Loneliness: చుట్టు అందరున్నా ఒంటరిగా ఉన్నారని ఫీల్ అవుతున్నారా.. అయితే ఈ తప్పు అస్సలు చేయకండి
ఉరుకుల పరుగుల జీవితంలో తాము ఒంటరి అవుతున్నామనే ఫీలింగ్ చాలామందిలో ఉంటుంది. ఈ రోజుల్లో జనాలు నిత్యం బిజీగా ఉంటారు. హాయ్ అని కాసేపు పలుకరించలేని పరిస్థితులు. పని ఒత్తిడి, టార్గెట్స్ కారణంగా ఒంటరిగా భావించే వ్యక్తులు ఉన్నారు.

ఉరుకుల పరుగుల జీవితంలో తాము ఒంటరి అవుతున్నామనే ఫీలింగ్ చాలామందిలో ఉంటుంది. ఈ రోజుల్లో జనాలు నిత్యం బిజీగా ఉంటున్నారు. హాయ్ అని కాసేపు పలుకరించలేని పరిస్థితులు. పని ఒత్తిడి, టార్గెట్స్ కారణంగా ఒంటరిగా భావించే వ్యక్తులు ఉన్నారు. ముఖ్యంగా కార్పొరేట్ సెక్టార్‌లో పనిచేస్తున్న చాలామంది తాము ఒంటరి అని ఫీలింగ్ తో బాధపడుతున్నారు. ఒంటరితనంతో బాధపడేవారి జాబితాలో భారత్ రెండో స్థానంలో నిలిచిందని తాజా పరిశోధనలో తేలింది.
కార్పొరేట్ సెక్టార్‌లో పనిచేసేవాళ్లు పని విషయంలో చాలా ఒత్తిడికి గురవుతారు. ఎక్కువ గంటలు కార్యాలయంలో పని చేయడం వల్ల చాలాసార్లు తమ కుటుంబాలకు సమయం దొరకడం లేదు. ఈ ఒంటరితనం సమస్యతో బాధపడేవారి మానసిక ఆరోగ్యం క్రమంగా క్షీణించడం ప్రారంభమవుతుందని సర్వేలో తేలింది.
ఒంటరితనం భావన మనిషిని అనేక రకాలుగా బలహీనపరుస్తుంది. కెరీర్, భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఇంటి నుండి దూరంగా వెళ్లినప్పుడు ఒంటరి అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే కొద్ది మంది మాత్రమే తమ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వస్తారు. అటువంటి పరిస్థితిలో చాలా మంది ఆఫీసులో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ తోటి ఉద్యోగులు కూడా పని ఒత్తిడి కారణంగా టైం ఇవ్వలేని పరిస్థితులున్నాయి. దీంతో ఒంటరిగా మిగిలిపోయామనే ఫీలింగ్ ఏర్పడుతుంది.
ఒంటరితనానికి చెక్ పెడుదాం ఇలా
1. ఒంటరితనం కారణంగా మీ మనసులో ఏదైనా తప్పుడు ఆలోచన వచ్చినప్పుడు, ఈ సమయంలో మీరు మీ కుటుంబం గురించి ఆలోచించాలి. మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించే వ్యక్తుల గురించి కూడా ఆలోచించండి.
2. ఏదైనా సంబంధం, స్నేహం లేదా మరెవ్వరినైనా విశ్వసించడం ద్వారా మిమ్మల్ని మీరు బాధపెట్టుకోకుండా, మీ కెరీర్‌పై దృష్టి పెట్టండి.
3. ప్రతిరోజూ మీ కుటుంబ సభ్యులతో లేదా మీరు సంతోషంగా ఉన్న వ్యక్తితో మాట్లాడండి.
4. సోషల్ మీడియాలో స్నేహితులను చేసుకునే బదులు, వాస్తవానికి స్నేహితులను చేసుకోవడం మంచిది. అవసరమైనప్పుడు మీ కోసం నిలబడే వ్యక్తులను పరిచయం బాగా ఉండేలా చూసుకోండి.
5.మీలా ఆలోచించే వ్యక్తులతో ఉండేందుకు ప్రయత్నించండి



