Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

April Fools’ Day: ఏప్రిల్ ఫూల్స్ డే ని స్నేహితులతో, సన్నిహితులతో చిలిపి, సరదా పనులతో జరుపుకోండి ఇలా

ఏప్రిల్ ఫూల్స్ డే రొటీన్ లైఫ్ నుంచి కొంత విరామం ఇస్తుంది. ఆనందంగా గడపడానికి వేదికగా నిలుస్తుంది.  ఏప్రిల్ ఫూల్ చేయడానికి చేసే చిలిపి పనుల విషయానికి వస్తే..  అవి ప్రమాదకరం కానివి, ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో ఎవరైనా ఏప్రిల్ ఫూల్స్ డే 2024లో తమ స్నేహితులను, సన్నిహితులను పూల్స్ చేసి ఆనందించాలంటే కొన్ని తేలికైన, సురక్షితమైన చిలిపి పనులను ఈ రోజు చెబుతాం.. 

April Fools' Day: ఏప్రిల్ ఫూల్స్ డే ని స్నేహితులతో, సన్నిహితులతో చిలిపి, సరదా పనులతో జరుపుకోండి ఇలా
April Fools Day 2024 PranksImage Credit source: pexels
Follow us
Surya Kala

|

Updated on: Mar 31, 2024 | 11:38 AM

ఏప్రిల్ ఫూల్స్ డే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న జరుపుకుంటారు.స్నేహితులు, సహోద్యోగులు, కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు చిలిపి జోకులు వేసి సరదాగా ఆట పట్టిస్తూ ఎంతో సందడిగా జరుపుకుంటారు. అందరూ ఒకచోట చేరి తమ వింత చేష్టలలో ఉల్లాసభరితంగా జరుపుకుంటారు. అయితే ఒకరినొకరు ఆశ్చర్యపరచుకోవడానికి, ఆనందించడానికి తెలివైన ఉపాయాలను ఆలోచిస్తారు. ఈ రోజు సృజనాత్మకత,  తెలివికి పదును పెడతారు. ఎవరికీ హానిచేయని ఆచరణాత్మక జోకులతో సందడి చేస్తారు.

ఏప్రిల్ ఫూల్స్ డే రొటీన్ లైఫ్ నుంచి కొంత విరామం ఇస్తుంది. ఆనందంగా గడపడానికి వేదికగా నిలుస్తుంది.  ఏప్రిల్ ఫూల్ చేయడానికి చేసే చిలిపి పనుల విషయానికి వస్తే..  అవి ప్రమాదకరం కానివి, ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.

ఈ నేపథ్యంలో ఎవరైనా ఏప్రిల్ ఫూల్స్ డే 2024లో తమ స్నేహితులను, సన్నిహితులను పూల్స్ చేసి ఆనందించాలంటే కొన్ని తేలికైన, సురక్షితమైన చిలిపి పనులను ఈ రోజు చెబుతాం..

ఇవి కూడా చదవండి

ఏప్రిల్ ఫూల్స్ డే ప్రాంక్‌లు:

నకిలీ బగ్ ట్రిక్: ఈ చిలిపి పని ఎల్లప్పుడూ హిట్! ఏ వయస్సుకి చెందిన వారు అయినా సరే  భయాందోళనలకు గురవుతారు. సహోద్యోగి కీబోర్డ్ కింద లేదా కుటుంబ సభ్యుల దిండుపై ఇలా ఎవరూ  ఊహించని ప్రదేశాలలో నిజమైన పురుగు అనిపించేలా నకిలీ బగ్‌ను ఉంచండి.

ఆఫీసు చిలిపి పనులు: ఆఫీసులో ఏప్రిల్ ఫూల్స్ డేని జరుపుకుంటున్నట్లయితే, సహోద్యోగి డెస్క్‌ను స్టిక్కీ నోట్స్‌తో కవర్ చేయడం లేదా వారి కీబోర్డ్ కీలను మార్చడం వంటి హానిచేయని చిలిపి పనులు నవ్వు తెప్పిస్తాయి. మనసుని సంతోషంగా ఉంచుతాయి.

ఫుడ్ ప్రాంక్‌లు: ఆహార సంబంధిత చిలిపి పనులు ఎప్పుడూ హిట్‌గా నిలుస్తాయి. రుచికరమైన స్నాక్స్ లాగా కనిపించే స్వీట్లను అందించడం లేదా వంటలలో ఊహించని పదార్ధాలను జోడించడం మీ స్నేహితులను , కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరుస్తుంది. వినోదభరితంగా ఉంటుంది.

నకిలీ లాటరీ టిక్కెట్‌లు: భారీ డబ్బులు తగినట్లు నకిలీ లాటరీ టిక్కెట్‌లను అందజేయడం హాస్యాస్పదమైన చిలిపి పని. ఇది ఒక జోక్ అని గ్రహించిన తర్వాత అంత వరకూ ఉన్న వారిలో ఉత్సాహం గందరగోళంగా మారడాన్ని చూడటం అపురూపమైన ఫీలింగ్ గా నిలుస్తుంది.

నకిలీ కాల్‌లు లేదా సందేశాలు: ఫేక్ మెసేజ్‌లు పంపడం లేదా వేరొకరిలా నటిస్తూ ప్రాంక్ కాల్‌లు చేయడం వల్ల వ్యక్తులు సరదాగా నవ్వుకుంటారు. అయితే ఇవి వినోదభరితమైన పరస్పర చర్యలుగా మాత్రమే నిలవాలి.

వీధిలో చిలిపి పనులు: కొంతమంది వ్యక్తులు ఫేక్ సెలబ్రిటీలను చూసే విధంగా సెటప్ చేయడం లేదా ఫ్లాష్ మాబ్‌లను నిర్వహించడం వంటి చిలిపి చేష్టలతో కొందరు వీధుల్లోకి వస్తారు.

అయితే ఏప్రిల్ ఫూల్స్ డే ప్రాంక్‌లను ప్లాన్ చేస్తున్నప్పుడు చిలిపి పనులు హానిచేయనివిగా, ఆనందించేవిగా ఉండాలి. మీరు చేసే పనులు ఇబ్బంది కలిగించకుండా హర్ట్ చేయకుండా ఆనందించేలా ఉండాలని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఏప్రిల్ ఫూల్స్ డే  లక్ష్యం.. మనిషి తన రోజు వారీ జీవితాన్ని, ఇబ్బందులను పక్కకు పెట్టి ఒక్కరోజైనా నవ్వుని,  ఆనందాన్ని తన తోటివారికి పంచడమే అని గుర్తుపెట్టుకోండి. అందరికీ ముందుగా ఏప్రిల్ ఫూల్స్ డే 2014 శుభాకాంక్షలు!

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..