Rice bran – sunflower: రైస్ బ్రాన్-సన్ ఫ్లవర్ ఈ రెండిటిలో ఏ నూనె ఆరోగ్యానికి మంచిది..

ఏ వంట చేయాలన్నా.. నూనె అనేది ఖచ్చితంగా ఉండాలి. నూనె లేకుండా ఏ వంట కూడా పూర్తి చేయలేం. నూనెతోనే వంటలకు మరింత రుచి వస్తుంది. అయితే ఏ నూనెలు వాడితే ఆరోగ్యానికి మంచిదో అన్న డౌట్ అందరిలోనూ ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా మంది ఎక్కువగా రైస్ బ్రాన్, సన్ ఫ్లవర్ ఆయిల్‌ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మార్కెట్లో కూడా ఇవే ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయి. వీటితోనే ఎక్కువగా వంటలు..

Rice bran - sunflower: రైస్ బ్రాన్-సన్ ఫ్లవర్ ఈ రెండిటిలో ఏ నూనె ఆరోగ్యానికి మంచిది..
Rice Bran Sunflower Oil
Follow us

|

Updated on: Aug 24, 2024 | 5:55 PM

ఏ వంట చేయాలన్నా.. నూనె అనేది ఖచ్చితంగా ఉండాలి. నూనె లేకుండా ఏ వంట కూడా పూర్తి చేయలేం. నూనెతోనే వంటలకు మరింత రుచి వస్తుంది. అయితే ఏ నూనెలు వాడితే ఆరోగ్యానికి మంచిదో అన్న డౌట్ అందరిలోనూ ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా మంది ఎక్కువగా రైస్ బ్రాన్, సన్ ఫ్లవర్ ఆయిల్‌ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మార్కెట్లో కూడా ఇవే ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయి. వీటితోనే ఎక్కువగా వంటలు తయారు చేస్తున్నారు. మరి వీటిల్లో ఏ ఆయిల్ ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి మంచిది? అనే సందేహంలో పడుతున్నారు. మరి వీటిల్లో ఏ ఆయిల్ హెల్త్‌కి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

రైస్ బ్రాన్ ఆయిల్:

రైస్ బ్రాన్ ఆయిల్ అనేది ఒక వెజిటేబుల్ నూనె. ఈ నూనెను బియ్యం ఔటర్ లేయర్‌తో తయారు చేస్తారు. ఈ ఆయిల్ ఫ్లేవర్ కూడా సాధారణంగానే ఉంటుంది. ఈ ఆయిల్‌తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, శాచ్యురేటెడ్, మోనోశాచ్యురేటెడ్, పాలీ అన్ శాచ్యురేటెడ్ వంటి హెల్దీ కొవ్వులు కూడా పుష్కలంగా లభ్యమవుతాయి. ఈ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదే.

సన్ ఫ్లవర్ ఆయిల్:

ప్రస్తుత కాలంలో చాలా మంది ఎక్కువగా ఉపయోగించే ఆయిల్‌లో సన్ ఫ్లవర్ ఆయిల్ కూడా ఒకటి. ఇది సన్ ఫ్లవర్ గింజలతో తయారు చేస్తారు. ఈ నూనెతో‌ ఎన్నో రకాల వంటలు తయారు చేస్తున్నారు. ఇందులో విటమిన్ ఇ, మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, శరీర ఆరోగ్యానికి చాలా మంచిది.

ఇవి కూడా చదవండి

ఈ రెండింటిలో ఏది మంచిది?

రైస్ బ్రాన్, సన్ ఫ్లవర్ ఆయిల్‌ రెండూ ఆరోగ్యానికి మంచిదే. ఈ రెండు నూనెల్లో మోనోశాచ్యురేటెడ్ లభ్యమవుతాయి. కానీ సన్ ఫ్లవర్ ఆయిల్‌లో మోనోశాచ్యురేటెడ్ లెవల్స్ ఇంకొంచెం ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇది గుండెకు చాలా మంచిది. అంతే కాదు ఫ్యాటీ యాసిడ్స్ కూడా సన్ ఫ్లవర్ ఆయిల్‌లో ఎక్కువగా ఉంటాయి. అలాగే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా రెండింటిలో ఉంటాయి. అదే విధంగా శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కానీ రైస్ బ్రాన్ ఆయిల్ ప్రతి రోజూ ఎక్కువగా తీసుకుంటే గుండె సమస్యలకు దారి తీయవచ్చు. అర్థరైటిస్ కూడా రావచ్చు. సన్ ఫ్లవర్ ఆయిల్‌ ఆరోగ్యానికి చాలా మంచిదే కానీ.. మరీ ఎక్కువగా ఉపయోగించకూడదని నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పైకేమో అదొక సూపర్ మార్కెట్ వెహికిల్.. తీరా లోపల చెక్ చేయగా
పైకేమో అదొక సూపర్ మార్కెట్ వెహికిల్.. తీరా లోపల చెక్ చేయగా
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ బ్రన్యాస్‌ కన్నుమూత.
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ బ్రన్యాస్‌ కన్నుమూత.
కొందరు ఉద్యోగుల కళ్లలో నీళ్లు.. స్పృహ తప్పి పడిపోయిన మరికొందరు.!
కొందరు ఉద్యోగుల కళ్లలో నీళ్లు.. స్పృహ తప్పి పడిపోయిన మరికొందరు.!
ఆఫీసుకెళ్లేందుకు ఏకంగా ప్రైవేట్ జెట్ ఫ్లైట్ కేటాయించిన కంపెనీ.!
ఆఫీసుకెళ్లేందుకు ఏకంగా ప్రైవేట్ జెట్ ఫ్లైట్ కేటాయించిన కంపెనీ.!
బీడీ ముట్టించుకొని అగ్గిపుల్ల కిందపడేశాడు.. క్షణాల్లో ఊహించని
బీడీ ముట్టించుకొని అగ్గిపుల్ల కిందపడేశాడు.. క్షణాల్లో ఊహించని
అక్కా అర్జెంట్ కాల్ చేస్కోవాలి అంటే ఫోన్ ఇచ్చింది.. కట్ చేస్తే.!
అక్కా అర్జెంట్ కాల్ చేస్కోవాలి అంటే ఫోన్ ఇచ్చింది.. కట్ చేస్తే.!
రెచ్చిపోయిన కారు డ్రైవర్‌.. రివర్స్‌ చేసి మరీ దూసుకుపోతూ.. వీడియో
రెచ్చిపోయిన కారు డ్రైవర్‌.. రివర్స్‌ చేసి మరీ దూసుకుపోతూ.. వీడియో
కోల్‌క‌తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌.. వెలుగులోకి మ‌రో సంచ‌ల‌నం
కోల్‌క‌తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌.. వెలుగులోకి మ‌రో సంచ‌ల‌నం
ఏపీ, తెలంగాణలో భారత్ బంద్‌ ఎఫెక్ట్.!
ఏపీ, తెలంగాణలో భారత్ బంద్‌ ఎఫెక్ట్.!
బొమ్మ అనుకొని పామును కొరికిన పసివాడు.. ఆ తర్వాత.! వీడియో వైరల్..
బొమ్మ అనుకొని పామును కొరికిన పసివాడు.. ఆ తర్వాత.! వీడియో వైరల్..