AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Constipation: మలబద్దకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఆయుర్వేదంలో బెస్ట్ మెడిసిన్ ఉందని తెలుసా..

ప్రస్తుతం చాలా మంది మలబద్ధకంతో బాధపడుతున్నారు. చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా మలబద్ధకం ప్రజలను ఇబ్బంది పెడుతుంది. ఒకసారి మలబద్ధకం బారిన పడితే అది ఎక్కువ కాలం తగ్గదు. మలబద్ధకం విషయంలో.. కొన్ని ఆయుర్వేద మందులను తీసుకోవచ్చు. వీటిని ఉపయోగించడం వలన మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

Constipation: మలబద్దకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఆయుర్వేదంలో బెస్ట్ మెడిసిన్ ఉందని తెలుసా..
Constipation
Surya Kala
|

Updated on: May 19, 2025 | 7:31 PM

Share

ప్రస్తుతం ఎక్కువ మంది ప్రజలు చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా మలబద్ధకంతో బాధపడుతున్నారు. కడుపు శుభ్రం కాకపోతే రోజంతా నీరసం, సోమరితనం, చిరాకు ఉంటాయి. మలబద్ధకం వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. దీనితో మలబద్దకంతో బాధపడేవారు తరచుగా వైద్య చికిత్స తీసుకుంటున్నారు. మందు తీసుకున్న సమయంలో ఈ సమస్య కొంతవరకు తగ్గుతుంది. మందులు ఆపివేసినప్పుడు మళ్ళీ మొదలవుతుంది. అయితే ఈ మలబద్ధకం సమస్యకు బెస్ట్ సొల్యుషన్ ఆయుర్వేదం అని నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా మలబద్దకంతో బాధపడుతుంటే ఈ ఆయుర్వేద మందులు తీసుకోవచ్చు.

మలబద్ధకం ఒక తీవ్రమైన సమస్య. అయితే ఎక్కువ మందికి ఈ సమస్య తప్పుడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా వస్తుంది. ఆలస్యంగా నిద్రపోవడం, ఆలస్యంగా మేల్కొనడం ఈ సమస్యకు మూల కారణం. మలబద్ధకంలో అనేక రకాలు ఉన్నాయి. సాధారణంగా మనకు దానిలో ఒక రకం మాత్రమే తెలుసు. టాయిలెట్ నుంచి వచ్చిన తర్వాత కూడా కడుపు శుభ్రంగా లేదు. ఒకటి కంటే ఎక్కువసార్లు ఫ్రెష్ అప్ అవ్వాల్సి ఉన్నా… టాయిలెట్‌లో ఎక్కువ సమయం గడపడం కూడా మలబద్ధకానికి సంకేతం. ఇలాంటి ఆరోగ్య సమస్యకు చక్కటి పరిష్కరం ఆయుర్వేద మేదిసిన్స్. అవి మలబద్దకం సమస్యకు చక్కటి ఉపశమనం కలిగిస్తాయి.

ఆయుర్వేద వైద్యం

ఎలాంటి మలబద్ధకం నుంచి అయినా ఉపశమనం పొందడానికైనా ఆయుర్వేద మందులను తీసుకోవచ్చు. వీటిలో త్రిఫల, ఇసబ్‌గోల్, అలోవెరా జ్యూస్, అభయారిష్ట కూడా ఉన్నాయి. త్రిఫల చూర్ణంని ఉసిరి, కరక్కాయ, తానికాయల వంటి మూలికల మిశ్రమం. ఇసబ్‌గోల్ ఒక సహజ ఫైబర్ మూలం. ఇది జీర్ణ ప్రక్రియ సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది. కలబంద రసంలో ఫైబర్, ఎంజైములు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అభయారిష్ట దీర్ఘకాలిక మలబద్ధకం చికిత్సకు ఉపయోగిస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ మందు ఎలా తీసుకోవాలి

రాత్రి సమయంలో ఒక చెంచా త్రిఫల పొడిని గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. ఇసాబ్‌గోల్‌ను రాత్రిపూట గోరువెచ్చని నీరు లేదా పాలతో కలిపి ఒకటి లేదా అర టీస్పూన్ కూడా తీసుకోవచ్చు. ఉదయం పరగడుపున కలబంద రసం తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. అభ్యరిష్టను డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి. దీనితో పాటు, క్యారెట్, బీట్‌రూట్, సొరకాయ, దానిమ్మ , ఆపిల్ మిశ్రమ రసం తాగడం వల్ల కూడా మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. దీన్ని రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు, అయితే ఉదయం తీసుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)