AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Packaged Foods: ప్యాకేజ్డ్ ఫుడ్స్ తో క్యాన్సర్ ముప్పు.. మహిళలకు మరింత ప్రమాదం

అల్ట్రా పాసెస్ చేసిన ఆహారాలు అంటే ఫీజి డ్రింక్స్, ప్యాకెజ్ చేసిన బ్రెడ్, అలాగే తినడానికి సిద్ధంగా ఉండే భోజనం, అల్పాహారం, తృణధాన్యాలు వంటివి తరచూ తీసుకుంటే క్యాన్సర్ బారిన పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

Packaged Foods: ప్యాకేజ్డ్ ఫుడ్స్ తో క్యాన్సర్ ముప్పు.. మహిళలకు మరింత ప్రమాదం
Packaged Food
Nikhil
|

Updated on: Feb 03, 2023 | 1:55 PM

Share

మారుతున్న ఆహార అలవాట్ల కారణంగా ప్రతి ఒక్కరూ ప్యాకెజ్డ్ ఫుడ్ పై ఆధారపడాల్సి వస్తుంది. ప్రయాణ సమయంలో లేదా స్నాక్స్ తినడానికి కచ్చితంగా ప్యాకెజ్డ్ ఫుడ్ తినాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే అల్ట్రా పాసెస్ చేసిన ఆహారాలు అంటే ఫీజి డ్రింక్స్, ప్యాకెజ్ చేసిన బ్రెడ్, అలాగే తినడానికి సిద్ధంగా ఉండే భోజనం, అల్పాహారం, తృణధాన్యాలు వంటివి తరచూ తీసుకుంటే క్యాన్సర్ బారిన పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకించి అండాశయ, మెదడు క్యాన్సర్లు ఇబ్బంది పెడతాయి. ఎక్కువగా మహిళలు అండాశయ, రొమ్ము క్యాన్సర్ల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలు నివేదికల ప్రకారం తీసుకునే ఫుడ్ లో 10 శాతం అల్ట్రా ప్యాకెజ్డ్ ఫుడ్ వాడకం పెరిగితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం రెండు శాతం పెరుగుతుందని పేర్కొంటున్నారు. అదే అండాశయ క్యాన్సర్ లో అయితే 19 శాతం పెరుగుతుందని వివరిస్తున్నారు. అయితే ప్యాకెజ్డ్ ఫుడ్ వల్ల వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలేంటో ఓ లుక్కేద్దాం.

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ లో 10 శాతం వినియోగం పెరిగితే పెరుగుదల క్యాన్సర్ మరణాల్లో 6 శాతం పెరుగుదలతో పాటు రొమ్ము క్యాన్సర్ 16 శాతం పెరుగుదల ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే అండాశయ క్యాన్సర్ కూడా పెరుగుదల 30 శాతం వరకూ ఉంటుందని పేర్కొంటున్నారు. ప్యాకెజ్డ్ ఫుడ్ కేవలం క్యాన్సర్ ప్రమాదాన్ని మాత్రమే ఇతర ఆరోగ్య సమస్యలు పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. యూకేలో ఇటీవల చేసిన పరిశోధనల్లో పెద్దల్లో, పిల్లల్లో ప్యాకెజ్డ్ ఫుడ్ వినియోగం కారణంగా భవిష్యత్ లో పేలవమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తేలింది. అలాగే పెద్దల్లో టైప్ -2 డయాబెటిస్ పెరిగే అవకాశం ఉందని వెల్లడైంది. అలాగే పిల్లల్లో అయితే బాల్యం నుంచి యవ్వనం వరకూ అధిక బరువు సమస్యతో బాధపడతారని తేలింది. 

సాధారణంగా యూకేలో రోజు వారి ఆహారంలో సగానికి పైగా ప్యాకెజ్డ్ ఫుడ్ పైనే ఆధారపడతారు. ప్యాకెజ్డ్ ఫుడ్ ఫ్రెష్ గా ఉండడానికి వివిధ రసాయనాలు కలుపుతారు. దీంతో ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. డబ్ల్యూహెచ్ఓ, ఐక్యరాజ్య సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అధికారులు ప్రజలు తీసుకునే ఆహారంలో ప్యాకెజ్డ్ ఫుడ్ ను పరిమితంగా వాడాలని సూచించారని నివేదికలో పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..