Viral Video: మానవత్వం ఇంకా బతికే ఉంది! తల్లీకొడుకుల ఈ వీడియో చూసి చెమర్చిన నెటిజన్ల హృదయం..
చాలా సార్లు రోడ్డు మీద ప్రమాదబారిన పడిన , కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడానికి బదులుగా.. నిలబడి అదేదో ఓ వింత దృశ్యంగా నిలబడి వినోదం చూసినట్లు ఈ దృశ్యాన్ని చూస్తున్నారు. అదే సమయంలో కొంతమంది ఇతరుల బాధలను, కష్టాలను చూడలేరు. తమకు తోచిన సహాయం చేయడంలో నిమగ్నమై ఉంటారు. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీ హృదయానికి ఖచ్చితంగా సంతోషం కలుగుతుంది.
ప్రతి ఒక్కరూ పేదలకు, ఆపన్నులకు సహాయం చేయాలి. ఇలా చేయడం హృదయానికి శాంతిని ఇవ్వడమే కాదు మీ నుంచి సహాయం అందుకున్న వ్యక్తులకు ఆనందాన్ని కూడా ఇస్తుంది. ఇదే నిజమైన మానవత్వం కూడా.. అయితే ప్రస్తుత కాలంలో మానవత్వం ఎంత మందికి మిగిలి ఉంది? అంటే మిలియన్ డాలర్ల ప్రశ్నే.. చాలా సార్లు రోడ్డు మీద ప్రమాదబారిన పడిన , కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడానికి బదులుగా.. నిలబడి అదేదో ఓ వింత దృశ్యంగా నిలబడి వినోదం చూసినట్లు ఈ దృశ్యాన్ని చూస్తున్నారు. అదే సమయంలో కొంతమంది ఇతరుల బాధలను, కష్టాలను చూడలేరు. తమకు తోచిన సహాయం చేయడంలో నిమగ్నమై ఉంటారు. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీ హృదయానికి ఖచ్చితంగా సంతోషం కలుగుతుంది.
అసలైన ఈ వీడియోలో బైక్ నడుపుతున్న వ్యక్తి చిన్న పిల్లవాడికి సహాయం చేస్తున్నాడు. ఓ మహిళ తన బిడ్డతో రోడ్డు దాటేందుకు ప్రయత్నించడం వీడియోలో చూడవచ్చు. ఈ సమయంలో బాలుడికి కాళ్లకు చెప్పు లేవు.. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తీ.. ఆ తల్లిబిడ్డను ఆపి స్వయంగా పిల్లాడికి చెప్పులు ధరింపజేశాడు. తల్లితో పాటు రోడ్డు దాటు తున్న పిల్లవాడికి కాళ్ళకు చెప్పులు లేవు, టీ-షర్టు, ప్యాంటు ధరించలేదు. ఇప్పుడు అటుగా వెళ్తున్న బైక్ రైడర్ ఇది గమనించి చిన్నారిని దగ్గరకు తీసుకుని బట్టలు, చెప్పులు కొని వేసుకోవడానికి ఇచ్చాడు. ఆ చిన్నారి చేసిన ఈ చిన్న సాయం వల్ల ఆ చిన్నారి తల్లి ముఖంలో కనిపించే ఆనందం వెలకట్టలేనిది.
వీడియో చూడండి
इंसानियत जिंदा है अभी दुनिया में..👏👏👏 pic.twitter.com/D9fUiifprt
— Preeti bhokar (@Preeti_bhokar) May 26, 2024
ఈ హృదయాన్ని హత్తుకునే వీడియో @Preeti_bhokar అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ప్రపంచంలో మానవత్వం ఇంకా సజీవంగా ఉంది’ అని శీర్షికతో షేర్ చేశారు. కేవలం 41 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 43 వేలకు పైగా వ్యూస్ ను, 2 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు.
అదే సమయంలో, వీడియోను చూసిన తర్వాత నెటిజనలు రకరకాల ప్రతిచర్యలను కూడా ఇచ్చారు. ఒకరు, ‘ఇది నిజమైతే, ఇది చాలా అద్భుతంగా , ఉద్వేగభరితంగా ఉంది’ అని వ్రాశారు, మరొకరు చాలా మంది బైక్ రైడర్‌ల మనసు చాలా మంచిది . ఎందుకంటే వారికి జీవితాన్ని ఎలా జీవించాలో బాగా తెలుసు అని వ్యాఖ్యానించారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్క్కడ క్లిక్ చేయండి..