- Telugu News Photo Gallery Cinema photos Tollywood movies like Vishwambhara, Hari Hara Veera Mallu, Mass Jathara release date details
డైలమాలో రూ.800 కోట్లు.. నిర్మాతల కంగారు..
రిలీజ్ డేట్స్ ఎక్కడ..? సినిమాలు అనౌన్స్ చేయడం.. షూటింగ్ చేయడం కాదు.. ముందు రిలీజ్ డేట్స్ చెప్పండి అంటున్నారు అభిమానులు. తెలుగులో ఒకటి రెండు కాదు.. తాజాగా అరడజన్‌కు పైగా క్రేజీ సినిమాల రిలీజ్ డేట్స్ డైలమాలోనే ఉన్నాయి. దాదాపు 800 కోట్ల బిజినెస్ రేంజ్ సినిమాలకు డేట్స్ కన్ఫర్మ్ కావట్లేదు. మరి ఆ సంగతేంటో చూద్దామా..?
Updated on: May 14, 2025 | 5:45 PM

సినిమాకు రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అవ్వకపోతే నిర్మాతలకు నిద్రపట్టడం కష్టమే. అందులోనూ వందల కోట్ల సినిమాలకు విడుదల తేదీ సమస్య వస్తే.. అంతకంటే కంగారు ఉంటుందా చెప్పండి..? టాలీవుడ్‌లో కొందరు నిర్మాతల పరిస్థితి ఇదే.

చిరంజీవి విశ్వంభరకు ఇంకా డేట్ లాక్ అవ్వలేదు. జులై 24 అంటున్నా.. అధికారిక ప్రకటన రాలేదు.. దీని బిజినెస్ రేంజ్ 200 కోట్లకు పైనే ఉంది.చిరంజీవి సినిమాకే కాదు.. పవన్ కళ్యాణ్ సినిమాను రిలీజ్ డేట్ కంగారు పెడుతుంది.

ఐదేళ్ళ లాంగ్ జర్నీ తర్వాత ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకుంది హరిహర వీరమల్లు. ఇది మే 30న వస్తుందంటున్నారు గానీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే లేదు.. మరికొందరేమో జూన్ 12న విడుదలవుతుంది అంటున్నారు. ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లకు పైనే ఉంటుంది.

అనుష్క శెట్టి, క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఘాటీ సినిమా రిలీజ్ డేట్ కూడా ఇంకా లాక్ అవ్వలేదు. ఏప్రిల్ 18నే విడుదల చేస్తామని చెప్పారు.. కానీ ఆ డేట్ పోయి నెల రోజులవుతున్నా ఇంకా సైలెంట్‌గానే ఉన్నారు మేకర్స్. మరోవైపు తేజ సజ్జా మిరాయ్ సైతం రిలీజ్ డేట్ టెన్షన్స్‌లోనై ఉంది. ఆగస్ట్ 1న విడుదల అన్నారు గానీ వచ్చేవరకు అనుమానమే.

రవితేజ మాస్ జాతర కూడా ఇంకా రిలీజ్ డేట్ లాక్ చేసుకోలేదు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ నుంచి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా ఇది రవితేజకు 75వ సినిమా. అలాగే ప్రభాస్ రాజా సాబ్ డేట్‌పై ఏ క్లారిటీ రాలేదు. అసలు 2025లో వస్తుందా రాదా అనే కంగారు కూడా అభిమానుల్లో ఉంది. ఈ క్రేజీ సినిమాలన్నింటి బిజినెస్ 800 కోట్లకు పైమాటే.




