AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Obesity: అధిక బరువున్న వారికి ఈ ప్రాణాంతక క్యాన్సర్‌ ప్రమాదం ఎక్కువట.. బీ కేర్ ఫుల్!

తప్పుడు జీవనశైలి తెచ్చే తంటాల్లో ఊబకాయం ఒకటి. ఈ సమస్య ప్రస్తుతం మన దేశంలో కూడా చాపకింద నీరులా వేగంగా వ్యాపిస్తుంది. అయితే బరువును వీలైనంత త్వరగా అదుపు చేసుకోకపోతే ప్రాణాంతక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

Obesity: అధిక బరువున్న వారికి ఈ ప్రాణాంతక క్యాన్సర్‌ ప్రమాదం ఎక్కువట.. బీ కేర్ ఫుల్!
ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి వైద్య ఖర్చులు పెరుగుతాయట. వయోజన పురుషులలో ఈ నిష్పత్తి 2021లో 10%కి పెరిగింది. ఇది క్రమంగా 76 నుండి 81 వరకు పెరుగుతుందని తెల్పింది. మహిళల్లో ఇది 10% ఉండగా.. అది 73 నుంచి 82కి పెరగడం ఖాయం అంటున్నారు.
Srilakshmi C
|

Updated on: Nov 03, 2024 | 1:19 PM

Share

ప్రస్తుత జీవనశైలి కారణంగా అనేక మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, గతి తప్పిన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం వంటివి ఊబకాయానికి దారితీస్తాయి. ఇలా బరువు పెరగడం అనేక రకాల వ్యాధులను ఆహ్వానిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఊబకాయుల్లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది వయస్సు ద్వారా మాత్రమే కాకుండా, జీవనశైలి ద్వారా కూడా ప్రభావితమవుతుంది. ప్యాంక్రియాస్‌లో మొదలయ్యే క్యాన్సర్‌ను ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటారు. ఈ గ్రంథి శరీరంలోని ముఖ్యమైన భాగం. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంద. శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఈ భాగంలో తలెత్తే క్యాన్సర్ చాలా తీవ్రమైన పరిణామాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అన్ని సాధారణ క్యాన్సర్ల కంటే చాలా ప్రమాదకరం. బతికే ఛాన్స్‌ చాలా తక్కువ. ఊబకాయం ఈ క్యాన్సర్‌కు ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ యువత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. బరువును అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

ఊబకాయం 50 ఏళ్లలోపు వారిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదాన్ని 20 శాతం పెంచుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఒహియో స్టేట్ యూనివర్శిటీ వెక్స్లర్ మెడికల్ సెంటర్ పరిశోధకుల ప్రకారం.. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గురించి జనాలకు పెద్దగా తెలియదు. అలాగే చాలా మంది ఈ వ్యాధి వృద్ధులకు మాత్రమే వస్తుందని అనుకుంటారు. కానీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సంభవం ప్రతి సంవత్సరం 1 శాతం పెరుగుతోంది. 40 ఏళ్లలోపు వారిలో కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయని అధ్యయనం వెల్లడించింది.

ఈ ఏడాది అక్టోబర్ 4 నుంచి 7 వరకు అమెరికాలో 1004 మందిని పరిశోధకులు సర్వే చేశారు. ఇందులో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాద కారకాలపై ప్రశ్నలు అడిగారు. 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పెద్దలలో సగం కంటే ఎక్కువ మంది (53 శాతం) వ్యాధి ప్రారంభ లక్షణాలు ఉన్నట్లు వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రకారం, వృద్ధులలో మూడింట ఒక వంతు (33 శాతం) ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దీన్ని తగ్గించుకోవడానికి మొదటి అడుగు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం. ఎందుకంటే ఊబకాయం ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని 20 శాతం పెంచుతుంది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ (ACS) ప్రకారం.. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌లలో 10 శాతం మాత్రమే జన్యుపరమైన ప్రమాదంతో ముడిపడి ఉన్నాయి. అయితే జీవనశైలిని వీలైనంతగా త్వరగా మెరుగుపరచుకుంటే ఈ ప్రమదం నుంచి త్వరగా బయటపడతారు. బరువు తగ్గడం చాలా మందికి సాధ్యమే. ఇది టైప్ 2 డయాబెటిస్, ఇతర క్యాన్సర్లు, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుందని నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే..

వికారం, ఉబ్బరం, అలసట, కామెర్లు, ఆకలి లేకపోవడం, తీవ్రమైన కడుపు నొప్పి.. ప్రధానంగా కనిపిస్తాయి. ఈ లక్షణాలలో ఏవైనా మీకు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us