Mosquito Repelling Plants: దోమల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ మొక్కలతో చెక్ పెట్టవచ్చు అని తెలుసా..
ఏ సీజన్‌లో నైనా దోమల బెడద తప్పని సరి. ఈ దోమలు డెంగ్యూతో సహా ఇతర వ్యాధులను త్వరగా వ్యాపింపజేస్తాయి. దీంతో ఈ దోమల నుంచి రక్షించుకోవడానికి ఇంటి కిటికీలకు మేస్ లు వేసుకుంటారు. ఇంట్లో సాయత్రం అయితే చాలు గుడ్ నైట్ వంటి వాటిని ఉపయోగిస్తారు. అయితే దోమలు ఇంట్లో అడుగు పెట్టకుండా కొన్ని రకాల మొక్కలు పెంచుకోవచ్చు అని తెలుసా.. మీ ఇంటి చుట్టూ ఈ మొక్కలను నాటడం ద్వారా సహజంగా దోమలను వదిలించుకోవచ్చు.

వర్షాకాలంలోనే కాదు..ప్రతి సీజన్‌లోనూ దోమల బెడద ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం వేళల అయితే చాలు దోమలు ఇళ్లలోకి ప్రవేశిస్తాయి. అవికుడితే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులబారిన పడాల్సి ఉంటుంది. ఇంట్లోకి వచ్చే ఈ దోమలను నియంత్రించడానికి కొంతమంది కాయిల్స్ , స్ప్రేలను కూడా ఉపయోగిస్తారు. అయితే ఈ రసాయనాలతో నిండిన ఉత్పత్తులు మన ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. కనుక ఇంట్లో కొన్ని రకాల మొక్కలను పెంచుకోవడం వలన దోమల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది . ఆ మొక్కలు ఏమిటో తెలుసుకుందాం..
దోమలను వదిలించుకోవడానికి ఇంట్లో ఏ మొక్కలు పెంచాలంటే
తులసి మొక్క: మీ ఇంటి చుట్టూ తులసి మొక్కలను పెంచుకోవడం వలన దోమల బెడద నుండి బయటపడవచ్చు. తులసి మొక్కకు ఆధ్యాత్మిక పరంగా ప్రాముఖ్యత కలిగినా దీనిలో అనేక ఔషధ గుణాలున్నాయి. తులసి మొక్క ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అంతే కాదు తులసి మొక్క స్వచ్ఛమైన గాలిని కూడా ఇస్తుంది. దోమల ప్రమాదాల నుంచి కూడా మనల్ని రక్షిస్తాయి.
బంతి పువ్వుల మొక్కలు: బంతి పువ్వుల మొక్కలు , పువ్వులు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని ఇంట్లో పెంచుకోవడం వలన ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా, దోమల బెడదను కూడా నియంత్రిస్తుంది. అవును దోమలు బంతి పువ్వుల వాసనను ఇష్టపడవు . టికి దూరంగా ఉండాలని కోరుకుంటాయి. అందువల్ల ఈ మొక్కలను మీ ఇంటి దగ్గర పెంచుకోవడం వల్ల దోమలను సులభంగా వదిలించుకోవచ్చు.
రోజ్మేరీ మొక్క: రోజ్మేరీ మొక్కలను సహజ దోమల నివారిణిగా పరిగణిస్తారు. దోమలు వీటి ఘాటు వాసనను ఇష్టపడవు. కనుక ఈ మొక్కలను ఇంటి చుట్టూ పెంచుకోవడం వలన మీరు దోమల బెడద నుండి సులభంగా బయటపడవచ్చు.
నిమ్మ గడ్డి: దోమలను తరిమికొట్టడంలో నిమ్మ గడ్డి కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అవును, దోమలకు ఈ మొక్క వాసన నచ్చదు. దాని వాసన దోమలను చికాకుపెడుతుంది. కనుక ఈ మొక్కను మీ ఇంటి ముందు లేదా మీ బాల్కనీలో పెంచుకుంటే మీరు దోమల ముప్పును తగ్గించవచ్చు.
పుదీనా మొక్క: పుదీనా ఆకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. అదేవిధంగా ఈ పుదీనా మొక్కలను ఇంట్లో పెంచుకుంటే దోమల బెడద నుంచి కూడా బయటపడవచ్చు. ఈ మొక్క సువాసన దోమలు, కీటకాలు , సాలెపురుగులను దూరంగా ఉంచుతుంది. మీకు కావాలంటే ఇంట్లో పుదీనా నూనెను కూడా స్ప్రే చేసుకోవచ్చు.
లావెండర్ మొక్క: లావెండర్ ముఖ్యమైన నూనె మానసిక ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. అదేవిధంగా లావెండర్ మొక్క సువాసన కూడా దోమలను తరిమికొట్టడంలో సహాయపడుతుంది. మీ ఇంటి ప్రాంగణంలో, బాల్కనీలో లేదా కిటికీ దగ్గర లావెండర్ మొక్కను ఉంచడం ద్వారా దోమలు మీ ఇంట్లోకి రాకుండా నిరోధించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








