Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: వెల్లుల్లిని పొట్టు తీసి ఫ్రిడ్జ్ లో నిల్వ చేస్తున్నారా..! అనారోగ్యానికి వెల్కమ్ చెప్పినట్లే…

వెల్లుల్లిని నిల్వ చేయడానికి పొట్టు తీసి వాటిని రిఫ్రిజిరేటర్‌లో పెట్టడం వలన ఫంగస్ పేరుకుపోవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వాటిని తినే ఆహారం వేసుకుని ఆహార తయారు చేసుకుని తినడం వలన రకరకాల వ్యాధుల బారిన పడతారు అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎవరికైనా వెల్లుల్లిని పొట్టు తీసి వాటిని ఫ్రిజ్‌లో పెట్టి.. దీనీతో తయారుచేసిన ఆహారాన్ని తినడం వద్దు అంటూ హెచ్చరిస్తున్నారు. ఈ రోజు ఇలా చేయడం వలన కలిగే నష్టాలూ ఎఇతో తెలుసుకుందాం.

Kitchen Hacks: వెల్లుల్లిని పొట్టు తీసి ఫ్రిడ్జ్ లో నిల్వ చేస్తున్నారా..! అనారోగ్యానికి వెల్కమ్ చెప్పినట్లే...
Garlic Preservation
Follow us
Surya Kala

|

Updated on: May 29, 2024 | 10:41 AM

భారతీయులు ఆహార ప్రియులు. రకరకాల రుచికరమైన వంటలు తయారు చేస్తారు. తయారు చేసే ఆహారానికి అదనపు రుచి కోసం మసాలాలు ఉపయోగిస్తారు. అంతేకాదు భారతీయుల ఆహారంలో ఎక్కువగా వినియోగించేవి ఉల్లి, వెల్లుల్లి. వీటిని వినియోగించి ఆహారానికి అదనపు రుచిని చేరుస్తాయి. మసాలాలో ఉపయోగించే వెల్లుల్లిలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో వెల్లుల్లిని రకరకాల వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. ప్రతి ఇంట్లో ఉపయోగించే వెల్లుల్లిని ఉపయోగించాలంటే వెల్లుల్లి పొట్టు తియ్యడం ఒక పెద్ద పనిలా అనిపిస్తుంది. ఎందుకంటే పొద్దున్నే ఓ వైపు పని, మరోవైపు వంట దీంతో వెల్లులి పొట్టుని అప్పటికప్పుడు తీసి వినియోగించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ నేపధ్యంలో చాలామంది ఖాళీ సమయంలో వెల్లుల్లిని పొట్టు తీసి శుభ్రం చేసుకుంటారు. అలా వెల్లుల్లి పాయలను ఫ్రిడ్జ్ లో పెట్టి కావలసినప్పుడు ఉపయోగించుకుంటారు. అయితే ఇలా వెల్లుల్లి పొట్టు తీసి ఫ్రిడ్జ్ లో పెట్టి నిల్వ చేసుకుని తినడం మంచిది కాదు అని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వెల్లుల్లిని నిల్వ చేయడానికి పొట్టు తీసి వాటిని రిఫ్రిజిరేటర్‌లో పెట్టడం వలన ఫంగస్ పేరుకుపోవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వాటిని తినే ఆహారం వేసుకుని ఆహార తయారు చేసుకుని తినడం వలన రకరకాల వ్యాధుల బారిన పడతారు అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎవరికైనా వెల్లుల్లిని పొట్టు తీసి వాటిని ఫ్రిజ్‌లో పెట్టి.. దీనీతో తయారుచేసిన ఆహారాన్ని తినడం వద్దు అంటూ హెచ్చరిస్తున్నారు. ఈ రోజు ఇలా చేయడం వలన కలిగే నష్టాలూ ఎఇతో తెలుసుకుందాం.

తేమ పెరుగుతుంది..

ఇవి కూడా చదవండి

రిఫ్రిజిరేటర్‌లో వెల్లుల్లిని నిల్వ చేయాలంటే గాలి చొరబడని కంటైనర్‌ని ఉపయోగించాలి. దీనిలో పొట్టు తీసిన వెల్లుల్లిని నిల్వ చేయడం అత్యంత ప్రయోజనకం. లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టినా సరే అది చెడిపోయే అవకాశం ఎక్కుడ. రిఫ్రిజిరేటర్‌లో తేమ ఎక్కువగా ఉంటుంది. కనుక పొట్టు తీసిన వెల్లుల్లికి ఫంగస్‌ పట్టే అవకాశాలు ఎక్కువ.

ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు.. ఫ్రిడ్జ్ లో పెట్టిన వస్తువుల కోసం పదే పదే డోర్ తెరచి మూసి వేస్తూ ఉంటారు. దీంతో రిఫ్రిజిరేటర్ లో ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఇలాంటి సందర్భంలో పొట్టు తీసిన వెల్లుల్లిలో శీలీంధ్రాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.

కాలుష్య స్థితి వెల్లుల్లిని శుభ్రంగా ఒలిచి దీనిని నిల్వ చేసే కంటైనర్ విషయంలో తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వెల్లులికి ఫంగస్ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తుంది.

ఆక్సీకరణను పెంచుతుంది.. వెల్లుల్లి ఒలిచిన తర్వాత దీనిలో ఆక్సీకరణ ప్రక్రియ వేగంగా పెరుగుతోంది. అయితే ఒలిచిన వెల్లుల్లి క్రమంగా నల్లగా మారి కొద్ది రోజుల్లోనే పాడైపోతుంది.

తాజాగా వెల్లుల్లిని ఉపయోగించాలి.. ఎప్పటి కప్పుడు ఒలిచిన వెల్లుల్లిని మాత్రమే ఆహార తయారీలో వినియోగించాలని నిపుణుల చెబుతున్నారు.

మరిన్ని tv9teluguకోసం ఇక్కడ క్లిక్ చేయండి..