అమ్మాయిలు, అబ్బాయిలూ తస్మాత్ జాగ్రత్త.. యువతను బలిపశువుల్లా మారుస్తున్న ఈ 3 ప్రమాదకర వ్యాధులు..

ఈరోజుల్లో ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండటం వల్ల చాలా మంది యువత తీవ్ర వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ బిజీ లైఫ్‌లో చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు వారి ఆరోగ్యంపై తీవ్రమైన విధంగా చెడు ప్రభావం చూపుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు మూడు ప్రమాదకరమైన వ్యాధుల బాధితులుగా మారుతున్నారు.

అమ్మాయిలు, అబ్బాయిలూ తస్మాత్ జాగ్రత్త.. యువతను బలిపశువుల్లా మారుస్తున్న ఈ 3 ప్రమాదకర వ్యాధులు..
Health
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 09, 2024 | 11:30 AM

ఈరోజుల్లో ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండటం వల్ల చాలా మంది యువత తీవ్ర వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ బిజీ లైఫ్‌లో చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు వారి ఆరోగ్యంపై తీవ్రమైన విధంగా చెడు ప్రభావం చూపుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు మూడు ప్రమాదకరమైన వ్యాధుల బాధితులుగా మారుతున్నారు. సరైన సమయంలో శ్రద్ద తీసుకోకపోతే ఈ మూడు వ్యాధులు మహమ్మారి రూపం దాల్చుతాయని, అందుకే యువత ఆరోగ్యం గురించి ఆలోచించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల, మీరు వెంటనే మీ దినచర్య, అలవాట్లలో మార్పులు చేయడంపై దృష్టి పెట్టాలని పేర్కొంటున్నారు.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నేటి యువత ఆరోగ్యం పట్ల చాలా అజాగ్రత్తగా కనిపిస్తోంది. దీని కారణంగా, వారిలో మూడు ప్రమాదకరమైన వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయంటున్నారు.. అవేంటో తెలుసుకోండి..

ఊబకాయం: WHO ప్రకారం, నేడు ప్రపంచంలో ఊబకాయం చాలా వేగంగా పెరుగుతోంది. జీవనశైలి వ్యాధులకు సంబంధించిన అతిపెద్ద ఆందోళన ఇది. గణాంకాలను పరిశీలిస్తే, 1990 నుండి 2024 వరకు ఊబకాయం నాలుగు రెట్లు పెరిగింది. అందువల్ల, దానిని తగ్గించడంపై దృష్టి పెట్టాలి. ఆయుర్వేదంలో స్థూలకాయాన్ని నియంత్రించడానికి, వాత, పిత్త, కఫాలను నియంత్రించడానికి జీవక్రియ ప్రక్రియను సరిచేయడానికి సలహా ఇస్తారు.

గుండె జబ్బులు (హృదయ సంబంధ వ్యాధులు): కార్డియోవాస్కులర్ డిజార్డర్స్ కూడా యువతను ఎక్కువగా బాధితులుగా మారుస్తున్నాయి. ప్రపంచంలో ప్రతి సంవత్సరం 30 శాతానికి పైగా మరణాలు ఈ కారణంగానే సంభవిస్తున్నాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో రక్తపోటు, డయాబెటిస్ మెల్లిటస్, డైస్లిపిడెమియా, ఊబకాయం, గుండె జబ్బులు మాత్రమే కాకుండా వేగంగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆహారంలో పోషకాలు లేకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి..

మధుమేహం: అధిక రక్తపోటు వల్ల వచ్చే మధుమేహం భవిష్యత్తులో మహమ్మారిలా పరిణమించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో దాని రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీనికి కారణాలు అనారోగ్య జీవనశైలి, అధిక కేలరీల ఆహారం, ఒత్తిడి, నిద్ర లేకపోవడం అని పేర్కొంటున్నారు. దీన్ని నియంత్రించేందుకు ఆయుర్వేదంలో ఎన్నో చిట్కాలు ఉన్నాయి.. వీటిలో తీపి పదార్థాలకు దూరంగా ఉండటం, రోజువారీ వ్యాయామం, ఒత్తిడికి దూరంగా ఉండటం, సీజన్‌కు అనుగుణంగా ఆహారం, ధ్యానం, ప్రాణాయామం, యోగా చేయడం లాంటివి అవలంభించాలి..

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?
సైనిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు
సైనిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు