AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parenting Tips: మీ పిల్లలను స్కూల్‌కు పంపిస్తున్నారా? తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త!

వర్షాకాలం సమీపిస్తోంది. ఇప్పటి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు, వేసవి సెలవులు కూడా ముగిశాయి. పాఠశాలలు తిరిగి తెరుస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపేందుకు సిద్ధమయ్యారు కూడా. అయితే, పిల్లలను స్కూళ్లకు పంపేటప్పుడు వారి ఆరోగ్యం, శ్రేయస్సు దృష్ట్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ సీజన్‌లో తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం,

Parenting Tips: మీ పిల్లలను స్కూల్‌కు పంపిస్తున్నారా? తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త!
Parenting Tips
Shiva Prajapati
|

Updated on: Jun 01, 2023 | 6:23 AM

Share

వర్షాకాలం సమీపిస్తోంది. ఇప్పటి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు, వేసవి సెలవులు కూడా ముగిశాయి. పాఠశాలలు తిరిగి తెరుస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపేందుకు సిద్ధమయ్యారు కూడా. అయితే, పిల్లలను స్కూళ్లకు పంపేటప్పుడు వారి ఆరోగ్యం, శ్రేయస్సు దృష్ట్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ సీజన్‌లో తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం, జీవనశైలికి సంబంధించి పరిగణించవలసిన కొన్ని ముఖ్యమైన సూచనలు, చిట్కాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వాటర్ ప్రూఫ్ ఎక్విప్‌మెంట్స్..

వాటర్‌ప్రూఫ్ జాకెట్‌లు, రెయిన్‌కోట్‌లు, గొడుగులు, రెయిన్ ప్రూఫ్ షూస్ వంటివి పిల్లల వద్ద ఉంచాలి. వర్షం కారణంగా వారు తడవకుండా ఉండేందుకు ఇవి దోహదపడుతాయి.

పరిశుభ్రత..

క్రిములు వ్యాపించకుండా ఉండటానికి భోజనానికి ముందు, తరువాత సబ్బుతో చేతులను శుభ్రంగా కడగాలి. ఇక రెస్ట్ రూమ్‌ని ఉపయోగించిన తర్వాత, పిల్లలు పాఠశాల నుండి ఇంటికి వచ్చిన తర్వాత కూడా సబ్బు, నీటితో చేతులు కడగాలి. ఇలా చేతులు కడుక్కునే అలవాటును పిల్లలకు నేర్పాలి. వీలైతే బ్యాగ్‌లో శానిటైజర్‌ని అందుబాటులో ఉంచాలి.

ఇవి కూడా చదవండి

ఆరోగ్యవంతమైన ఆహారం..

పిల్లల రోగనిరోధక శక్తిని పెంచడానికి పండ్లు, కూరగాయలతో కూడిన పోషకమైన ఆహారాన్ని అందించాలి. వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని ఇవ్వాలి.

హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి..

హైడ్రేటెడ్ గా ఉండటానికి పిల్లలు రోజంతా పుష్కలంగా నీరు త్రాగమని చెప్పాలి. పిల్లల శరీరం వెచ్చగా ఉండటానికి, వారి రోగనిరోధక శక్తిని పెంచడానికి మూలికా టీలు, సూప్‌ల వంటివి ఇవ్వాలి. వర్షాకాలంలో వేడినీరు తాపడం మంచిది.

దోమల నుండి రక్షణ..

వర్షాకాలంలో దోమలు పెరుగుతున్నాయి. పిల్లలకు పొడవాటి స్లీవ్‌లు, ప్యాంట్‌లను వేయాలి. ఇవి వారి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి పిల్లలను రక్షించడానికి నిద్రవేళలో దోమల నివారణ చర్యలు తీసుకోవాలి. దోమతెరలను అమర్చాలి.

పాద సంరక్షణ..

శిశువు పాదాలను వర్షపు నీటికి తడిస్తే.. ఒక క్లాత్‌తో శుభ్రం చేయాలి. ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా యాంటీ ఫంగల్ పౌడర్లు, క్రీమ్స్ ఉపయోగించాలి. తడి పాదాలకు సాక్స్ అస్సలు వేయొద్దు.

మానసిక సపోర్ట్..

వర్షాకాలం పిల్లల మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి సమయంలో వారికి సపోర్ట్ ఇవ్వాలి. ఇండోర్ గేమ్స్, పక్కన కూర్చొని చదివించడం, వారితో కాసేపు సరదాగా కాలక్షేపం చేయడం, వంటివి చేయాలి.

వర్షం సమాచారంపై ఫోకస్..

భారీ వర్షాలు కురిసే సమయంలో వాతావరణ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. ఈ నోటిఫికేషన్‌పై ఓ కన్నేసి ఉంచాలి. వర్షం తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటే.. అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అలాగే పాఠశాలలు ఇచ్చే సూచనలపైనా ఫోకస్ పెట్టాలి.

ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా, తల్లిదండ్రులు వర్షాకాలంలో తమ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ కాలంలో పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడానికి అవసరమైన సర్దుబాట్లు చేయడం చాలా అవసరం.

మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..