Panipuri Bouquet: కుమార్తె పుట్టిన రోజుకి పానీపూరీ బోకేని ఇచ్చిన తల్లి.. నెట్టింట వీడియో వైరల్..
నార్త్ ఇండియన్ స్నాక్ దక్షిణాదిలో అడుగు పెట్టి.. పల్లెల్లో కూడా తన సత్తా చాటింది. ఇప్పుడు ఏకంగా అగ్ర రాజ్యం అమెరిక వైట్ హౌస్ లోనే సందడి చేసింది. అంత పిచ్చి పానీ పూరీ అంటే అమ్మాయిలకు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియోలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇది పానీ పూరీ లవర్స్ కు తెగ నచ్చేసింది కూడా.. ఒక అమ్మాయికి పానీపూరీ అంటే విపరీతమైన ఇష్టం. ఎంత ఇష్టం అంటే.. ఆ అమ్మాయి పుట్టిన రోజుకి బహుమతిగా 'గొల్గప్పా ప్రేమ్'ని ఇచ్చేటంత. తన కుటుంబ సభ్యులు తన పుట్టినరోజుకి ఇచ్చిన ప్రత్యేకమైన బహుమతిని చూసి ఆ యువతి కూడా ఆశ్చర్యపోయింది.
పానీపూరీ తినడం ఎవరికి ఇష్టం ఉండదు? ఎవరూ తినడానికి నిరాకరించలేని వీధి ఆహారం ఇది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ గొల్గప్పలను ఎంతో ఇష్టంగా తింటారు. ప్రతిరోజూ స్ట్రీట్ ఫుడ్ లో రారాజు పానీ పూరీ అని చెప్పవచ్చు. ముఖ్యంగా సాయంత్రం అయితే చాలు పానీ పూరీ షాప్ దగ్గర అమ్మాయిల సందడి నెలకొంటుంది. పొట్టనిండింది ఇక తినలెం అన్నవారు కూడా పానీ పూరీ తిందాం అనగానే సై అంటూ రెడీ అయిపోతారు. ఈ నార్త్ ఇండియన్ స్నాక్ దక్షిణాదిలో అడుగు పెట్టి.. పల్లెల్లో కూడా తన సత్తా చాటింది. ఇప్పుడు ఏకంగా అగ్ర రాజ్యం అమెరిక వైట్ హౌస్ లోనే సందడి చేసింది. అంత పిచ్చి పానీ పూరీ అంటే అమ్మాయిలకు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియోలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇది పానీ పూరీ లవర్స్ కు తెగ నచ్చేసింది కూడా.. ఒక అమ్మాయికి పానీపూరీ అంటే విపరీతమైన ఇష్టం. ఎంత ఇష్టం అంటే.. ఆ అమ్మాయి పుట్టిన రోజుకి బహుమతిగా ‘గొల్గప్పా ప్రేమ్’ని ఇచ్చేటంత. తన కుటుంబ సభ్యులు తన పుట్టినరోజుకి ఇచ్చిన ప్రత్యేకమైన బహుమతిని చూసి ఆ యువతి కూడా ఆశ్చర్యపోయింది.
వాస్తవానికి, ముంబైకి చెందిన రియా జైన్‌కు ఆమె తల్లి పుష్పగుచ్ఛాన్ని బహుమతిగా ఇచ్చింది. అయితే ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ బోకే పువ్వులతోనో.. పండ్లతోనో చేసింది కాదు. తన కూతురుకి ఇష్టమైన పానీ పూరీతో చేసింది. అవును పానీపూరీ బొకే.. మీరు చదివింది పూర్తిగా నిజమే. దీని వీడియో కూడా వైరల్‌గా మారింది. ఆ బొకేలో గోల్గప్పలను, తీపి పులుపు కలిపిన నీరు, స్టఫింగ్ చాట్ ను కలిపి అందమైన పానీ పూరీ బొకేగా అమర్చారు
ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను చేసిన రియా తన కుటుంబ సభ్యులు పానీపూరి బొకే ఇచ్చి తనను ఎలా ఆశ్చర్యపరిచారో చెప్పింది. పానీపూరీపై తన మక్కువ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుందని క్యాప్షన్‌లో పేర్కొంది. కొన్ని నెలల క్రితం తన పుట్టినరోజున మా అమ్మ, కుటుంబ సభ్యులు తనకు ఈ ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చారని వెల్లడించింది.
పానీపూరీ బొకే వీడియోను ఇక్కడ చూడండి
View this post on Instagram
రియా మాట్లాడుతూ తాను ఇంతకు ముందు ఇలాంటివి చూడలేదని చెప్పింది. అంతేకాదు కుటుంబ సభ్యుల ఆలోచనలు, సృజనాత్మకత తనను ఆశ్చర్యపరిచింది అని చెబుతూనే.. కుటుంబ సభ్యుల ప్రేమపై హర్షం వ్యక్తం చేసింది. ఈ పానీ పూరీ బోకే గురించి చాలా మంది తనను అడుగుతున్నారు.. ఈ రోజు నేను మీ అందరితో పంచుకుంటున్నాను. పానీపూరి బోకే ఆలోచనను ప్రజలు నిజంగా ఇష్టపడ్డారు. ముఖ్యంగా అమ్మాయిలకు బాగా నచ్చిందని చెప్పింది రియా.
ఈ ఆలోచన బాగుంది.. నాకు కూడా కావాలి అని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు బొకేగా గోల్ గప్పాను ఎలా రెడీ చేశారో ఎంత ఆలోచించినా తోచడం లేదని.. తనకు ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. ఇతరలు అమ్మాయిలకు బోకే ఇవ్వడం సరైన ఆలోచన అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..