AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rose Water: పొడవైన జుట్టు సీక్రెట్.. రోజ్ వాటర్ ఇలా రాస్తే ఒక్క వెంట్రుక కూడా రాలదు..! జుట్టు పెరుగుతూనే ఉంటుంది..

ఇప్పటి వరకు మీరు రోజ్ వాటర్‌ని చర్మ సౌందర్యం కోసం మాత్రమే వాడి ఉంటారు. కానీ.. రోజ్‌ వాటర్‌ని కేశ సౌందర్యం కోసం వాడుకోవచ్చునని మీకు తెలుసా..? రోజ్ వాటర్ లో కొన్ని పదార్థాలను కలిపి రాస్తే కచ్చితంగా జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజ్ వాటర్ వాడితే జుట్టు రాలడం సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుందని చెబుతున్నారు. అయితే, జుట్టు సంరక్షణ కోసం రోజ్ వాటర్‌ని ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం...

Rose Water: పొడవైన జుట్టు సీక్రెట్.. రోజ్ వాటర్ ఇలా రాస్తే ఒక్క వెంట్రుక కూడా రాలదు..! జుట్టు పెరుగుతూనే ఉంటుంది..
Rose WaterImage Credit source: pexel
Jyothi Gadda
|

Updated on: May 14, 2025 | 8:20 PM

Share

రోజ్ వాటర్‌లో విటమిన్ ఎ, బి3, సి , విటమిన్ ఇ వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. జుట్టుకు రోజ్ వాటర్‌ అప్లై చేయటం వల్ల సహజ మెరుపును అందిస్తుంది. వెంట్రుకలను మృదువుగా చేస్తుంది. జుట్టు రాలడాన్ని అరికట్టి, జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. రోజ్‌ వాటర్‌ కుదుళ్ల ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని టైట్‌గా మారుస్తుంది. అధిక నూనెను గ్రహించేస్తుంది. అంతేకాదు రోజ్‌ వాటర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది కుదుళ్ల దురదను తగ్గించేస్తుంది. చుండ్రుతో చికాకు కూడా ఉండదు. రోజ్‌ వాటర్‌ జుట్టుకు ఉపయోగించడం వల్ల సోరియాసిస్‌, ఎగ్జీమా వంటి సమస్య కూడా తగ్గుతుంది. జుట్టు రాలే సమస్యను కూడా రోజ్‌ వాటర్‌ తగ్గిస్తుంది. ఇందులో కుదుళ్ల ఆరోగ్యానికి తోడ్పడే గుణాలు ఉంటాయి.

రోజ్‌ వాటర్‌ని తలకు అప్లై చేయటం వల్ల ఇది తల చర్మాన్ని శుభ్రపరిస్తుంది. జుట్టుకు తగిన తేమను అందిస్తుంది. ఇందుకోసం తలచర్మానికి రోజ్‌వాటర్‌ నేరుగా అప్లై చేయవచ్చు అంటున్నారు నిపుణులు. తలంతటికీ రోజ్ వాటర్‌ అప్లై చేసిన తరువాత రెండు, మూడు నిమిషాల పాటు నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా చేయటం వల్ల తలలో రక్త ప్రసరణను మెరుగుపరచి జుట్టు వృద్ధిని ప్రోత్సహిస్తుంది. తలను కిందికి వంచి రోజ్ వాటర్‌తో తలచర్మాన్ని మృదువుగా మసాజ్ చేయాలి. ఇలా చేయటం వల్ల రక్తప్రసరణను వేగంగా పెంచుతుంది.

ఇందుకోసం మీ తలకు సరిపడా రోజ్ వాటర్‌, ఆలివ్ ఆయిల్ లేదంటే కొబ్బరినూనె కలిపి హెయిర్ మాస్క్‌గా అప్లై చేసుకోవాలి. స్మూత్‌గా మాసాజ్‌ చేసుకుని 30 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఆ తరువాత తేలిక పాటి షాంపూతో తలస్నానం చేసుకోవాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే మీ జుట్టు మృదువుగా మెరిసేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి