AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rowdy Janardhana: రౌడీ జనార్ధన టీజర్..ఇదెక్కడి మేకోవర్ సామీ

Rowdy Janardhana: రౌడీ జనార్ధన టీజర్..ఇదెక్కడి మేకోవర్ సామీ

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Dec 24, 2025 | 12:47 PM

Share

విజయ్ దేవరకొండ "రౌడీ జనార్ధన్" సినిమా కోసం ఊహించని మేకోవర్‌తో ముందుకు వచ్చారు. సీమ స్టైల్‌లో లుంగీ, కత్తితో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ మాస్ అవతార్ విజయ్ కెరీర్‌కు కీలకం కానుంది. గత కొన్ని సినిమాల ఫలితాల నేపథ్యంలో, ఈ చిత్రం విజయ్‌కు మళ్ళీ ఫామ్ అందిస్తుందని ఆశిస్తున్నారు. 2026 ప్రథమార్ధంలో విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

ఇదెక్కడి మేకోవర్ సామీ.. అసలు మనం ఇన్నాళ్లూ స్క్రీన్ మీద చూసింది నిన్నేనా లేదంటే నీలా ఉన్న ఇంకెవర్నైనానా.. విజయ్ దేవరకొండ న్యూ అవతార్ చూసాక అభిమానులతో పాటు అందరికీ వస్తున్న అనుమానం ఇదే. వాళ్లన్నారని కాదు కానీ.. అసలు నిజంగానే విజయ్ ఇలా మారిపోయారేంటి..? ఆ మేకోవర్ ఏంటసలు..? రౌడీ జనార్ధన ఎట్టున్నాడో తెలుసా..? మారితే మొత్తం మారాలి.. కొంచెం కొంచెం కాదంటున్నారు విజయ్ దేవరకొండ. ఈయన లేటెస్ట్ మేకోవర్, కొత్త సినిమా టీజర్, ఆ డైలాగ్స్ అన్నీ చూస్తుంటే అసలు మనం ఇన్నాళ్లూ చూసిన విజయ్‌నేనా ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తుంది అనే అనుమానం రాక మానదు. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఊరమాస్ సినిమా చేస్తున్నారీయన.. సీమ స్టైల్‌లో లుంగీ కట్టి, కత్తి చేత బట్టారు రౌడీ బాయ్. రౌడీ జనార్ధన సినిమా విజయ్ దేవరకొండ కెరీర్‌కు కీలకం. కొన్నేళ్లుగా ఈయన నటించిన సినిమాలేవీ పెద్దగా ఆడట్లేదు.. ఖుషీ, కింగ్డమ్ లాంటి సినిమాలు పర్లేదనిపించినా విజయ్ కోరుకుంటున్న హిట్ అయితే ఇవ్వలేదు. ఈ కసితోనే డిఫెరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్నారు విజయ్. రౌడీ జనార్ధనతో పాటు రాహుల్ సంక్రీత్యన్‌తో పీరియడ్ డ్రామా కూడా చేస్తున్నారు విజయ్. రౌడీ అనే ఇంటిపేరున్నా ఇప్పటి వరకు ఆ రేంజ్ మాస్ ట్రై చేయలేదు విజయ్. రౌడీ జనార్ధన ఆ లోటు తీర్చేస్తుంది. రవికిరణ్ కోలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విధానం, ఆ ప్రొడక్షన్ వ్యాల్యూస్, డిజైనింగ్ అన్నీ నెక్ట్స్ లెవల్లో ఉన్నాయి. ఈ సినిమాతో ఫామ్‌లోకి వస్తానని ధీమాగా చెప్తున్నారు రౌడీ బాయ్. 2026 ఫస్టాఫ్‌లోనే సినిమా విడుదల కానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది

రైలు ప్రయాణికులకు షాక్‌.. పెరిగిన ఛార్జీలు

మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు

Egg Price: మండిపోతున్న కోడిగుడ్డు ధర.. డజన్ ఎంతంటే

ఊబకాయాన్ని తగ్గించే బ్యాక్టీరియా.. పరిశోధకుల కీలక ముందడుగు