- Telugu News Photo Gallery Is it so dangerous to drink tea in tea cups? What experts say, check here is details in Telugu
Health Tips: టీ కప్పుల్లో టీ తాగడం అంత డేంజరా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
టీ, కాఫీ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. ఎప్పుడైనా తల నొప్పిగా, నీరసంగా, అలసటగా ఉండటం వల్ల రీ ఫ్రెష్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. టీ, కాఫీ అంటే చాలా మందికి ఇష్టం. ఇందులో ఎన్నో రక రకాలు కూడా వచ్చాయి. సాధారణంగా ఇంట్లో అయితే స్టీల్ లేదా ఇత్తడి, గ్లాస్ గ్లాసుల్లో టీ తాగుతూ ఉంటారు. కానీ బయట అలా కుదరదు కదా. ప్లాస్టిక్ గ్లాసులోనే టీ లేదా కాఫీ తాగాల్సి వస్తుంది. అలాగే ఇంట్లో పెళ్లిళ్లు, ఫంక్షన్లు అయినా.. ప్లాస్టిక్ కప్పులనే ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే వీటిని ఒకసారి యూజ్ చేసిన తర్వాత పడేయవచ్చు. కడగాల్సిన అవసరం..
Chinni Enni | Edited By: Ravi Kiran
Updated on: Jan 16, 2024 | 2:30 PM

టీ, కాఫీ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. ఎప్పుడైనా తల నొప్పిగా, నీరసంగా, అలసటగా ఉండటం వల్ల రీ ఫ్రెష్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. టీ, కాఫీ అంటే చాలా మందికి ఇష్టం. ఇందులో ఎన్నో రక రకాలు కూడా వచ్చాయి. సాధారణంగా ఇంట్లో అయితే స్టీల్ లేదా ఇత్తడి, గ్లాస్ గ్లాసుల్లో టీ తాగుతూ ఉంటారు. కానీ బయట అలా కుదరదు కదా. ప్లాస్టిక్ గ్లాసులోనే టీ లేదా కాఫీ తాగాల్సి వస్తుంది.

అలాగే ఇంట్లో పెళ్లిళ్లు, ఫంక్షన్లు అయినా.. ప్లాస్టిక్ కప్పులనే ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే వీటిని ఒకసారి యూజ్ చేసిన తర్వాత పడేయవచ్చు. కడగాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ పేపర్ కప్పులు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీని వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

ప్లాస్టిక్ లేదా కాగితపు కప్పుల్లో పెట్రోలియం ఆధారిత రసాయనం బిస్పెనాల్ కలుస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. ఇలాంటి కప్పుల్లో టీ తాగడం వల్ల ఉదర సంబంధిత వ్యాధులు వస్తాయి.

ఈ కప్పులో టీ తాగినప్పుడు.. నేరుగా కడుపులోకి వెళ్తాయి. దీంతో పలు రకాల ఇన్ ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ప్రతి రోజూ ఒక పేపర్ కప్పులో టీ తాగితే.. బీపీఏ పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఇది కూడా శరీరానికి చాలా హానికరం.

శరీరంలో బీపీఏ స్థాయి పెరిగితే క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.





























