Kitchen Tips: ఖరీదైన రూమ్ స్ప్రేలు వద్దు.. నిమ్మ తొక్కలతో ఇళ్లంతా గుభాళించే పరిమళం ! ఎలాగంటే..
కొన్ని సార్లు మనం ఎటైనా లాంగ్ ట్రిప్ వెల్లి వచ్చిప్పుడూ, లేదా ఏదైనా ఘాటైన వంటకాలు వండినప్పుడు.. ఇంట్లోంచి అదోరకం వాసనలు వస్తుంటాయి, కొన్ని వండిన పాత్రలను అలానే సింక్‌లో వదిలేయడం వల్ల కూడా ఇంట్లో స్మెల్ వస్తుంది. ఈ దుర్వాసనను పొగొట్టేందుకు చాలా మంది బయట మార్కెట్‌లో దొరికే రూమ్స్ స్ప్రేలు వాడుతుంటారు. కానీ మన కిచెన్‌లో దొరికే కొన్ని వస్తువలతోనే ఈ దుర్వాసనను దూరం చేసుకోవచ్చని మీకు తెలుసా? అయితే తెలుసుకుందాం పదండి.

చాలా మందికి తిన్న వెంటనే వంట పాత్రలను కడిలే అలవాటు ఉండదు.. ముఖ్యంగా బ్యాచ్‌లర్స్.. తిన్న వాటిని అలానే సింక్‌లో వదిలేస్తారు, ఇలా చేయడం వల్ల కొన్ని సార్లు రూమ్‌లో దుర్వాసన వస్తుంది. అలాగే ఇళ్లలో ఏవైనా ఘాటైన వంటు వడినప్పుడు.. ఆ వాసన ఇళ్లు మొత్తం వ్యాపిస్తుంది.. ఇది ఇంటికొచ్చిన బంధువులకు కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చు. అలాంటప్పుడు మీరు ఇంటిని సహజంగా శుభ్రంగా సువాసన భరితంగా, తాజాగా ఉంచుకోవాలంటే.. ఇక్కడ ఒక చిట్కా ఉంది. అవుతున్న మీరు ఇంట్లో వాడే నిమ్మకాయ తొక్కలను, నల్లమిరియాల, ఇతర సుగంద ద్రవ్యాలతో కలిపి మరిగింది.. ఆ నీటిని ఇంట్లో స్ప్రే చేరినా, లేదా అలానే ఉంచినా క్షణాల్లో మీ ఇంటి వాతావరణం తాజాగా మారిపోతుంది. ఇళ్లు మొత్తం ఫ్రెష్‌గా , సువాసన వెదజల్లుతుంది. ఇది మీకు సహజమైన ఎయిర్ ఫ్రెషనర్‌గా పనిచేస్తుంది,
నిమ్మకాయ తొక్కలను, నల్ల మిరియాలతో కలిపి నీటిలో వేడి చేసినప్పుడు, అవి సువాసనగల నూనెలను విడుదల చేస్తాయి. ముఖ్యంగా నిమ్మికాయలో ఉండే లిమోనీన్ అనే సమ్మేళనం, మిరియాలతో ఉండే టెర్పెనెస్ వంటి సమ్మేళనాలతో కలిసి సువాసనను వెదజల్లుతుంది. ఇది గాలిలో సువాసనను వ్యాపింపజేసే తక్కువ, స్థిరమైన వేడితో ఉత్తమంగా పనిచేస్తుంది. ఇంది మనం వంటచేసి పడేసిన చెత్త నుంచి వచ్చే చెడు వాసనలను తటస్థీకరిస్తుంది. నిమ్మకాయ, మర్యాల వంటి సుగందద్రవ్యాల నుంచి వెలువడే సువాసన మన ఇంటి గదులను సహజంగా ఫ్రెష్‌గా మారుస్తుంది.
దీన్ని ఎలా తయారు చేయాలి
దీన్ని తాయారు చేసుకునేందుకు ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేదు. ఇందు కోసం మీరు ముందుగా ఒక పాత్రను తీసుకొని.. అందులో 1–2 నిమ్మ తొక్కలతో వేసి.. దానిలో 1 టీస్పూన్ నల్ల మిరియాలు వేయండి. అంటే ఒక స్పూన్ మిరియాలు వేస్తే సుమారు 4 కప్పుల నీరు వేసి ఆ మిశ్రమాన్ని 15–20 నిమిషాలు పాటు మరిగించండి. దాని నుంచి వచ్చిన ఆవిరి గదిలోకి ప్రవేశించి సువాసనను వెదజల్లుతుంది. అవి బాగా మరిగి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఆ వాటర్‌ను ఒక బాటిల్‌ఓ పెట్టుకొని ఇంట్లో అప్పుడప్పుడూ స్ప్రే చేసుకోండి. అయితే దాన్ని ఉండికించేటప్పుడూ అస్సలూ మూత పెట్టకండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




