Almond Oil: ముఖానికి బాదం నూనె రాసుకుంటున్నారా..? జాగ్రత్త..!
బాదం పప్పు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో, బాదం నూనె కూడా అంతే ప్రయోజనకరమైంది అంటున్నారు నిపుణులు. అందం, ఆరోగ్యానికి మేలు చేసే గుణాలెన్నో బాదం నూనెలో ఉన్నాయంటున్నారు నిపుణులు. బాదం నూనెతో జుట్టు చివర్లు చిట్లడం, పొడిబారడం వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. స్నానానికి ముందు బాదం నూనెతో ఒంటికి మసాజ్ చేసుకోవడం వల్ల చర్మానికి మంచి నిగారింపు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కానీ, బాదం ఆయిల్ ముఖానికి అప్లై చేయటం కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...

బాదం పప్పు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో, బాదం నూనె కూడా అంతే ప్రయోజనకరమైంది అంటున్నారు నిపుణులు. అందం, ఆరోగ్యానికి మేలు చేసే గుణాలెన్నో బాదం నూనెలో ఉన్నాయంటున్నారు నిపుణులు. బాదం నూనెతో జుట్టు చివర్లు చిట్లడం, పొడిబారడం వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. స్నానానికి ముందు బాదం నూనెతో ఒంటికి మసాజ్ చేసుకోవడం వల్ల చర్మానికి మంచి నిగారింపు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కానీ, బాదం ఆయిల్ ముఖానికి అప్లై చేయటం కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం…
బాదం నూనె స్నానం చేయడానికి ముందు శరీరానికి రాసుకొని బాగా మర్దన చేసుకోవటం వల్ల చర్మానికి మంచి నిగారింపు వస్తుందని చెబుతున్నారు. బాదంలో విటమిన్లు, పోషకాలు చర్మ సమస్యల్ని దూరం చేయడంలో సమర్థంగా పనిచేస్తాయని చెబుతున్నారు. బాదం ఆయిల్ ముఖానికి అప్లై చేయటం వల్ల కొందరిలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. బాదం నూనెలోని కొన్ని అంశాలు చర్మంలో దురద, మంటను కలిగిస్తాయని చెబుతున్నారు.
ఆయిలీ స్కిన్ ఉన్నవారు బాదం నూనె ముఖానికి రాస్తే మొటిమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కొంతమందికి బాదం అలెర్జీని కలిగిస్తుంది. నూనె రాస్తే చర్మం ఎర్రబడుతుంది, దురద, వాపు వస్తుంది. బాదం నూనె ముఖానికి రాసి ఎండలోకి వెళితే చర్మం రంగు మారుతుంది. చర్మం రంగు సరిగ్గా ఉండదు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








