AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డాక్టర్లు తెల్ల కోటు.. లాయర్లు నల్ల కోటు ఎందుకు ధరిస్తారో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే..

స్కూళ్లలో విద్యార్థులు ఒకే రకమైన యూనిఫాం ధరించడం మీరు చూసే ఉంటారు. అదేవిధంగా ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులందరూ తెల్లకోటు ధరించడం, న్యాయవాదులు నల్లకోటు ధరించడం మీరు చూసే ఉంటారు. లాయర్లు, జడ్జిలు ఎల్లప్పుడూ నల్ల కోట్లు మాత్రమే ఎందుకు ధరిస్తారు? డాక్టర్లు తెల్లటి కోట్లు ఎందుకు ధరిస్తారో? మీరు ఎప్పుడైనా ఆలోచించారా..

డాక్టర్లు తెల్ల కోటు.. లాయర్లు నల్ల కోటు ఎందుకు ధరిస్తారో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే..
Doctors And Lawyers
Srilakshmi C
|

Updated on: May 21, 2025 | 5:54 AM

Share

సాధారణంగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు ఒకే రకమైన యూనిఫాం ధరించడం మీరు చూసే ఉంటారు. అదేవిధంగా ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులందరూ తెల్లకోటు ధరించడం, న్యాయవాదులు నల్లకోటు ధరించడం మీరు చూసే ఉంటారు. లాయర్లు, జడ్జిలు ఎల్లప్పుడూ నల్ల కోట్లు మాత్రమే ఎందుకు ధరిస్తారు? డాక్టర్లు తెల్లటి కోట్లు ఎందుకు ధరిస్తారో? మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. దీని వెనుక ఏవైనా కారణాలు ఉన్నాయా? ఈ రెండు వృత్తులకు ఈ ప్రత్యేకమైన కోటు రంగును ఎందుకు కేటాయించారు. ఎందుకు వైద్యులు, న్యాయవాదులు నిర్దిష్ట రంగు కోట్లు ఎందుకు ధరిస్తారో ఇక్కడ తెలుసుకుందాం..

న్యాయవాదులు నల్ల కోట్లు ఎందుకు ధరిస్తారు?

నిజానికి నలుపు రంగు న్యాయం, అధికారం, గౌరవానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. న్యాయవాదులు నల్ల కోటు ధరించి కోర్టులోకి ప్రవేశించినప్పుడు, అది వారి పని తీవ్రత, నిష్పాక్షికతను ప్రతిబింబిస్తుంది. ఈ రంగు న్యాయంలో పక్షపాతం లేదని, నిర్ణయాలు పూర్తి నిష్పాక్షికంగా తీసుకోబడతాయని సూచిస్తుంది. న్యాయం కోసం.. న్యాయవాదులు, న్యాయమూర్తులు విధుల్లో ఉన్నప్పుడు నల్ల కోట్లు ధరిస్తారు. మరో ముఖ్య విషయం ఏమిటం.. నలుపు రంగులో ఎటువంటి మరకలు అంత తేలికగా కనిపించవు. దీనివల్ల న్యాయవాదులు ఎల్లప్పుడూ ప్రొఫెషనల్‌గా కనిపిస్తారు. ఒక విధంగా ఇది వారి వ్యక్తిగత, వృత్తిపరమైన ఇమేజ్‌ను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. న్యాయవాదులు నల్ల కోట్లు ధరించడం వెనుక ఉన్న చరిత్ర విషయానికొస్తే.. 17వ శతాబ్దంలో బ్రిటిష్ రాజు చార్లెస్ II మరణం తర్వాత న్యాయవాదులు, న్యాయమూర్తులు అతని మరణానికి సంతాపం తెలుపుతూ నల్లటి దుస్తులు ధరించారట. కానీ కాలక్రమంగా అది ఒక సంప్రదాయంగా కొనసాగింది.

వైద్యులు తెల్ల కోట్లు ఎందుకు ధరిస్తారు?

వైద్యులు తమ విధి నిర్వహణలో తెల్లటి కోట్లు ధరిస్తారు. దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే.. తెలుపు రంగు స్వచ్ఛత, పరిశుభ్రత, విశ్వాసానికి చిహ్నం. వైద్యుడి తెల్లటి కోటు స్వచ్ఛత, పరిశుభ్రత, నిజాయితీని సూచిస్తుంది. రోగులు తెల్లటి కోటు ధరించిన వైద్యుడిని చూసినప్పుడు.. ఆ వైద్యుడు తమ ఆరోగ్యాన్ని పూర్తిగా కాపాడుతాడనే నమ్మకం వారికి కలుగుతుంది. తెల్ల రంగు ప్రభావం చాలా గాఢంగా ఉంటుంది. తెల్లటి కోటు ధరించిన వైద్యుడిని చూసినప్పుడు రోగులు శాంతి, భద్రతా భావాన్ని పొందుతారు.

ఇవి కూడా చదవండి

వైద్యులు ధరించే తెల్లటి కోటుల చరిత్రను పరిశీలిస్తే..19వ శతాబ్దం మధ్యకాలంలో వైద్య శాస్త్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దీంతో అప్పటి నుంచి వైద్యులు తెల్లటి కోట్లు ధరించడం ప్రారంభించారు. తెల్లటి వస్తువులపై మరకలు సులభంగా కనిపిస్తాయి. దీని వలన వైద్యులు తరచుగా శుభ్రత, పరిశుభ్రతను ప్రశ్నిస్తారు. తెలుపు రంగు ఆరోగ్యం, స్వచ్ఛతను సూచిస్తుంది. ఆసుపత్రులు, క్లినిక్‌లలో పరిశుభ్రత స్థాయి చాలా ముఖ్యం. దీనిని దృష్టిలో ఉంచుకుని తెల్లటి కోట్లు ధరిస్తారు. ఇది వైద్యులకు పరిశుభ్రత ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. అంతేకాకుండా తెల్లటి కోటు ధరించడం వల్ల వైద్యులు ప్రొఫెషనల్‌గా, విశ్వసనీయంగా కనిపిస్తారు. ఇది రోగుల నమ్మకాన్ని పొందడంలో వారికి సహాయపడుతుంది. అందువలన న్యాయవాది నల్ల కోటు నిష్పాక్షికతను సూచిస్తే.. వైద్యుడి తెల్ల కోటు నమ్మకం, స్వచ్ఛతను ప్రతిబింబిస్తుంది.

మరిన్ని జీవన శైలి కథనాల కోసం క్లిక్‌ చేయండి.