AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alert: మీకు ఈ ఏడు అలవాట్లు ఉన్నాయా..? అయితే, గుండెపోటు గ్యారెంటీ అంట..

గుండెపోటు సమస్య రోజురోజుకు పెరుగుతోంది.. గుండెపోటు సమస్య వృద్ధుల్లోనే కాకుండా పిల్లలు, యువకులలో కూడా కనిపిస్తోంది. ఇటీవల యువతలో గుండెపోటు కేసులు అధికంగా పెరిగాయి. తరచుగా గుండెపోటు అకస్మాత్తుగా వస్తుందని అనుకుంటారు.. కానీ దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయి..

Alert: మీకు ఈ ఏడు అలవాట్లు ఉన్నాయా..? అయితే, గుండెపోటు గ్యారెంటీ అంట..
Heart Attack
Shaik Madar Saheb
|

Updated on: Apr 09, 2024 | 11:26 AM

Share

గుండెపోటు సమస్య రోజురోజుకు పెరుగుతోంది.. గుండెపోటు సమస్య వృద్ధుల్లోనే కాకుండా పిల్లలు, యువకులలో కూడా కనిపిస్తోంది. ఇటీవల యువతలో గుండెపోటు కేసులు అధికంగా పెరిగాయి. తరచుగా గుండెపోటు అకస్మాత్తుగా వస్తుందని అనుకుంటారు.. కానీ దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయి.. అయితే దీని వెనుక కారణం ఏమిటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? లేకపోతే ఈ విషయాలను తెలుసుకోవడం మంచిది.. ముఖ్యంగా గుండెపోటుకు కొన్ని అలవాట్లు ప్రభావితం చేస్తాయి. భారతీయ ప్రజలలో క్రమంగా పెరుగుతున్న 7 అలవాట్ల వల్ల గుండెపోటు ప్రమాదం మరింత ఎక్కువగా పెరుగుతోంది.. గుండెపోటు ప్రమాదం వేగంగా పెరగడంతోపాటు.. పలు సమస్యలు కూడా వస్తాయి. ఈ రోజుల్లో యువత గుండెపోటు బారిన పడేలా చేస్తున్న ఆ ఏడు కారకాలు ఏంటో తెలుసుకోండి..

  1. డెస్క్ ఉద్యోగాలు పెరగడం, శారీరక శ్రమ లేకపోవడంతో, చాలా మంది భారతీయులు అనారోగ్యకరమైన, క్రమరహిత జీవితాలను గడుపుతున్నారు.. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతున్నాయి..
  2. భారతదేశంలో అధిక కొవ్వు, చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగం గణనీయంగా పెరిగింది. ఇవి ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు, అధిక రక్తపోటు, గుండె జబ్బుల లాంటి ప్రమాదకర జబ్బులకు దారితీస్తుంది.
  3. భారతదేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఇటీవలి కాలంలో వేగంగా పెరిగింది. దీని కారణంగా ప్రజలు కూడా గుండె జబ్బు సమస్యలతో పోరాడుతున్నారు.
  4. పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, జీవనశైలి మార్పులు వంటి వివిధ కారణాల వల్ల ఒత్తిడి స్థాయిలు పెరిగుతాయి. ఇవి గుండె సమస్యలకు దోహదం చేస్తాయి.
  5. భారతదేశంలో ముఖ్యంగా మెట్రో నగరాలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి నగరాల్లో పేలవమైన గాలి నాణ్యత సూచిక కారణంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతోంది.
  6. ధూమపానం, పొగాకు, మద్యం భారతదేశంలో విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఇవి గుండె సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలకు మూల కారణంగా మారుతున్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
  7. శారీరక శ్రమ తగ్గిపోవడం, జన్యువులు, వ్యాయామ లోపం, వ్యాధుల పట్ల నిర్లక్ష్యం, సమయానుకూలంగా చికిత్స పొందకపోవడం లాంటివి కూడా గుండెజబ్బులకు కారణమవుతున్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..