Heart Attack: గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స.. ప్రాణాలను నిలబెట్టొచ్చు

ఒకప్పుడు 50 ఏళ్లు నిండిన వారిలో మాత్రమే గుండెపోటు సమస్యలు కనిపించేవి. కానీ ప్రస్తుతం పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారు కూడా గుండె పోటు సమస్యల బారిన పడుతున్నారు. అయితే గుండెపోటు త్వరగా గుర్తిస్తే ప్రాణాలు నిలబెట్టుకోవచ్చు. సాధారణంగా గుండెపోటు వచ్చే ముందు చాలా మంది ఛాతిలో నొప్పిగా ఉంటుంది. అయితే అసిడిటీగా భావించి చాలా మంది లైట్‌ తీసుకుంటున్నారు...

Heart Attack: గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స.. ప్రాణాలను నిలబెట్టొచ్చు
Heart Attack
Follow us

|

Updated on: May 02, 2024 | 5:02 PM

ఇటీవల గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మారిన జీవిన విధానం తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, జీవన విధానంలో మార్పుల కారనంగా హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే గుండెపోటు వచ్చిన వెంటనే ప్రాథమిక చికిత్స అందిస్తే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. మీ పక్కన ఉన్న వారికి గుండె పోటు వచ్చిన వెంటనే కొన్ని రకాల చిట్కాలను పాటించడం ద్వారా వారి ప్రాణాలను మీరు నెలబెట్టిన వారవుతారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒకప్పుడు 50 ఏళ్లు నిండిన వారిలో మాత్రమే గుండెపోటు సమస్యలు కనిపించేవి. కానీ ప్రస్తుతం పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారు కూడా గుండె పోటు సమస్యల బారిన పడుతున్నారు. అయితే గుండెపోటు త్వరగా గుర్తిస్తే ప్రాణాలు నిలబెట్టుకోవచ్చు. సాధారణంగా గుండెపోటు వచ్చే ముందు చాలా మంది ఛాతిలో నొప్పిగా ఉంటుంది. అయితే అసిడిటీగా భావించి చాలా మంది లైట్‌ తీసుకుంటున్నారు. కానీ 50 ఏళ్లు నిండిన వారిలో ఈ సమస్య కనిపిస్తే. వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

ఇక ఒక వేళ వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించినా, ఉన్నపలంగా చెమటలు పట్టినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఒక ఒకవేళ వ్యక్తి గుండెపోటుకు గురై అపస్మారక స్థితిలోకి వెళితే వెంటనే బాధితుడిని వైద్యుడు వద్దకు తరలించే ప్రయత్నం చేయాలి. అప్పటి వరకు బాధితుడి ప్రాణాలు నిలబెట్టేందుకు వెంటనే నాలుక కింద ఆస్పిరిన్‌ ట్యాబ్లెట్‌ను పెట్టాలి. దీనివల్ల ధమనుల్లో గడ్డ కట్టిన రక్తం వెంటనే ద్రవంగా మారుతుంది. రక్తం గడ్డకట్టడం వల్లే హార్ట్ ఎటాక్‌ వస్తుందని తెలిసిందే. ఇక వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్తే వెంటనే సీపీర్‌ ప్రారంభించాలి.

బాధితుడికి కృత్రిమంగా నోటి ద్వారా గాలిని అందించాలి. అనంతరం ఛాతిపై నొక్కాలి. రోగి స్పందించే వరకు ఇలా చేస్తూనే ఉండాలి. పల్స్‌ పూర్తిగా ఆగిపోతే మరింత వేగంగా ఈ ప్రాసెస్‌ను రిపీట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఆగిన శ్వాస మళ్లీ లభిస్తుంది. అనంతరం ఏ మాత్రం ఆలస్యంగా చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..