AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Drinks: ఇలా చేస్తే నిగనిగలాడే అందం మీ సొంతం.. ఈ 8రకాల డ్రింక్స్‌తో అమేజింగ్ అంతే

అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకోవడం చాలా సహజం. అయితే చర్మం మెరిసిపోతేనే మరింత అందంగా కనిపించేందుకు స్కోప్ ఉంటది.  కానీ బిజీ లైఫ్ వల్ల అందానికి మెరుగులు దిద్దే సమయమే ఉండదు. కానీ కొద్దిగా సమయం కేటాయిస్తే హీరోహీరోయిన్స్ మాదిరిగా మెరిసిపోవచ్చు. అందుకోసం కొన్ని డ్రింక్స్ తాగాల్సి ఉంటుంది. అయితే ఇంట్లోనే తయారుచేసుకోదగిన కొన్ని డ్రింక్స్ ఉన్నాయి.

Beauty Drinks: ఇలా చేస్తే నిగనిగలాడే అందం మీ సొంతం.. ఈ 8రకాల డ్రింక్స్‌తో అమేజింగ్ అంతే
Beauty Tips
Balu Jajala
|

Updated on: Mar 31, 2024 | 9:10 AM

Share

అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకోవడం చాలా సహజం. అయితే చర్మం మెరిసిపోతేనే మరింత అందంగా కనిపించేందుకు స్కోప్ ఉంటది.  కానీ బిజీ లైఫ్ వల్ల అందానికి మెరుగులు దిద్దే సమయమే ఉండదు. కానీ కొద్దిగా సమయం కేటాయిస్తే హీరోహీరోయిన్స్ మాదిరిగా మెరిసిపోవచ్చు. అందుకోసం కొన్ని డ్రింక్స్ తాగాల్సి ఉంటుంది. అయితే ఇంట్లోనే తయారుచేసుకోదగిన కొన్ని డ్రింక్స్ ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల బాడీలోని మలినాలను శుభ్రపరుస్తాయి. అంతకాదు.. వాటిని బయటకు పంపుతాయి. చర్మాన్ని సహజంగా మెరిసేలా చేస్తాయి. వీటిని తయారు చేయడం కూడా కష్టమైన పని కాదు.

గ్రీన్ టీ:

యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న గ్రీన్ టీ చర్మాన్ని అందంగా ఉంచడంలో ముందుంటుంది. ఇది యవ్వనంగా, మెరిసే చర్మాన్ని అందిస్తుంది. అందుకే ప్రతిరోజు ఒక కప్పు గ్రీన్ టీని వేడిగా ఆస్వాదించండి.

నిమ్మకాయ రసం:

తాజా నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని ప్రతిరోజు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.

దోసకాయ-పుదీనా రసం

దోసకాయ ముక్కలను తాజా పుదీనా ఆకులు నీటితో కలిపి తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దోసకాయ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇక చికాకును కూడా తగ్గిస్తుంది.

పసుపు పాలు

పసుపు పొడిని గోరువెచ్చని పాలు, తేనెతో కలిపి తీసుకొండి. పసుపు చర్మానికి మంచి నిగారింపు. ఇది మొటిమలు, తామర వంటి చర్మ సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది.

కొబ్బరినీళ్లు

ప్రతిరోజు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అందంగా మెరిసిపోవచ్చు. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి.

అలోవెరా జ్యూస్

తాజా అలోవెరా జెల్‌ను తీసి, నీరు లేదా రసంతో కలిపి తీసుకోవచ్చు. కలబంద చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహించే విటమిన్లు అనేక ఇందులో ఉన్నాయి.

క్యారెట్ జ్యూస్

క్యారెట్, అల్లం, నిమ్మరసం కలపండి. క్యారెట్‌లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఎగా మారుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

మంచినీరు

మంచినీరు శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. అంతేకాదు.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి క్రమతప్పకుండా నీళ్లు తాగాలి.