AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Fall: ఈ రెండు టిప్స్‌తో అతి తక్కువ ఖర్చుతో జుట్టు రాలే సమస్య నుంచి బయటపడొచ్చు

జుట్టు రాలిపోతోందా? ఇప్పుడు సోషల్​ మీడియాలో రెండు చిట్కాలు వైరల్​ అవుతున్నాయి. రోజ్‌మేరీ వాటర్ vs బియ్యం నీళ్లు! ఒకటి మెడిటెరేనియన్ రాణుల రహస్యం, మరొకటి జపాన్ యుయావో బ్యూటీల మోకాళ్ల దాకా ఉండే జుట్టుకి సీక్రెట్. రెండూ ఇంట్లోనే రూ.10కే ..

Hair Fall: ఈ రెండు టిప్స్‌తో అతి తక్కువ ఖర్చుతో జుట్టు రాలే సమస్య నుంచి బయటపడొచ్చు
Hair Fall
Nikhil
|

Updated on: Nov 24, 2025 | 9:55 AM

Share

జుట్టు రాలిపోతోందా? ఇప్పుడు సోషల్​ మీడియాలో రెండు చిట్కాలు వైరల్​ అవుతున్నాయి. రోజ్‌మేరీ వాటర్ vs బియ్యం నీళ్లు! ఒకటి మెడిటెరేనియన్ రాణుల రహస్యం, మరొకటి జపాన్ యుయావో బ్యూటీల మోకాళ్ల దాకా ఉండే జుట్టుకి సీక్రెట్. రెండూ ఇంట్లోనే రూ.10కే తయారవుతాయి. ఇప్పుడు లక్షల మంది స్వయంగా ట్రై చేసి ‘జుట్టు రాలడం ఆగిపోయింది, కొత్త బేబీ హెయిర్ వచ్చింది’ అంటూ బిఫోర్-ఆఫ్టర్ ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. కానీ నిజంగా ఏది మన జుట్టుకి బెస్ట్ ఫ్రెండ్?

Rosemary Water

Rosemary Water

రోజ్‌మేరీ వాటర్..

ఈ చిన్న మూలికలో ఉండే కార్నోసిక్ ఆమ్లం స్కాల్ప్‌లో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఫలితంగా హెయిర్ ఫొలికల్స్‌కి ఎక్కువ ఆక్సిజన్, పోషకాలు అంది కొత్త జుట్టు పెరిగేందుకు దోహదపడుతుంది! 2015లోని ఒక రీసెర్చ్‌లో రోజ్‌మేరీ ఆయిల్‌ని ప్రసిద్ధ మినాక్సిడిల్‌తో పోల్చారు. ఆరు నెలల్లో రెండూ ఒకే విధంగా పనిచేశాయి. రోజ్‌మేరీకి దురద, ఇర్రిటేషన్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు! ఇంకా ఇది DHT హార్మోన్‌ని నియంత్రించి మగవాళ్లలో వచ్చే బట్టతలని కూడా ఆపుతుందని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి.

Rice Water

Rice Water

బియ్యం నీళ్లు

అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్​ ఇది. బియ్యం కడిగే నీళ్లలో జుట్టు పెరిగేందుకు దోహదపడే చాలా పోషకాలు దాగి ఉన్నాయి. స్టార్చ్, ఇనోసిటాల్, విటమిన్స్ B, C, E రైస్​ వాటర్​లో పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుని లోపలి నుంచి రిపేర్ చేసి, బ్రేకేజ్ తగ్గిస్తాయి, మెరుపుని రెట్టింపు చేస్తాయి. పులియబెట్టిన బియ్యం నీళ్ల pH 4-5గా ఉండి స్కాల్ప్‌కి పర్ఫెక్ట్ మ్యాచ్… డాండ్రఫ్, ఫంగస్‌ని దూరంగా పెట్టేస్తుంది. జపాన్‌లోని యుయావో మహిళలు 1,200 ఏళ్ల క్రితం నుంచి ఇదే వాడుతున్నారు.

సోషల్​ మీడియా పుణ్యమా అని ఇప్పుడు అందరూ ఇదే ఫాలో అవుతూ జుట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ రెండింటినీ వేర్వేరుగా వాడటం కంటే రెండూ కలిపి వాడితే మరింత ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. రోజ్​మేరీ వాటర్​ని వారంలో మూడుసార్లు, బియ్యం కడిగిన నీళ్లని రెండు రోజుల పాటు పులియబెట్టి వారానికి ఒకసారి స్ప్రే చేస్తే మూడు నెలల్లో మంచి ఫలితం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ట్రై చేసి మీ జుట్టుని ఒత్తుగా పెంచుకోండి!

NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే జారీ చేయబడినవి.. వీటిని మేం ధృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.

Follow Us