Oats for Skin: ఓట్స్‌తో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు..

ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఓట్స్‌తో ఆరోగ్యమే కాకుండా.. చర్మాన్ని కూడా మెరిపించుకోవచ్చు. చర్మం అందంగా ఉండాలని అనుకోని వారుండరు. ఇందు కోసం మార్కెట్లో దొరికే కాస్ట్‌లీ ప్రోడెక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇంటి చిట్కాలు ఉపయోగిస్తే.. అంత ఖర్చు పెట్టి ప్రోడెక్ట్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. పైగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఓట్స చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో..

Oats for Skin: ఓట్స్‌తో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు..
Oats For Skin
Follow us

|

Updated on: May 02, 2024 | 4:56 PM

ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఓట్స్‌తో ఆరోగ్యమే కాకుండా.. చర్మాన్ని కూడా మెరిపించుకోవచ్చు. చర్మం అందంగా ఉండాలని అనుకోని వారుండరు. ఇందు కోసం మార్కెట్లో దొరికే కాస్ట్‌లీ ప్రోడెక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇంటి చిట్కాలు ఉపయోగిస్తే.. అంత ఖర్చు పెట్టి ప్రోడెక్ట్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. పైగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఓట్స చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో చక్కగా పని చేస్తుంది. సీజన్ ఏదైనా సరే స్కిన్ కేర్ అనేది చాలా ముఖ్యం. మరీ ఎక్కువ వేడి కానీ, ఎక్కువ చలి ఉన్నా చర్మ సమస్యలు వస్తాయి. కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఓట్స్‌లో ఎన్నో రకాల పోషకాలున్నాయి. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. వీటి వల్ల చర్మ రంగు కూడా మారుతుంది. ఓట్స్ మంచి ఎక్స్‌ఫోలియేటర్‌ అని చెప్పొచ్చు. ఓట్స్‌ని ఉపయోగించడం వల్ల చర్మ రంధ్రాలు తెరచుకుని.. దుమ్ము, ధూళి వంటివి తొలగుతాయి. ఓట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్ ఉంటాయి కాబట్టి.. చర్మ ఆరోగ్యం మెరుగు పడుతుంది.

ఓట్స్‌తో ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం:

రెండు స్పూన్ల ఓట్స్ పౌడర్, కొద్దిగా తేనె, కొద్దిగా పాలు వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పేస్ట్‌లా మిశ్రమం తయారవుతుంది. ఈ పేస్ట్‌ని ముఖం, మెడ, చేతులకు బాగా పట్టించండి. అవసరం అయితే కొద్దిగా వాటర్ వేసి.. మర్దనా చేసుకోండి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత క్లీన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ స్కిన్ చక్కగా మెరుగుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరో ప్యాక్:

కొద్దిగా ఓట్స్‌ పౌడర్ తీసుకుని అందులో టమాటా రసం కూడా కలిపి రాసుకోవచ్చు. ఈ ప్యాక్ కూడా ఓ 15 నిమిషాలు ఉంచి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ తొలగి.. శుభ్రపడుతుంది. అలాగే సాఫ్ట్‌గా స్కిన్ మెరిసిపోతుంది.

NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..