Sugarcane Juice: ఎండాకాలంలో అమృతమే.. చెరుకు రసం ఎందుకు తాగాలో తెలుసా..?

ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భానుడి భగభగలతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హైడ్రేటెడ్‌గా ఉండేందుకు ద్రవపదార్థాలను, పండ్ల రసాలను తీసుకోవడం మంచిది. అయితే, అలాంటివాటిలో చెరుకు రసం ఒకటి..

Sugarcane Juice: ఎండాకాలంలో అమృతమే.. చెరుకు రసం ఎందుకు తాగాలో తెలుసా..?
Sugarcane Juice
Follow us

|

Updated on: May 02, 2024 | 4:56 PM

ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భానుడి భగభగలతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హైడ్రేటెడ్‌గా ఉండేందుకు ద్రవపదార్థాలను, పండ్ల రసాలను తీసుకోవడం మంచిది. అయితే, అలాంటివాటిలో చెరుకు రసం ఒకటి.. ముఖ్యంగా వేసవిలో చెరకు రసం చాలా మందికి ఇష్టమైన పానీయం. ఆరోగ్యానికి చాలా మంచిది. చెరకు రసంలో జీరో ఫ్యాట్, కొలెస్ట్రాల్, ఫైబర్, ప్రోటీన్ ఉంటాయి. మంచిగా కేలరీలు, సహజ చక్కెరను కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన అత్యంత పోషకమైన పానీయం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అయితే.. ఈ వేసవిలో చెరుకు రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకోండి..

తక్షణ శక్తి : చెరకు రసంలో సుక్రోజ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఎనర్జిటిక్ గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

వృద్ధాప్యాన్ని నిరోధించే గుణాలు: ఇందులో ఫినాలిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అకాల వృద్ధాప్యాన్ని నిరోధించడంతోపాటు.. చర్మంపై ముడతలు లేకుండా క్లియర్‌గా ఉంచుతుంది.

గర్భిణీలకు మేలు: ఇందులో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం ఉండటం వల్ల గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది.

ఔషధం: ఆయుర్వేద వైద్యం ప్రకారం.. చెరకు రసం ఔషధంలా పనిచేస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడటంతో సహాయపడుతుంది.

జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది: చెరకు రసంలో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి.. ఇవి జీర్ణ సమస్యలను నివారించడంతోపాటు.. కడుపును ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.

వాస్తవానికి ఇంట్లో చెరుకు రసం తయారు చేయడం అంత సులభం కాదు. కాబట్టి, మీ ఇంటికి సమీపంలోని విక్రేత నుండి కొనుగోలు చేయడం మేలు..

అయితే, ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు.. చెరుకు రసం తాగడం అంత మంచిది.. ఏమైనా దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది.. కావున వైద్యలను సంప్రదించడం మంచిది..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..