- Telugu News Photo Gallery Changing the toothbrush or not these health problems are unavoidable, check here is details in Telugu
Dental Care: టూత్ బ్రష్‌ని మార్చడం లేదా.. ఈ అనారోగ్య సమస్యలు తప్పవు!
టూత్ బ్రష్.. లేకపోతే ఉదయం ఎవరికీ రోజు స్టార్ట్ కాదు. కొందరు రెగ్యులర్‌గా కొన్ని రోజులకు టూత్ బ్రష్‌ని ఉపయోగిస్తూ ఉంటారు. మరికొందరు ఎంత పాడైనా అస్సలు మార్చరు. బాగానే ఉంది కదా.. అని కంటిన్యూగా సంవత్సరాల తరబడి ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో అన్న విషయాన్ని గుర్తించారు. ఆరోగ్య నిపుణుల అధ్యయనం ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి టూత్ బ్రష్‌ని ఖచ్చితంగా మార్చాలని చెబుతున్నారు. అసలు టూత్ బ్రష్‌ని ఎందుకు మార్చాలి? మార్చకపోతే ఎలాంటి సమస్యలు..
Updated on: Jan 16, 2024 | 11:15 AM

టూత్ బ్రష్.. లేకపోతే ఉదయం ఎవరికీ రోజు స్టార్ట్ కాదు. కొందరు రెగ్యులర్‌గా కొన్ని రోజులకు టూత్ బ్రష్‌ని ఉపయోగిస్తూ ఉంటారు. మరికొందరు ఎంత పాడైనా అస్సలు మార్చరు. బాగానే ఉంది కదా.. అని కంటిన్యూగా సంవత్సరాల తరబడి ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో అన్న విషయాన్ని గుర్తించారు.

ఆరోగ్య నిపుణుల అధ్యయనం ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి టూత్ బ్రష్‌ని ఖచ్చితంగా మార్చాలని చెబుతున్నారు. అసలు టూత్ బ్రష్‌ని ఎందుకు మార్చాలి? మార్చకపోతే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి 12 నుంచి 16 వారాలకు ఖచ్చితంగా టూత్ బ్రష్‌ని మార్చాలని డెంటిస్టులు సూచిస్తున్నారు. టూత్ బ్రష్ మార్చకపోతే.. పళ్లకు ఇన్ ఫెక్షన్ వ్యాప్తి చెంది, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసన, దంత క్షయం వంటి సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు.

అలాగే ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా టూత్ బ్రష్‌లను మార్చాలి. ఎందుకంటే ఇంట్లో అందరూ కలిసి ఒకేచోట బ్రష్‌లను పెడుతూ ఉంటారు. దీని వల్ల బ్యాక్టీరియా వ్యాప్తి చెంది.. పళ్లకు ఇన్ ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది.

ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌ను అయితే ప్రతి 12 వారాలకు మార్చాలని వైద్యులు సూచిస్తున్నారు. బ్రష్ హెడ్ మార్చితే సరిపోతుంది. అలాగే ఉదయం, రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా బ్రష్ చేసుకోవాలి వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల పళ్లు ఆరోగ్యంగా ఉంటాయని అంటున్నారు.




