AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prostate Cancer: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రొస్టెట్‌ క్యాన్సర్.. ఈ వ్యాధి ఎందుకు వస్తుందో తెలుసా?

క్యాన్సర్‌లలో అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకటి. ముఖ్యంగా పురుషుల్లో ప్రాణాంతకమైనది ఈ ప్రోస్టేట్ క్యాన్సర్. ఈ క్యాన్సర్ 50 ఏళ్లు పైబడిన వారిలో అధికంగా వస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు తాజాగా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. పురుషులలో మూత్రాశయం క్రింద ఉన్న ప్రోస్టేట్ గ్రంథిలో సంభవించే ప్రాణాంతక వ్యాధి..

Prostate Cancer: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రొస్టెట్‌ క్యాన్సర్.. ఈ వ్యాధి ఎందుకు వస్తుందో తెలుసా?
Prostate Cancer
Srilakshmi C
|

Updated on: May 20, 2025 | 12:57 PM

Share

క్యాన్సర్ అనే పేరు వింటేనే చాలా మంది హడలెత్తిపోతారు. ఈ ప్రాణాంతక వ్యాధి ఒక్కసారి సోకితే ఎవరినీ అంత త్వరగా వదిలిపెట్టదు. క్యాన్సర్‌లలో అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకటి. ముఖ్యంగా పురుషుల్లో ప్రాణాంతకమైనది ఈ ప్రోస్టేట్ క్యాన్సర్. ఈ క్యాన్సర్ 50 ఏళ్లు పైబడిన వారిలో అధికంగా వస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు తాజాగా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. పురుషులలో మూత్రాశయం క్రింద ఉన్న ప్రోస్టేట్ గ్రంథిలో సంభవించే ప్రాణాంతక వ్యాధి.. ఈ ప్రోస్టేట్ క్యాన్సర్. అసలు ఇది ఎందుకు వస్తుందో నిపుణుల మాటల్లో మీ కోసం..

ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏమిటి?

పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ అత్యంత సాధారణ క్యాన్సర్. ప్రోస్టేట్ క్యాన్సర్ మూత్రాశయం క్రింద ఉన్న పురుష పునరుత్పత్తి గ్రంథి అయిన ప్రోస్టేట్ గ్రంథిలో సంభవిస్తుంది. ఈ గ్రంథిలో కణాల అసాధారణ పెరుగుదల కారణంగా ప్రోస్టేట్ క్యాన్సర్‌ దారితీస్తుంది. ప్రారంభ దశలో దాని లక్షణాలను గుర్తించడం కష్టం. కానీ సకాలంలో గుర్తిస్తే సరైన చికిత్సతో వ్యాధిని నయం చేయవచ్చు.

ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు..

  • మూత్ర విసర్జన సమయంలో అసౌకర్యం
  • మూత్ర విసర్జన తర్వాత మూత్రాశయం ఖాళీగా లేనట్లు అనిపించడం
  • రాత్రిపూట తరచుగా మేల్కొనడం
  • మూత్రంలో రక్తస్రావం
  • కటి లేదా జననేంద్రియాలలో తీవ్రమైన నొప్పి
  • వీర్యంలో రక్తం
  • వెన్నెముకలో విపరీతమైన నొప్పి
  • అలసట, బలహీనంగా అనిపించడం
  • బరువు తగ్గడం

ప్రోస్టేట్ క్యాన్సర్‌కు చికిత్స ఎలా చేస్తారు?

ప్రోస్టేట్ క్యాన్సర్‌కు ప్రారంభ దశలోనే సరైన చికిత్స తీసుకుంటే నయం చేయవచ్చు. PSA రక్త పరీక్ష, డిజిటల్ రెక్టల్ పరీక్షతో సహా ఇతర పరీక్షల ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. ఈ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిన వ్యక్తికి వైద్యులు రేడియోథెరపీ, సర్జరీ, ఆండ్రోజెన్ డిప్రెవియేషన్ థెరపీతో సహా అనేక రకాల చికిత్సా పద్ధతుల ద్వారా ట్రీట్‌మెంట్‌ ఇస్తారు.

ఇవి కూడా చదవండి

ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ఎలా నివారించాలి?

  • ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం చాలా ముఖ్యం.
  • శరీర రక్తంలో అసమతుల్యతకు కారణమయ్యే ఆహారాలు, కెఫిన్ ఉన్న ఆహారాలను వీలైనంత వరకు తీసుకోవడం మానుకోవాలి.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బాదం, వాల్‌నట్స్, పండ్లు, కూరగాయలు తినడం మంచిది.
  • విటమిన్ డి లోపాన్ని నివారిస్తుంది.
  • ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడంపై దృష్టి పెట్టండం.
  • మద్యం సేవించడం పూర్తిగా మానుకోవడం.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.

శీతాకాలంలో ప్రెగ్నెంట్ మహిళలకు సైంటిస్టుల హెచ్చరిక..!
శీతాకాలంలో ప్రెగ్నెంట్ మహిళలకు సైంటిస్టుల హెచ్చరిక..!
పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్