Viral Video: ఫేమస్ అవ్వాలని ప్రమాదకర పాముతో పోజులు.. కట్‌చేస్తే.. ఊహించని షాక్.. టెర్రిబుల్ వీడియో

వారిద్దరూ పాములు పట్టేవారు.. అయితే.. ఎవరైన ప్రమాదంలో ఉంటే వారి దగ్గరకు వెళ్లి పాములను రెస్క్యూ చేయాలి.. కానీ.. అలా కాకుండా.. ఈ స్నేక్ క్యాచర్స్ ఓ అరుదైన పాముతో ఆటలాడుకున్నారు.. ర్యాట్ స్నేక్‌ను ఓ ఇంటినుంచి రెస్క్యూ చేశారు.. అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి ఫొటోలకు పొజులిచ్చారు.. వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్ చేశారు..

Viral Video: ఫేమస్ అవ్వాలని ప్రమాదకర పాముతో పోజులు.. కట్‌చేస్తే.. ఊహించని షాక్.. టెర్రిబుల్ వీడియో
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 29, 2024 | 12:07 PM

వారిద్దరూ పాములు పట్టేవారు.. అయితే.. ఎవరైన ప్రమాదంలో ఉంటే వారి దగ్గరకు వెళ్లి పాములను రెస్క్యూ చేయాలి.. కానీ.. అలా కాకుండా.. ఈ స్నేక్ క్యాచర్స్ ఓ అరుదైన పాముతో ఆటలాడుకున్నారు.. ర్యాట్ స్నేక్‌ను ఓ ఇంటినుంచి రెస్క్యూ చేశారు.. అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి ఫొటోలకు పొజులిచ్చారు.. వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్ చేశారు.. చివరకు ఈ విషయం అటవీశాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో.. వారు దిమ్మతిరిగేలా షాకిచ్చారు.. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటుచేసుకుంది.. రెస్క్యూ చేసిన ర్యాట్ స్నేక్ ను ప్రదర్శించి, దాని వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినందుకు ఇద్దరు వ్యక్తులు చిక్కుల్లో పడ్డారు. ఎనిమిది అడుగుల పొడవున్న ఇండియన్ ర్యాట్ స్నేక్ ను చట్టవిరుద్ధంగా నిర్వహించడం, దాని వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వంటి ఆరోపణలపై కోయంబత్తూరు పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

అటవీ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. మే 22న పులియాకుళానికి చెందిన పాములు పట్టేవారు అబ్దుల్ రెహమాన్ అలియాస్ సంజయ్, చిన్నవేదంపట్టికి చెందిన మహేశ్వరి.. ఓ ఇంటి నుంచి పామును రెస్క్యూ చేశారు.. అనంతరం దానితో ఆడుకుంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

వీడియో చూడండి..

“ఇది ర్యాట్ స్నేక్.. ఇది వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972లోని షెడ్యూల్ I (పార్ట్ సి) కింద రక్షించబడింది. జంతువులను వేటాడటం మరియు బంధించడాన్ని నిషేధిస్తుంది. కొన్ని రోజుల క్రితం పులియాకుళం ప్రాంతంలోని ఇంట్లోకి ప్రవేశించినప్పుడు వారు పామును రక్షించారు. అటవీ శాఖకు ఇవ్వడానికి ముందు, వారు పామును పట్టుకుని వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు”అని ఒక అధికారి తెలిపారు.

ఒక పామును రక్షించినట్లయితే, దానిని వెంటనే గోనె సంచిలో ఉంచాలి. ఏ రూపంలోనూ దానిని ప్రదర్శించకూడదు. ఈ వీడియో అటవీ శాఖకు తెలియడంతో అధికారులు విచారణ చేపట్టారు. మంగళవారం ఇద్దరు వ్యక్తులను డిపార్ట్‌మెంట్ అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేసిందని అధికారి తెలిపారు.

పాములు పట్టేవారు ఎటువంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా అటవీ శాఖ ఇచ్చిన భద్రతా ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉండాలి. కానీ, పబ్లిసిటీ కోసం, డబ్బు సంపాదించడం కోసం చాలామంది పాములను ప్రదర్శిస్తుంటారు. అటువంటి వాటిపై చర్యలు తప్పవు అంటూ అటవీ శాఖ అధికారి హెచ్చరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..