AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Vastu Tips: కారు డ్యాష్‌బోర్డ్‌పై దేవతల విగ్రహాలు పెడుతున్నారా..? అయితే, ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

మన భారతీయ సంప్రదాయంలో ఇంట్లో, ఆఫీసులో, వాహనాలలో దేవతల విగ్రహాలు, ఫోటోలను పెట్టుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా ఇంట్లోనే కాదు..చాలా మంది తమ కార్‌ డ్యాష్‌బోర్డ్‌పై గణేశుడు, హనుమంతుడు, శ్రీ కృష్ణుడు, శివలింగం, లక్ష్మీదేవి విగ్రహాలను ఉంచడం సర్వసాధారణం. ఈ ఆచారం వెనుక ప్రధాన కారణం ప్రయాణంలో భద్రత, శుభాన్ని కోరడం. కానీ డ్యాష్‌ బోర్డ్‌పై దేవత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆలోచిస్తున్న వారికి, కొన్ని ముఖ్యమైన నియమాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే మీరు కోరుకున్నది జరుగుతుందని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవేంటో తప్పక తెలుసుకోవాలి..

Car Vastu Tips: కారు డ్యాష్‌బోర్డ్‌పై దేవతల విగ్రహాలు పెడుతున్నారా..? అయితే, ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Car Dashboard Deities
Jyothi Gadda
|

Updated on: Nov 24, 2025 | 9:37 AM

Share

ఇది కేవలం డాష్‌బోర్డ్‌పై ఆసక్తి, అందం కోసం విగ్రహాన్ని ఉంచడం కాదు. ఇంట్లో ఏదైనా పవిత్ర చిహ్నాన్ని మీరు ఎలా గౌరవంగా, బుద్ధిపూర్వకంగా చేస్తారో అదే విధంగా అనుసరించాలని నిపుణులు చెబుతున్నారు. మీరు మీ వాహనంలో గణేశుడిని ఉంచుకోవాలని ప్లాన్ చేస్తుంటే, దానిని సరైన విధంగా ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఇందుకోసం సరైన విగ్రహాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.

ఇక్కడ ముందుగా మీరు మీ కారు డ్యాష్‌బోర్డుపై సరిగ్గా సరిపోయే విగ్రహాన్ని ఎంచుకోవాలి. అలాగే, కార్లు వేడెక్కుతాయి. కదులుతాయి కాబట్టి చిన్నవి, గట్టిగా ఉండేవి తీసుకోవాలి. లోహం, రాయి, కలప సాధారణంగా బాగా పట్టుకుంటాయి. చాలా సున్నితమైన లేదా పెద్ద విగ్రహాలు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పడిపోతాయి. విరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి కారణాల వల్ల డ్రైవింగ్‌ సమయంలో మీ దృష్టిని మరల్చేలా చేస్తుంది.

ప్లేస్‌మెంట్ కూడా అంతే ముఖ్యం. కార్ డ్యాష్‌బోర్డుపై పెట్టిన విగ్రహం మీకు ఎదురుగా రోడ్డు కనిపించకుండా చేయరాదు. చాలా మంది దానిని డాష్‌బోర్డ్ మధ్యలో ఉంచుతారు. కానీ, అది మీకు ఎదురుగా ఉన్నవి కనిపించకుండా అడ్డంకిగా మారుతుంది. అందుకే మీకు డ్రైవింగ్‌కు అనుకూలంగా ఉండేలా మీకు మీరే చూసుకుని సరిచేసుకోవాలి. అలాగే, మీరు పెట్టిన వినాయకుడి విగ్రహం సరిగ్గా సెట్‌ అయిపోయి కూర్చునేలా అతికించండి.

ఇవి కూడా చదవండి

అలాగే, మరికొన్ని విషయాలను తప్పక గుర్తించుకోవాలి. ఇంట్లో దేవుళ్ల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని మీరు ఎలా శుభ్రం చేస్తారో ..డాష్‌బోర్డ్‌ను కూడా క్లీన్‌గా తుడుచుకుంటూ ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అంతేగానీ, మీరు గణేశుడికి ధూపం, దీపాలు వెలిగించి పూజలు చేసినట్టుగా, కారు లోపల ఇలాంటివి చేయటం సురక్షితం కాదు. అంతేకాదు.. మరో ముఖ్యమైన నియమం ఏంటంటే.. కారులో ధూమపానం, మద్యపానం చేయకూడదు. మాంసాహారం తినకూడదు.

అంతేకాదు.. ఎయిర్‌బ్యాగ్ దగ్గర ఇలాంటి విగ్రహాలు ఉంచవద్దు. ఎయిర్‌బ్యాగ్ తెరుచుకుంటే అది చిన్న విగ్రహం అయినా కూడా బలంగా ఎగిరినప్పుడు గట్టిగానే దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. అలాగే, డ్యాష్‌బోర్డు నిండా విగ్రహాలు, పూలు, స్టిక్కర్లు, డెకరేషన్లతో నింపేయకండి. అదంతా గజిబిజిగా కనిపిస్తుంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అది మీ దృష్టి మరల్చుతుంది. అలాగే, దెబ్బతిన్న విగ్రహాలను వెంటనే తీసేయాలి. వాటిని ఎక్కడైనా నీటిలో వదిలిపెట్టాలి. లేదంటే, మనుషులేవరూ తొక్కకుండా ఉండే ప్రదేశంలో పారవేయాలి.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..