AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pineapple Farmers: ఫైనాపిల్‌ను ప్రాసెస్ చేస్తూ.. తమ పంటను అదనపు ఆదాయంగా మార్చుకుంటున్న రైతులు.. ఎక్కడంటే

Pineapple Farmers: భారతదేశం(India)లో పెద్ద ఎత్తున అనాస పళ్ళను పండిస్తున్నారు. ఇవి దేశీయ అవసరాలను తీర్చడమే కాదు.. అనేక దేశాలకు అనాసపళ్ళను అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే నాణ్యమైన..

Pineapple Farmers: ఫైనాపిల్‌ను ప్రాసెస్ చేస్తూ.. తమ పంటను అదనపు ఆదాయంగా మార్చుకుంటున్న రైతులు.. ఎక్కడంటే
Processing Of Pineapple
Surya Kala
|

Updated on: Mar 07, 2022 | 12:25 PM

Share

Pineapple Farmers: భారతదేశం(India)లో పెద్ద ఎత్తున అనాస పళ్ళను పండిస్తున్నారు. ఇవి దేశీయ అవసరాలను తీర్చడమే కాదు.. అనేక దేశాలకు అనాసపళ్ళను అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే నాణ్యమైన పైనాపిల్‌ను ఈశాన్య రాష్ట్రా(Northeast India)ల్లో పండిస్తారు.  ఈ అనాస పండ్లను డైరెక్ట్ గా తింటారు. రసం రూపంలో కూడా ఉపయోగిస్తారు. అదే సమయంలో, పైనాపిల్ ఉత్పత్తులు కూడా ప్రాసెసింగ్ చేస్తున్నారు. ఇలా చేయడం వలన ఎక్కువ కాలం అనాస పండు నిల్వ ఉంటుంది. ఇలా ప్రాసెసింగ్ చేయడంతో అనాసపండ్లు నిల్వ ఉంటాయి.. రైతులకు ఆదాయం పెరగడంతోపాటు ఉపాధి అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.

ఏఏ రాష్ట్రాల్లో సాగు చేస్తారంటే: భారతదేశంలోని అస్సాం, మేఘాలయ, త్రిపుర, సిక్కిం, మిజోరాం, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక , గోవా వంటి రాష్ట్రాల్లో పైనాపిల్ సాగు అధికంగా చేస్తారు. అంతేకాదు గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్,  బీహార్‌లలో కూడా అక్కడక్కడ అనాసపళ్ళను పండిస్తారు. త్రిపురలో వివిధ రకాల పైనాపిల్‌కు రాష్ట్ర పండు హోదాకూడా ఉంది. కర్నాటకలో కూడా భారీ ఎత్తున ఉత్పత్తి అవుతోంది.

లక్ష హెక్టార్లలో పైనాపిల్ సాగు: మన దేశంలో 92 వేల హెక్టార్లలో 14 లక్షల 96 వేల టన్నుల ఫైనాఫిల్స్ ను వార్షికంగా  ఉత్పత్తి చేస్తున్నారు. పైనాపిల్‌లో విటమిన్ ఎ, బి, సి, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. పోషకాహారం సమృద్ధిగా ఉండటంతో దీని రసానికి గిరాకీ ఉంది. విదేశాల్లోనూ భారతీయ పైనాపిల్‌కు చాలా డిమాండ్‌ ఉంది. APEDA ద్వారా త్రిపుర నుండి అనేక దేశాలకు పైనాపిల్ కూడా ఎగుమతి చేస్తున్నారు.

రైతుల్లో వస్తున్న ఆలోచనలో మార్పు: నేటి కాలంలో రైతులు కేవలం పైనాపిల్ సాగుకే పరిమితం కావడం లేదు.  అనాసపళ్ళను ప్రాసెస్ చేస్తూ తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. అధునిక సాంకేతికత నైపుణ్యాన్ని ఉపయోగించి  రైతులు తమ ఉత్పత్తిని పెంచుకుంటున్నారు. మరోవైపు త్వరగా చేతికి వచ్చే పంట రకాలను శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. ఇంతకుముందు రెండేళ్లకు ఒకసారి దిగుబడి ఇస్తే.. ఇప్పుడు ఒక్క సంవత్సరంలోనే నాణ్యమైన దిగుబడి పంటను ఉత్పత్తి చేస్తున్నారు. అదే సమయంలో పొలంలో అంతకుముందు తక్కువ నారు పోసేవారు. ఇప్పుడు కొత్త రకాల పంటను పండించడం మొదలు పెట్టిన తరువాత ఇప్పుడు హెక్టారుకు మూడు రెట్లు అధికంగా మొక్కలు నాటుతున్నారు. దీని కారణంగా ఉత్పత్తిలో భారీ పెరుగుదల ఉంది.

పెద్దఎత్తున పైనాపిల్ సాగు చేస్తున్న రైతులు ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారు.  ఇలా చేయడం వలన రైతుల సంపాదన పెరగడంతో పాటు ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఎక్కువ ఉత్పత్తులను ఉత్పత్తి చేసే రైతులు తమ ఉత్పత్తులను విక్రయించడంలో కూడా ఇబ్బంది పడ్డారు.. అయితే ఇప్పుడు ప్రాసెసింగ్ యూనిట్ ను మొదలు పెట్టి.. అనాసను నిల్వ చేస్తుండడంతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది.

పైనాపిల్‌ను ప్రాసెస్ చేసే పద్దతి: పైనాపిల్ ప్రాసెసింగ్ కోసం, మొదట పై అనాస పండు నుండి పై భాగం వేరు చేస్తారు. యంత్రం సహాయంతో పై తొక్కను తొలగిస్తారు. యంత్రంతో  అనాసను శుభ్రం చేస్తారు. యంత్రం సహాయంతో, దానిని గుండ్రని ముక్కలుగా కట్ చేసి డబ్బాల్లో నింపుతారు. ఈ ప్రక్రియ అనంతరం పెద్ద ట్యాంకుల్లో చక్కెర,  ఇతర ముఖ్యమైన వస్తువులను వేసి.. మిశ్రమం తయారు చేస్తారు. ఈ షుగర్ మిశ్రమాన్ని..  పైనాపిల్ బాక్సుల్లో నింపి ప్యాక్ చేస్తారు. అనంతరం ఈ ప్యాక్ ను వేడి నీటిలో ఉంచుతారు. అనంతరం చల్లని నీటిలో ఉంచుతారు. ఇలా ప్రాసెస్ చేసిన ఫైనాపిల్ మిశ్రమం ఒక సంవత్సరం వరకూ సురక్షితంగా ఉంటుంది. ఇలా ప్రాసెస్ చేసిన ఫైనాపిల్ ను అమ్మకానికి మార్కెట్ కు సప్లై చేస్తున్నారు.

Also Read:

 ఈ కేంద్రప్రభుత్వ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకున్నారా? చివరితేదీ ఇదే..