Interesting Facts: కేవలం భారత్‌లోనే కాదు.. ఈ దేశాల్లో కూడా సంక్రాంతి చేస్తారు..
సంక్రాంతి పండుగ వచ్చిందంటే.. ఎక్కడున్నా పల్లెల్లో వాలిపోవాల్సిందే. పల్లెల్లో జరిగే ఆ సంక్రాంతి పండుగ కిక్కే వేరు. అందుకే ఎంత కష్టమైనా, ఖర్చైనా, ఇబ్బంది అయినా పల్లెలకు వచ్చేస్తారు. సంక్రాంతికి అందరి ఇళ్లు కళకళలాడుతూ ఉంటాయి. అల్లుళ్లు అత్తారిల్లకు చేరుకుంటారు. కోడి పందేలు, పేకాటలు, మందు, చిందు, ఆటలు ఇలా కోలాహలంగా సంక్రాంతి జరుగుతుంది. అయితే చాలా మంది కేవలం భారత దేశంలో మాత్రమే..

సంక్రాంతి పండుగ వచ్చిందంటే.. ఎక్కడున్నా పల్లెల్లో వాలిపోవాల్సిందే. పల్లెల్లో జరిగే ఆ సంక్రాంతి పండుగ కిక్కే వేరు. అందుకే ఎంత కష్టమైనా, ఖర్చైనా, ఇబ్బంది అయినా పల్లెలకు వచ్చేస్తారు. సంక్రాంతికి అందరి ఇళ్లు కళకళలాడుతూ ఉంటాయి. అల్లుళ్లు అత్తారిల్లకు చేరుకుంటారు. కోడి పందేలు, పేకాటలు, మందు, చిందు, ఆటలు ఇలా కోలాహలంగా సంక్రాంతి జరుగుతుంది. అయితే చాలా మంది కేవలం భారత దేశంలో మాత్రమే సంక్రాంతి పండుగ చేసుకుంటారు అనుకకుంటారు. కానీ ఇతర దేశాల్లో కూడా సంక్రాంతి పండుగ జరుపుతారు. కానీ పేర్లే వేరు. వారి వారి సంప్రదాయాల్లో ఈ సంక్రాంతిని చేసుకుంటూ ఉంటారు. మరి ఇంతకీ ఏ దేశాల్లో సంక్రాంతి చేస్తారో ఇప్పుడు చూద్దాం.
శ్రీలంక..
శ్రీలంకలో సంక్రాంతిని ఉజాహవర్ తిరానల్ అని పిలుస్తారు. తమిళులు ఎక్కువగా శ్రీలంకలో నివిస్తూంటారు. అందుకే పొంగల్ అని కూడా పిలుస్తారు. భారత దేశ సంస్కృతికి కొద్దిగా భిన్నంగా ఇక్కడ తిరానల్ చేస్తారు. శ్రీలంక ప్రజలు ఖచ్చితంగా అక్కడ సంప్రదాయాలను పాటిస్తారు.
కంబోడియా..
కంబోడియాలో మోహ సంక్రాణం అని అంటారు. సంవత్సరం పొడవునా సంతోషకరమైన వాతారణం ఉండాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వివిధ రకాల పూజలు జరుపుతారు.
నేపాల్..
ఇక్కడ కూడా సంక్రాంతి పండుగను జరుపుతారు. నేపాల్‌లో మాఘే సంక్రాంతి అని, తరు సమాజంలో సూర్యోత్తరయన్ అని కూడా పిస్తారు. సంక్రాంతి పండక్కి పంచదారు, కూరగాయలు, నువ్వులు, నెయ్యితో తయారు చేసిన ఆహారాలు తింటారు. నదుల సంగమాల్లో స్నానాలు ఆచరిస్తారు.
థాయ్ లాండ్..
థాయ్ లాండ్‌లో కూడా సంక్రాంతిని జరుపుకుంటారు. ఇక్కడ సంకర్ణ అని పిలుస్తారు. ఇక్కడ కూడా పొంగల్‌కి గాలి పటాలు ఎగురవేసే సంప్రదాయం ఉంది. దేశంలో శాంతి, శ్రేయస్సు ఉండాలని సన్యాసులు, పూజారులు గాలి పటాలను ఎగుర వేస్తారు.
మయన్మార్..
మయన్మార్‌లో సంక్రాంతి పండుగను నాలుగు రోజులు చేస్తారు. ఇక్కడ థినాగ్యాన్ అని పిలుస్తారు. ఇది బౌద్ధువులకు సంబంధించిన ఆచారం. ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తారు. మకర సంక్రాంతికి భిన్నమైన రూపాన్ని ఇక్కడ చూడొచ్చు.
పాకిస్తాన్‌లో..
పాకిస్తాన్‌లో కూడా మకర సంక్రాంతి పండుగను చేస్తారు. లాల్ లోయి అని పులస్తారు. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో హిందువులు ఈ పండుగ చేస్తారు.




