిస్తుంది. డెంగ్యు కేవలం మనుషులకే కాకుండా జంతువులకు కూడా వ్యాపిస్తుంది. అయితే, ఈ వ్యాధిని వ్యాప్తి చేసే దోమలను ఎలా గుర్తించాలి? ఈడిస్ ఈజిప్టి దోమను..
డెంగ్యూ జ్వరం అత్యంత ప్రాణాంతకం. డెంగ్యూ జ్వరం దోమల ద్వారా వ్యాపించే వ్యాధి. ఏడెస్ ఈజిప్టి అనే ప్రత్యేక జాతి దోమ ఈ వ్యాధికి ప్రధాన వాహకం. ఈ దోమలు ఉష్ణ మండల ప్రాంతాల్లో అంటే వేడి ప్రాంతాల్లో ఏడాది పొడవునా జీవించి ఉంటాయి. ఈడిస్ ఈజిప్టి దోమ కాటు వల్ల డెంగ్యూ వ్యాధి సంక్రమిస్తుంది. డెంగ్యు కేవలం మనుషులకే కాకుండా జంతువులకు కూడా వ్యాపిస్తుంది. అయితే, ఈ వ్యాధిని వ్యాప్తి చేసే దోమలను ఎలా గుర్తించాలి? ఈడిస్ ఈజిప్టి దోమను ఎలా గుర్తించాలి? వంటి విషయాలు చాలా మందికి తెలియవు.
అసలింతకీ ఈడిస్ ఈజిప్టి దోమను ఎలా గుర్తించాలి?
ఈడిస్ ఈజిప్టి దోమ.. డెంగ్యూ దోమ ముదురు రంగులో ఉంటుంది. కాళ్లపై తెల్లటి మచ్చలు ఉంటాయి. ఛాతీలో వీణ తీగల వంటి మచ్చలు ఉంటాయి. ఈడిస్ ఈజిప్టి సాధారణ దోమల కంటే పరిమాణంలో చిన్నది. పొడవు 4 నుండి 7 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటుంది. ఆడ దోమలు మగ దోమల కంటే పొడవుగా ఉంటాయి. ఈ దోమలు సాధారణంగా నీళ్లలో గుడ్లు పెడతాయి. పొదిగిన లార్వా ఆల్గే.. చిన్న నీటి జీవులు, మొక్కల కణాలను ఆహారంగా తింటాయి. ఈడిస్ ఈజిప్టి దోమలు శీతాకాలంలో జీవించలేవు. అందుకే ఈ దోమలు వేసవిలో లేదా వర్షాకాలంలో మాత్రమే గుడ్లు పెడుతుంటాయి.
డెంగ్యూ దోమలు పగటిపూట ఎక్కువగా కుడతాయి. ఇవి పగటిపూట చాలా చురుకుగా ఉంటాయి. సూర్యోదయం తర్వాత రెండు గంటల వరకు, అలాగే సూర్యాస్తమయానికి కొన్ని గంటల ముందు వరకు ఈ దోమ కుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆడ దోమలు మాత్రమే మనుషులను కుడతాయి. ఈడిస్ ఈజిప్టి దోమలు సాధారణంగా చల్లని లేదా నీడ ఉన్న ప్రదేశాలలో ఉంటాయి. ఇవి ఇళ్ల లోపల అల్మారాల్లో, మంచం కింద ఎక్కువగా నివసించే అవకాశం ఉంది. ఈ దోమ సాధారణంగా చీలమండలు, మోచేతులు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కుడుతుంటాయి.
ఈడిస్ ఈజిప్టి దోమలను ఎలా నివారించాలంటే..
- ఇంటి లోపల లేదా మీ పరిసర ప్రాంతాల్లో నిల్వ నీరు లేకుండా చూసుకోవాలి.
- మొక్కల కుండీల్లో నిల్వ నీరు ఉంటే మట్టి లేదా ఇసుకతో నింపాలి
- ఫుల్ స్లీవ్స్, లేత రంగు దుస్తులు ధరించాలి
- ఇళ్ల తలుపులు, కిటికీలను వీలైనంత వరకు మూసి ఉంచండి
- దోమల నివారణ క్రీములు, కాయిల్స్, దోమతెరలను క్రమం తప్పకుండా వినియోగించాలి
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.