AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Roti with Ghee: చపాతీపై నెయ్యి వేసుకుని తింటే ఎన్ని లాభాలో తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు..

చాలా మందికి బ్రేక్‌ఫాస్ట్‌లో చపాతీలు తినే అలవాటు ఉంటుంది. కొందరు గోధుమ పిండితో చేసిన పుల్కాలు వాడుతుంటారు. మరికొందరు నూనె, నెయ్యి వాడుతూ చపాతీలు తయారు చేసుకుంటారు. నెయ్యిలో విటమిన్లు ఎ, డి, ఇ, కె, బి, కాల్షియం, భాస్వరం, ప్రోటీన్, ఫైబర్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. చపాతీ, నెయ్యి రెండూ సమృద్ధికరమైన పోషకాలతో నిండి ఉంటాయి. వీటిని కలిపి తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...

Jyothi Gadda
|

Updated on: May 14, 2025 | 5:47 PM

Share
చపాతీని నెయ్యితో కలిపి తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను నయం చేస్తుంది. నెయ్యితో రోటీ కలిపి తినడం వల్ల శరీరానికి ఎక్కువ కాలం శక్తి లభిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది.

1 / 5
ఇందులోని ఫ్యాటీ యాసిడ్స్‌ తక్షణ శక్తి కూడా అందిస్తుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. ఇది కడుపులో మంట వాపు సమస్యను తగ్గిస్తుంది. మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. నెయ్యి రొట్టె తింటే హార్మోన్‌ అసమతుల్యతను తగ్గిస్తుంది.

2 / 5
ఇది జాయింట్‌ పెయిన్స్‌ సమస్యను కూడా తగ్గిస్తుంది. ఇది ఫ్రీ ర్యాడికల్‌ సమస్యను సమం చేస్తుంది. ఇమ్యూనిటీ బూస్ట్‌ చేస్తుంది. మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో రొట్టెలు నెయ్యితో తింటే రోజంతా ఆకలి ఉండదు. దీంతో బరువు నియంత్రణలో ఉంటుంది. దీంతో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది.

3 / 5
నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్ అనేది శోషరస వ్యవస్థను ప్రేరేపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల రోగనిరోధక పనితీరు మెరుగుపరడంతో పాటు వ్యాధికారకాల నుంచి రక్షణ కల్పిస్తుందని వివరిస్తున్నారు. ఆయుర్వేద ప్రకారం పేగుల్లోని జీర్ణ ఎంజైమ్​లను నెయ్యి ప్రేరేపిస్తుందట. నెయ్యిలో ఉండే కొవ్వు ఆమ్లాల వల్ల జీర్ణశయ ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
అయితే, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కూడా నెయ్యిని అతిగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా సరే మితంగా తిన్నప్పుడు మాత్రమే దాని ఫలితాలను పొందేందుకు వీలుగా ఉంటుంది. అందుకే ఒక రోటిపై ఓ చిన్న టీ స్పూన్ నెయ్యి రాసుకుని తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

5 / 5