- Telugu News Photo Gallery Beauty Tips: How to use Hibiscus Flower for skin problems, check details in Telugu
Hibiscus Flower for skin: మందార పువ్వుతో ముఖాన్ని మెరిపించండిలా!
మందార పువ్వు అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది హెయిర్. తలకు మందార పువ్వు, ఆకులను రాస్తే జుట్టు సమస్యలు తగ్గుతాయని తెలుసు. కానీ మందార పువ్వుతో చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. మందార ఆకులను కేవలం జుట్టు, చర్మ సమస్యలను తగ్గించుకోవడానికే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు. మందార పువ్వులను బాగా ఎండ పడితే పొడిలా అవుతుంది. ఈ పొడిలో టమాటా రసాన్ని కలిపి కాళ్లు, చేతులు, మెడ, ముఖానికి..
Updated on: Jan 15, 2024 | 5:48 PM

మందార పువ్వు అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది హెయిర్. తలకు మందార పువ్వు, ఆకులను రాస్తే జుట్టు సమస్యలు తగ్గుతాయని తెలుసు. కానీ మందార పువ్వుతో చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. మందార ఆకులను కేవలం జుట్టు, చర్మ సమస్యలను తగ్గించుకోవడానికే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు.

మందార పువ్వులను బాగా ఎండ బెడితే పొడిలా అవుతుంది. ఈ పొడిలో టమాటా రసాన్ని కలిపి కాళ్లు, చేతులు, మెడ, ముఖానికి బాగా పట్టించండి. ఓ 15 నిమిషాల తర్వాత ముఖం కడుక్కుంటే.. ఫేస్ కాంతి వంతంగా ఉంటుంది.

మందార పువ్వును గ్రౌండ్ చేసి అలోవెరా జెల్‌ను కలపండి. ఈ ఫేస్ ప్యాక్ ముఖానికి అప్లూ చేసి.. 15 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్‌తో ముఖం కడుక్కుంటే.. జిడ్డు పోయి.. ఫేస్ క్లియర్‌గా ఉంటుంది.

మందార ఆకులు పొడి అయ్యేంతవరకు ఎండలో ఎండ బెట్టాలి. ఈ పొడిలో ముల్తానీ మట్టి కలుపుకుని ముఖానికి అప్లే చేసుకోవాలి. కావాలి అనుకున్న వారు పెరుగు కూడా కలుపుకోవచ్చు. ఇలా చేస్తే మీ ముఖం అందంగా మెరిసి పోతుంది.

మందార పువ్వులతో స్క్రబ్ కూడా తయారు చేసుకోవచ్చు. మందార పువ్వుల పొడిలో.. కొద్దిగా పంచదార, శనగ పిండి, పాలు వేసి ముఖంపై సున్నితంగా స్క్రబ్ చేయండి. ఇలా చేస్తే ముఖంపై ఉండే ట్యాన్ అంతా పోయి.. ముఖం క్లియర్‌గా ఉంటుంది.




